
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 19 December 2014
ఆముక్తమాల్యదలోని మొట్టమొదటి పద్యములో
ఆముక్తమాల్యదలోని మొట్టమొదటి పద్యములో శ్రీవేంకటేశ్వరుని స్తుతించి కావ్యనియమములను అనుసరించి నమస్క్రియతో మరియు 'శ్రీ' శబ్దం తో కావ్యామారంభించినాడు.
శ్రీ కమనీయ హారమణి జెన్నుగ దానును, గౌస్తుభంబునం
దాకమలావధూటియునుదారత దోప పరస్పరాత్మలం
దాకలితంబు లైన తమ యాకృతు లచ్ఛత బైకి దోపన
స్తోకత నందు దోచె నన శోభిలు వేంకట భర్త గొల్చెదన్.
సాధారణంగా శార్దూలము తో గాని, విక్రీడితము తో గాని కావ్యమును ప్రారంభించుట పరిపాటియైన కాలములో, ఈ కావ్యము ఉత్పలమాల తో ప్రారంభమైనది. మహాలక్ష్మి, శ్రీవేంకటేశ్వరులు, ఇరువురి వక్షస్థలములందు పరస్పరము రూపములు ప్రతిఫలించుట ద్వారా కావ్యకథలోని ఆముక్తమాల్యద, గోదాదేవి రంగనాయక స్వామి వారి పరిణయ వృత్తాంతమును సూచించి రాయలు వస్తు నిర్దేశము గావించెను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment