గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 December 2014

సూర్యనమస్కారం ఎలా చేయాలో చూద్దాం:

ప్రస్తుత జీవన శైలిలో మార్పుల వల్ల ఎన్నోరకాల మానసిక ఒత్తిళ్లలో కొట్టుమిట్టాడుతున్నాం. రానురాను ఈ ఒత్తిళ్లు కాస్తా శారీరక రుగ్మతలుగా రూపాంతరం చెంది మనో శారీరక రుగ్మతలు (సైకోసొమాటిక్)గా పరిణమిస్తాయి. ఆధునిక వైద్య విధానం అవలంబించే మాత్రలు, ఇంజక్షన్స్ ఈ రోగాల నుంచి తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తున్నాయి. కాని పూర్తిగా నివారించలేక పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో యోగాను మించిన సాధనం లేదని అందరూ అంగీకరిస్తున్నారు. వ్యాధులు నయం చేయటమే కాకుండా నివారించే సామర్థ్యం కూడా యోగాకు ఉంది. యోగాభ్యాసం ద్వారా తక్కువ శక్తిని ఖర్చు చేసుకుని ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. ఇందుకోసం జిమ్‌లకు వెళ్లి కష్టపడనవసరంలేదు.ఎప్పుడైనా ఎక్కడైనా ఇంట్లోఅయినా చేయవచ్చు. అందుకే ఈబిజీ జీవితంలో ఎక్కువమంది యోగాపట్ల ఆసక్తి చూపిస్తున్నారు. యోగా లో మొదట మనం తెలుసుకోవాల్సింది సూర్య నమస్కారం.. సూర్యనమస్కారం: దీనినే ఇంగ్లీష్‌లో ‘సన్ సాల్యు అని అంటారు. సూర్య భగవానుడికి నమస్కరిస్తూ చేసే పన్నెండు ఆసనముల ప్రక్రియనే సూర్య నమస్కారములు. దీనినే ఒక ఎక్సర్‌సైజుగా చేయవచ్చు. లేదా ఆసనాలు వేసిన తర్వాత ఆఖరులో కూడా చేయవచ్చు. మొత్తం ఆసనాలు ఒక క్రమ పద్ధతిలో వెన్నెముకను ముందుకు, వెనకకు స్ట్రెచ్ చేస్తాయి. అవి 1. ప్రణామాసనం, 2. హస్త ఉత్తానాసనం 3. హస్త పాదాసనం, 4. అశ్వచాలనాసనం, 5. అదండాసనం 6. అష్టాంగ నమస్కారం, 7. సర్పాసనం, 8.అధోముఖశ్వాసాసనం, 9. అశ్వచారినాసనం, 10. హస్తపాదాసనం, 11. ఊర్ద్వ హస్తాసనం, 12. ప్రణామాసనం. వీటిని పొద్దున సూర్యోదయం సమయంలో చేసినట్లయితే మంచి ఫలితం పొందవచ్చు.
సూర్యనమస్కారం ఎలా చేయాలో చూద్దాం: ఖాళీ కడుపుతో చెయ్యాలి. తిన్నా రెండుగంటలాగి ఆ తర్వాత చెయ్యాలి. నేల మీద మ్యాట్ వేసుకుని చేయాలి. మొదట మాత్రం మూడు రౌండ్స్‌తో మొదలుపెట్టాలి. నెమ్మదిగా 12 వరకు చెయ్యవచ్చు. చేసిన తర్వాత శవాసనంలో తప్పక రిలాక్స్ అవ్వాలి.
1) ప్రణామాసనం : పాదాలు రెండూ దగ్గరగా ఉంచి చేతులు నమస్కార స్థితిలో ఉంచి హృదయ స్థానం దగ్గర ఛాతీకి బొటన వేళ్లు తగిలేటట్లు ఉంచాలి. ఒక సారి గాలి పీల్చి వదలాలి.
2) హస్త ఉత్తానాసనం : గాలి పీలుస్తూ నెమ్మదిగా చేతులు పైకి లేపి సాధ్యమైనంత వెనక్కు వంగాలి. శరీరమంతా ఒక విల్లులాగా వంచాలి.
3) పాదహస్తానం : గాలిని వదులుతూ పాదాల పక్కగా అరచేతులను నేలకు తాకిస్తూ మోకాళ్లకు నుదిటిని ఆనించాలి.
4) అశ్వసంచలనాసనం : గాలిని తీసుకుంటూ కుడి కాలును వీలైనంత వెనుకగా ఉంచి మోకాలును నేలకు ఆనించాలి. తలను పైకెత్తాలి.
5) దండాసనం : గాలిని కుంచిస్తూ ఎడమ కాలిని వెనక్కు తీసుకువచ్చి రెండు కాళ్ల వేళ్లను నేలకు తాకించి శరీరమంతటినీ దండం వలే నిటారుగా ఉంచాలి.
6) అష్ఠాంగ నమస్కారాసనం : గాలిని వదులుతూ మోకాళ్లు, ఛాతీని నేలకు ఆనించాలి. నడుమును కిందకు వంచకుండా గాలిలోనే ఉంచాలి.
7) భుజంగాసనం : శరీరాన్ని ముందుకు లాగి గాలిని తీసుకుంటూ తల, ఛాతీ, చేతులు నిటారుగా వచ్చే దాకా పైకి ఎత్తాలి.
8) పర్వతాసనం : కాళ్లు, చేతులు వాటి స్థానాల నుంచి కదలకుండా గాలిని వదులుతూ నడుమును పూర్తిగా పైకి ఎత్తాలి.
9) అశ్వసంచలనాసనం : గాలిని తీసుకుంటూ కుడి కాలును ముందుకు తెచ్చి రెండు హస్తాల మధ్య ఉంచాలి.
10) హస్త పాదహస్తానం : గాలిని వదులుతూ ఎడమ కాలిని కుడికాలు ప్రక్కకు తీసుకురావాలి.
11) హస్త ఉత్తానాసనం : గాలిని తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసి శరీరాన్ని వెనక్కు వంచాలి.
12) ప్రణామాసనం : చేతులు నమస్కార స్థితిలో ఉంచి ఒక సారి గాలిని తీసుకుని వదలాలి. తర్వాత చేతులు కిందకు దించి నిటారుగా నిలబడాలి.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML