గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 14 December 2014

దేవతల ఆరాధనము లేక పూజావిధానము.శ్లో|| "అభషేక ప్రియశ్శివః విష్ణుస్త్వంలంకార ప్రియః | సూర్యో నమస్కార ప్రియః |
గణపతి స్తర్పణ ప్రియః | దేవీ త్వర్చనా ప్రియః ...................................."
శివుడు అభిషేకం వలన ఆనందిస్తాడు. విష్ణువు అలంకార ప్రియుడు. సూర్యునికి నమస్కారమంటే ఇష్టము. గణపతి తర్పణ ప్రియుడు. ఆమ్మవారికి అర్చనమంటే ప్రీతి. మన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక పరముగా ఆనాది కాలమునుండి సత్కర్మాచరణల పరంపరగా వచ్చుచున్నది. ఇందులోని భాగమే దేవతలా ఆరాధనము లేక పూజావిధానము.


పూజ చేయుటకు ముఖ్యమైన వస్తువులు:
1 . పూజావేళ ఉపయోగించుటకుగాను విడివిడిగా పాత్రలలో జలము, ఉద్దరిణెలు లేదా చెంచాలు కావలెను.
2 . పూజించబోవు దైవము యొక్క చిత్రపటం లేదా ప్రతిమ అవిలేని యెడల బంగారు లేదా వెండితో చేసిన కాసు.
3 . దీపారాధనకు కుందెలు, ప్రత్తి వత్తులు, ఆవునెయ్యి, వాటిని వెలిగించుటకు అగ్గి పెట్టె - దూపరాధనకు సాంబ్రాణి లేదా అగరువత్తులు .
4 . పూజార్ధం అక్షతలు, పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, పంచామృతాలు (ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార), మధుపర్కం వస్త్ర యుగ్మం
5 . ప్రధానంగా కలశం, దానిఅపికి ఒక కొబ్బరికాయ, రవికెలగుడ్డ, ప్రత్యేక పూజకొరకు కావలెను.
6 . ఇతర ఉపచారార్ధం - తమలపాకులు (తాంబూలం కొరకు) వక్కలు, హారతి కర్పూరం, కొబ్బరికాయలు.
7 . అవసర నైవేద్యానికి గుడకలశం (బెల్లంముక్క), కదళీ (అరటి), నారికేళ ఫలాలు (కొబ్బరికాయలు) కావాలి.
8 . వరలక్ష్మీ పూజకు, వినాయక పూజకు 'పాలవెల్లి' కట్టి తీరవలెను.
9 . వినాయకచవితికి పూజక్కు తప్పనిసరిగా 21 రకముల పత్రికావలెను. 21 ఉండ్రములు కావలెను. తక్కిన వన్నియు రకమునకు 21 గా నివేదించవలెను.
10 . స్త్రీదేవతారాధనలో చలిమిడి (గుడపిష్టం/ శర్కర పిష్టం అనగా బెల్లం లేదా చెక్కెరతో చేసిన), ముద్గ సూపం(వడపప్పు - పెసరపప్పు ), పానకం (బెల్లందైతే గుడపానీయం/ చెక్కెర దయితే శర్కర పానీయం ప్రధానావసరం.
11 . సూర్యునికి పాయసం ప్రధాన నివేదనం. ఇతరాలు యధాశక్తి.
12 . సూర్యరాధనలో రథంలో ఉన్న సూర్యుడి ప్రతిమను చేయించి మండపంలో ఉంచి ఆరాధించాలి.
13 . అనంత పద్మనాభ వ్రతానికి అనంత స్వామిని దర్భలతో నిర్మించి పూజించాలి.
14 . పూజలలో ఇంకా మండపాల నిమిత్తం - పండ్లు, బియ్యం కూడా అవసముంటాయి.
15 . పైన చెప్పిన నివేదనలే కాక, భక్తుల తమ శక్తి మేరకు పప్పు, పెరుగు, కూరలు, నెయ్యి, పాలు మొదలైన విశేషాలతో షడ్రసయుక్తముగా భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయాది సంభరితంగా నివేదనలు సమర్పించవచ్చును.

16 . అనంత, వరలక్ష్మీ, కేదారేశ్వర వ్రతాలకు తోరాలు చాలా ముఖ్యంగా గుర్తించాలి.
షోడశోపచార పూజావిధనాము:
మన యింటికి ఎవరైనా పెద్దలు వస్తే - ఆదరంగా ఆహ్వానించి ఎలా మర్యాద చేస్తామో, అదే విధంగా మన ఇష్టదైవాన్ని కూడా 16 రకాల ఉపచారాలతో సేవించుకోవడాన్ని షోడశోపచార పూజ అంటారు. అన్ని దేవతా పూజలలోనూ ఈ విధానాన్ని పాటించడం సంప్రదాయం.

1 . ఆవాహనము: మన ఇంటిలోకి మనస్పూర్తిగా ఆహ్వానించడం
2 . అర్ఘ్యము: కాళ్ళు చేతులూ కడుగుకోడానికి నీళ్ళను అందీయడం
3 . పాద్యము: కాళ్ళు చేతులూ కడుగుకోడానికి నీళ్ళను అందీయడం
4 . ఆసనము: ఆ పెద్దలు కూర్చునేందుకు తగిన ఆసనాన్ని ఏర్పాటు చేయడం
5 . ఆచమనీయం: దాహం (మంచి నీళ్ళు )ఇవ్వడం
6 . స్నానము: ప్రయాణ అలసట తొలగే నిమిత్తం స్నానం వగైరా ఏర్పాట్లు.
7 . వస్త్రము: స్నానంతరం ధరించేందుకు మ(పొ)డి బట్టల నీయడం.
8 . యజ్ఞోపవీతం: మార్గ మధ్యంలో మైలపడిన యజ్ఞోపవీతాన్ని మార్చడం
9 . గంధము: శరీరాన్ని చల్లదనమూ, సుగంధమూ కలిగేలా గంధాన్ని చల్లడం లేదా చిలకరించడం
10 . పుష్పము: వాళ్ళు కూడా సుగంధాన్ని ఆస్వాదించేలా ఏర్పాటు.
11 . ధూపము: సుగంధ వాతావరణాన్ని కల్పించడం
12 . దీపము: చీకట్లో ఉంచకూడదు. కాబట్టి వెలుతురు కోసం, పరస్పరం పోల్చుకోవడానికి అనుకూలత కోసం దీపం పెట్టాలి. దీపము వెలిగించిన తరువాత కుమ్డికి మూడువైపులా కుంకుమ అద్ది నమస్కరించవలెను.
13 . నైవేద్యము: తన తాహాతురిత్యా తనకై సమకూర్చుకొన్న దానినే దైవదత్తంగా భావించి - ముందుగా ఆ దైవానికే అర్పించడం.
14 . తాంబూలము: మనం భక్తితో యిచ్చిన పదార్ధాలవల్ల వారి ఇష్టాష్టాలకి (రుచులకి) కలిగే లోపాన్ని తొలగించడం.
15 . నమస్కారం: మనం చేసిన మర్యాదలలో లోపాన్ని మన్నించమని కోరడం.
16 . ప్రదక్షిణము: దైవం యొక్క గొప్పదనాన్ని త్రికరణశుద్ధిగా అంగీకరించడం.
ఈ విధముగానే సర్వదేవతలను భక్తిభావనచే ఆరాధించవలెను. ముఖ్యముగా నిత్యము చేయు పూజావిధానములో ఈ విధముగా చేయవలెను.

శ్లో|| గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ||
పూజను ఆరంభించుటకు ముందు గృహమును శుభ్రముచేసికొని, ఇంటిలో ఈశాన్యమూలలో స్థలమును శుద్ధిచేసి, అలికి, బియ్యపుపిండితో గాని, రంగుల చూర్ణములతోగాని, ముగ్గులు పెట్టి, దైవస్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి. పీటమరీ ఎత్తుగాగాని, మరీ పల్లముగా గానీ ఉండకూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపురాసి, కుంకుమతో బొట్టుపెట్టి, వరిపిండి (బియ్యపు పిండి) తో ముగ్గు వేయాలి. సాధారణంగా అష్టదళపద్మాన్నే వేస్తారు. పూజచేసేవారు తూర్పుముఖంగా కూర్చోవాలి. ఏదైవాన్ని పూజించబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్రపటంగాని ఆపీటపై ఉంచాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారుచేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి), దానికి కుంకుమ బొట్టు పెట్టి, పిదప ఒక పళ్ళెంలో గాని, క్రొత్త తుండుగుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకునుంచి, అందు పసుపు గణపతినుంచి అగరువత్తులు వెలిగించాలి. ఇపుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి. దీపారాధన నైఋతి దిశలో చేయవలెను.
పూజకు కావలసిన వస్తువులు - దీపారాధన చేయు విధానము: దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద) వెండిది గాని, ఇత్తడిది గాని, మట్టిది గాని వాడవచ్చు. కుందిలో 3 అడ్డవత్తులు 1 కుంభవత్తి (మధ్యలో) వేసి నూనెతో తడపవలెను. ఇంకొక అడ్డవట్టి నూనెతో తడిపి ఏకహారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువులు) వేసి ముందుగా ఏకహారతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి, వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డవత్తి 1 కుంభవత్తి వెలిగించవలెను. తర్వాత చేయి కడుక్కొని నూనె కుంది నిండావేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారధను లక్ష్మీస్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను. కుందిలో మిగిలిన రెండు అడ్డవత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను. దీపారాధనకు నువ్వులనూనెగాని, కొబ్బరినూనెగాని, ఆవునెయ్యిగాని వాడవచ్చును.
ఈ విధంగా దీపం వెలిగించి ఘంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను.

ఘంటానాదము:
శ్లో|| ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్
కుర్యాద్ఘంటారవంత త్ర దేవతా హ్వాహన లాంఛనమ్
మనము ఆచమనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించ రాదు. పూజకు విడిగా ఒక గ్లాసు గాని ,చెంబు గాని తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించ వలెను.
పూజకు కావలసిన వస్తువులు : ఏ దేవుని పూజించుచున్నమో ఆ దేవుని యొక్క బొమ్మ (ప్రతిమ ) (తమ శక్తి కొలది బంగారముతో నైనను ,వెండితో నైనను లేక మట్టితో నైనను తీసుకొనవలెను ),
కొబ్బరి కాయలు , పళ్ళు , పువ్వులు ,పసుపు ,కుంకుమ , గంధం, హారతి కర్పూరం,


అక్షతలు ,అగ్గి పెట్టె , అగరువత్తులు ,వస్త్ర, యజ్నోపవీతములు, ప్రత్యేక నివేదన (పిండి వంటలు) మొదలగునవి. పిమ్మట యజమానులు (పూజ చేసేవారు ) ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి .ఈ నామములు మొత్తం 24 కలవు.

కేశవనామములు:- ఆచమనం : కుడుచేతి చూపుడు వేలుకు, నడిమి వేలుకు మధ్యన బొటన వ్రేలు పైకి మడచి తక్కిన మూడు వేళ్ళు చాపి, అరచేతిని దోనెలామలచి ఉద్ధరిణెలో ఉదకాన్ని ఎడమచేతితో తీసుకొని కుడుచేతిలో పోసుకొని ముందుగా .....

1 ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి
2 . " ఓం నారాయణాయ స్వాహా "అనుకొని ఒకసారి
3 . " ఓం మాధవాయ స్వాహా " అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను .తరువాత
4 . " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .
5 . " విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి .
6 . " ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
7 . "ఓం త్రివిక్రమాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
8 ,9 ." ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి
10 . ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి .
11 . ఓం పద్మనాభాయ నమః పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి .
12 . ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను .
13 .ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .
14 . ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .
15 .16 . ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను .
17 .18 .ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను
19 .20 ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను .
21 .ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం , హృదయం తాకవలెను .
22 . ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను .
23 . .24 .ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను , ఎడమ
మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి ,వెంటనే సంకల్పము
చెప్పుకోనవలెను .


ఆచమనము అయిన తరువాత ,కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటించవలెను .
శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
యేతేషామ విరోదేన బ్రహ్మ కర్మ సమారభే ||

ప్రాణాయామమ్య:
శ్లో|| అంగుళ్య గ్రైర్నాసికాగ్రం సంపీడ్యం పాపనాశనమ్
ప్రాణాయామ మిదం ప్రోక్త మృషిభి: పరికల్పితమ్
ఓం భూ : -ఓం భువః ఓం సువః - ఓం మహః -ఓం జనః ఓం తపః - ఓగ్ సత్యం -ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ దీయో యోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోం అని సంకల్పము చెప్పు కొనవలెను.
సంకల్పము : మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు ) ద్వితీయ పరార్దె శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్బాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను ), కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను ), శోభన గృహే (అద్దె ఇల్లు ఐనచో వసతి గృహే అనియు , సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను ), సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిదౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన .......... సంవత్సరే , (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగు చున్నదో ఆ సంవత్సరము యొక్క పేరు చెప్పుకొనవలెను. ) ......... ఆయనే , సంవత్సరమునకు రెండు ఆయనములు - ఉత్తరాయణము, దక్షిణాయనము . జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము , జూలై 15 కర్కాటక సంక్రమణము నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణము వరకు దక్షిణాయనం పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను )...........ఋతు : (వసంత ,గ్రీష్మ , వర్ష మొ || ఋతువు లలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు )............మాసే , (చైత్ర , వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజాసమయంలో జరుగు చున్న మాసం పేరు ) .......పక్షే , (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము , అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు ) ........తిధౌ , (ఆరోజు తిది ) .........వాసరే (ఆ రోజు ఏ వారమైనది చెప్పుకొని ) శుభ నక్షత్రే , శుభయోగే ,శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ మమ

నిత్యపూజా విధానము
ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ...........గోత్రస్య ........నామధేయః, శ్రీమత్యః , గోత్రస్య ,నామదేయస్య అనియు, స్త్రీలైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి, శ్రీమత్యాః ,గోత్ర వత్యాః, నామధేయవత్యాః , అనియు (పూజచేయువారి గోత్రము , నామము చెప్పి ) నామదేయస్యః ధర్మపత్నీ సమేతస్యః (పురుషులైనచో ) మమ సహ కుటుంబస్య ,క్షేమ స్థైర్య, వీర్య , విజయ ,అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ద్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం , పుత్ర పౌత్రాభి వృధ్యర్ధం,సకల విధ మనోవాంచాఫల సిద్ద్యర్ధం , (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకుని ) దేవతా ముద్దిశ్య, శ్రీ.......... దేవతా పీత్యర్ధం సంభవ ద్భిరుపచారై: సంభవతానియమేన సంభవతాప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో ,నాకు తోచిన నియమములతో , నాకు తోచిన విధముగా ,భక్తి శ్రద్దలతో సమర్పించు కుంటున్న పూజ ) ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే . పిదప కలశారాధనను చేయవలెను.

కలశపూజనుగూర్చినవివరణ :
వెండి, ,రాగి, లేక , కంచు గ్లాసులు (లేదా పంచ పాత్రలు ) రెండింటిలో శుద్ధ జలమును తీసుకుని ఒక దానియందు అక్షతలు , తమలపాకు ,పువ్వు ఉంచుకొనవలెను. రెండవ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును కాని, కుంకుమను గాని
పూయరాదు. గంధమును ఉంగరపు వ్రేలితో పూయవలెను. కుంకుమ అక్షతలు వగైరా బొటన,
మధ్య, ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించ వలెను. యజమానులు (ఒక్కరైతే ఒకరు, దంపతులైతే ఇద్దరూను ) ఆ కలశాన్ని కుడి చేతితో మూసి వుంచి ఇలా అనుకోవాలి . ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను .
మం || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః ||
ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితః
శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే ,గోదావరి ,సరస్వతి ,నర్మదా సింధు
కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు.
ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ ............... (ఏ దేవుని పూజితే చేస్తున్నామో ఆ

దేవుని పేరును చెప్పవలెను) పూజార్ధం దురితక్షయ కారకాః (ఏ పూజిస్తున్నామో ఆ దేవుని చెప్పవలెను ) కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి) ,ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడ చల్లాలి ) కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని ,ఆకుతో గాని చల్లాలి .

మార్జనము : ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్తాం గతోపివా
యస్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్శుచి :||
అని పిదప కాసిని అక్షతలు ,పసుపు, గణపతిపై వేసి ,ఆయనను తాకి నమస్కరించి ప్రాణప్రతిష్టాపన చేయవలెను.

ప్రాణప్రతిష్ట:

శ్లో|| జీవ ఇహ స్థితః సర్వేంద్రి యాణి వాజ్ఞ్మ నశ్చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణ
ప్రాణాః ఇహై వాగత్య సుఖంచిరం తిష్టంతు స్వాహా ||
మం|| ఓం ఆసునీతే పునరాస్మా చక్షు: పునః ప్రాణ మిహినో దేహి భోగం
జ్యోక్పశ్యేయ సూర్య మచ్చరన్త మనుమతే మృళ యాన స్వస్తి |
అమృతం వై ప్రాణా అమృత మాపః ప్రాణానేవ యధాస్థాన ముపహ్వాయ తే ||

శ్రీ మహాగణాధిపతయే నమః స్థిరోభవ, వరదోభవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, స్థిరాసనం కురు: పిదప కాసిని అక్షతలు, పసుపు పూజ చేస్తున్న దేవుని లేదా
దేవతపై వేసి, తాకి నమస్కరించి, ప్రాణప్రతిష్ట చేయవలెను. అంటే పసుపుతో చేసిన
గణపతిని నమస్కరించి, ప్రాణ ప్రతిష్ట చేయవలెను. అంటే పసుపుతో చేసిన గణపతిని
తమలపాకు నందుంచి పూజించవలెను. గణపతిని పూజించిన పిదప ఏ దేవుని పూజిస్తూన్నామో ఆ దేవునికి షోడశోపచార పూజ చేయవలెను.

షోడశోపచార పూజ అనగా ఆవాహన, ఆసనం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం , ధూపం, దీపం , నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణలు మొదలగునవి.

షోడశోపచార పూజ ప్రారంభః
ధ్యానం:


శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్
లక్ష్మీ కాంతం కమల నయనం యోగి హృద్ద్యాన గమ్యమ్
వన్దే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాధమ్ ||
శ్లో|| సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే
శరణ్యే త్ర్యమ్బకే దేవి (గౌరి) నారాయణి నమోస్తుతే
శ్లో || పద్మా సనే పద్మకరే సర్వ లోకైక పూజితా
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా
క్షీరో దార్ణ వసంభూతే కమలే కమలాలయే
సుస్థి రాభ వమే గేహే సురాసుర నమస్క్రతే ||
తా|| పద్మాసన మందు కూర్చున్నగానవు, చేత పద్మ పుష్పములను పట్టు కొనియున్న దానవు సర్పజనులచేత ప్రశంసంప బడుచున్న దానవు నయన ఓనారాయణప్రియే! దేవీ ఎల్ల ప్పుడు నా పైదయ కలిగి ఉండుము. పాలసముద్ర మందు పుట్టి ననీ వెల్లప్పుడును మాగృహమందు శాశ్వతముగా ఉండుము (అని మనసులో ధ్యానించివలెను).

శ్లో || సర్వమంగళ మాజ్గల్యే విష్ణువక్ష సధ లాలయే,
ఆవాహయామి దేవీత్యాం సుప్రీతా భవ సర్వదా,
శ్రీ......................... నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.

శ్లో || సూర్యాయుత నిభస్పూర్తే స్పురద్రత్న విభూషితే
సంహా సన మిదం దేవీ స్వీయతాం సుర పూజితే
శ్రీ …...............నమః రత్నసింహీసనం సమర్పయామి.
అర్ఘ్యం:
శ్లో|| తాపత్రయ హరం దివ్యం పరామనంద లక్షణమ్
తాపత్రయ వినిర్ముక్తం తవార్ఘ్యం కల్పయామ్యహమ్ ||


శ్రీ........................ నమః హస్తౌ: అర్ఘ్యం సమర్పయామి. దేవుడు చేతులు కడుగుకొనుటకై నీళ్ళిస్తున్నామని మనసున తలస్తూ, ఉద్దరిణితో నీరు వదలవలెను.
పాద్యం:
శ్లో|| యద్భక్తి లేశ సంపర్కాత్ పరమానంద సంభవః
తస్మై తే చరనాబ్జాయ పాద్యం శుద్ధాయ కల్పయే ||
శ్రీ....................... నమః పాదౌ పాద్యం సమర్పయామి. దేవుడు కాళ్ళు కడుగుకొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచపాత్రలో నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను.
ఆచమనీయం:
శ్లో|| వేద నామపి వేదాయ దేవానాం దేవతాత్మనే
ఆచామం కల్పయా మీశ శుద్దానాం శుద్ధి హేతవే ||
శ్రీ................ నమః ఆచమనీయం సమర్పయామి. అంటూ దేవుని ముఖము కడుగుకొనుటకై నీళ్ళిస్తున్నామని మనమున తలుస్తూ పైనచెప్పిన పాత్రలో ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను.
అరివేణంలో వదలరాదు.
మధుపర్కం:
శ్లో|| సర్వకాలుష్య హీనాయ పరిపూర్ణ సుఖాత్మకమ్
మధుపర్క మిదం దేవ కల్పయామి ప్రసీదమే ||
శ్రీ................. నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్రమిచ్చుచున్నామని తలస్తూ, ఈ మధుపర్కం ఆయన ప్రతిమకు అద్దవలెను. (ప్రత్తిని పెద్దబొట్టుబిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రండువైపులా పసుపుతో అద్ది ఉంచుకొన్న దాన్ని మధుపర్కం అంటారు).
పంచామృత స్నానం:
శ్లో|| స్నానం పంచామృతై ర్దేవ గృహాణ పురుషోత్తమ
అనాథ నాథ సర్వజ్ఞ గీర్వాణ ప్రణతి ప్రియ
శ్రీ............... నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చుచున్నట్లు భావించి ఆవునెయ్యి, ఆవుపాలు, ఆవుపెరుగు, తేనె, పంచదార, కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను.


శుద్దోదక స్నానం:
శ్లో|| పరమానన్ద బోధాబ్ది నిమగ్న నిజమూర్తయే
సాంగో పాంగ మిదం స్నానం కల్పయా మీశతే పునః ||
శ్రీ........... నమః శుద్దోదక స్నానం సమర్పయామి. పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను.
వస్త్ర యుగ్మం:
శ్లో|| య మాశ్రిత్య మహామాయా జగత్సమ్మోహినీ సదా
తస్మై తే పరమేశాయ కల్పయా మ్యుత్త రీయకమ్ ||
ఓం శ్రీ......................... నమః వస్త్ర యుగ్మం సమర్పయామి (యుగ్మ మనగా రెండు) అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్దబొట్టుబిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండువైపులా కుంకుమతో అద్దినచో అది వస్త్రమగును. ఇటువంటివి రెండుచేసుకో వలెను) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.
యజ్ఞోపవీతం:
శ్లో|| యస్య శక్తి త్రయే ణేదం సంప్రోత మఖిలం జగత్
యజ్ఞ సూత్రాయ తస్మైతే యజ్ఞ సూత్రం ప్రకల్పయే ||
శ్రీ...............నమః ఉపవీతం సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను. ఇదియును ప్రత్తితో చేయవచ్చును. ప్రత్తిని తీసుకొని పసుపుచేత్తో బొటనవ్రేలు, మధ్యవ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి, కుంకుమ అద్దవలెను. దీనిని పరుషదేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను.
గంధం:
శ్లో|| పరమానంద సౌరభ్య పరిపూర్ణ దిగంతరం
గృహాణ పరమం గందం కృపయా పరమేశ్వర ||
శ్రీ............నమః గంధాన్ సమర్పయామి. ముందుగా తీసిపెట్టుకొన్న గంధమును కుడుచేతి ఉంగరం వ్రేలుతో స్వామివారి ప్రతిమపై చల్లవలెను.
ఆభరణం:
శ్లో|| స్వభాన సుందరాంగాయ నానాశక్త్యా శ్రయాయతే
భూషణాని విచిత్రాణి కల్పయామ్య మరార్చిత ||
ఓం శ్రీ................నమః ఆభారణాన్ సమర్పయామి అని స్వామికి మనము చేయించిన


ఆభరణములను అలంకరించవలెను. లేనిచో అలంకారార్ధం అక్షతాన్ సమర్పయామి అని అక్షతలు స్వామిపై వేసి ఆభరణాన్ సమర్పయామి అని నమస్కరించవలెను.

అక్షతలు:
శ్లో|| అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ స్తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభు పుత్ర నమోస్తుతే
శ్రీ................... నమః అక్షతాన్ సమర్పయామి. (అక్షతలు కొద్ది బియ్యమును తడిపి పసుపువేసి కలుపవలెను) అక్షతలు తీసుకొని స్వామివారిపై ప్రతిమ పై చల్లవలెను. శంభుపుత్ర అన్నచోట ఏ దేవుని పూజిస్తున్నామో ఆ దేవుని పేరును అనుకొనాలి.
పుష్ప సమర్పణ:
శ్లో|| తురీయ వన సంభూతం నానాగుణ మనోహరమ్
ఆనంద సౌరభం పుష్పం గృహ్యతా మిద ముత్తమమ్ ||
శ్రీ.............. నమః పుష్పాణి సమర్పయామి. స్వామివారికి పువ్వులతో అలంకారము చేయవలెను.
పిదప అధాంగ పూజను చేయవలెను. అధాంగ పూజలోని ఒకొక్క మంత్రమును చదువుతూ స్వామిని అక్షతలతో గాని, పువ్వులతోగాని పూజించవలెను.
తరువాత అష్టోత్తర శతనామావళి పూజ. ఇందులో 108 మంత్రములు ఉంటాయి. ఒకొక్క మంత్రమును చదువుతూ స్వామిని అక్షతలతో గాని, పువ్వులతో గాని పూజించవలెను. పిదప అగరువత్తిని వెలిగించి........
ధూపం:
శ్లో|| వనస్పతి సోపేతో గంధాడ్యో గంధ ఉత్తమః
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం పరిగృహ్యతామ్ ||
ఓం శ్రీ................... నమః ధూపమా ఘ్రాపయామి. ధూపం సమర్పయామి. అంటూ ఎడమచేత్తో గంటవాయిస్తూ కుడిచేత్తో అగరుబత్తి తిప్పుతూ పొగను స్వామికి చూపవలెను.
దీపం:
శ్లో|| సుప్రకాశో మహాదీపః సార్వత స్తిమిరాపహా

సబాహ్యభ్యంత జ్యోతి: దీపోయం పరిగృహ్యతామ్ ||
ఓం శ్రీ............ నమః సాక్షాత్ దీపం దర్శయామి అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాధనలో వున్న అదనపు వత్తులలో ఒకదానిని తీసుకొని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదువవలెను.
నైవేద్యం
శ్లో|| అన్నం చతుర్విధం స్వాదురసై: షడ్భి సమన్వితమ్
భక్ష్య భోజ్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ................. నైవేద్యం సమర్పయామి అని ఒక బెల్లం ముక్క, పళ్ళు, కొబ్బరికాయ మొదలగునవి ఒప్క పళ్ళెములోనికి తీసుకొని స్వామివద్ద నుంచి దానిఅపి పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఎడమచేత్తో గంటవాయిస్తూ ' ఓం భూర్భువస్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధీయోయోనః ప్రచోదయాత్, సత్యంత్వర్తే న పరిషంచామి ( ఋతం త్వా సత్యేత పరిషంచామి అని రాత్రి చెప్పవలెను) అమృతమస్తు అమృతోపస్తరణమసి, ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరుసార్లు చేతితో (చేతిలోని ఉద్ధరిణెతో) స్వామికి నివేదనం చూపించాలి. పిదప ఓం శ్రీ................... నమః నైవేద్యానంతరం ' హస్తౌ ప్రక్షాళయామి' అని ఉద్ధరిణెతో పంచపాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్యపాత్ర (పంచపాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకొనే నీళ్ళ పాత్ర) లో వదలాలి. తరువాత ' పాదౌ ప్రక్షాళయామి' అని మరొకసారి నీరు అర్ఘ్యపాత్రలో ఉద్దరిణెతో వదలాలి. పునః శుద్ధచమనీయం సమర్పయామి. అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి. తదనంతరం...........
తాంబూలం:
శ్లో|| పూగీఫలై స్స కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతమ్
ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
అని చెబుతూ మూడు తమలపాకులు, ఎండు పోకచెక్కలు వేసి స్వామి వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలస్తూ, ' తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి' అంటూ ఉద్ధరినేతో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి. పిమ్మట కర్పూరం వెలిగించి...............
నీరాజనం:
శ్లో|| చంద్రాది త్యౌచ ధరణీ విద్యుదగ్ని స్త దైవ చ


త్వమేవ సర్వజ్యోతీంషి ఆర్తిక్యం ప్రతిగ్రుహ్యతా మ్ ||
ఓం శ్రీ................. నమః నీరాజనం సమర్పయామి అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించి దీపంతో వెలిగించి, మూడుమార్లు త్రిప్పుచూ, చిన్నగా గంటవాయించవలెను. అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ 'కర్పూర నీరాజనానంతరం శుద్ధచమనీయం సమర్పయామి' అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షతలు, పువ్వులు,. చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని,
మంత్ర పుష్పం :
శ్లో|| శృతిభి స్మృతిభిర్ధి వ్యై: లౌకికై ర్వచ నైరపి
మంత్రితం కుసుమోపేతం మంత్ర పుష్పం సమర్పయే ||
ఓం శ్రీ................ నమః యథాశక్తి మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు, పువ్వులు, చిల్లరడబ్బులు, స్వామివద్ద ఉంచవలెను. పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.
ప్రదక్షిణం:
శ్లో|| యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోహం పాపకర్మా హం పాపాత్మా పాపసంభవః
త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల ||
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మా త్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్ధన ||
ఓం శ్రీ............... నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. శ్రీ స్వామికి చేతిలో అక్షతలు, పువ్వులు, తీసుకొని లేచి నిలబడి మూడుసార్లు ఆత్మప్రదక్షిణ చేసి ( అనగా తమలో తాము చుట్టూ తిరిగి) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి (మగవారు పూర్తిగా పడుకొని తలను నేలకు ఆన్చి, ఆడువారు మోకాళ్ళ పై పడుకొని కుడికాలు ఎడమకాలుపై వేసి) తరువాత స్వామిపై చేతిలోనున్న అక్షతలు, పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ...........


పునః పూజ :
ఓం..................... నమః పునః పూజాం కరిష్యే అని చెప్పుకొని, పంచపాత్రలోని నీటిని చేతితో తాకి, అక్షతలు స్వామిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువుకొనవలెను.
విశేషోపచారములు:
ఛత్రం ఆచ్చాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజోపచార, శక్త్యోప చార, భక్త్యోపచార పూజాం సమర్పయామి అనుకొని, నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను.
పూజాఫల సమర్పణమ్:
శ్లో|| యస్య స్మృత్యాచ నామోక్త్యా తపం పూజాక్రియాదిషు
యాన సంపూర తాంయాతి సద్యో వందే తమచ్యుతమ్
మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరః
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ..................... సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు.
ఏతత్ఫలం శ్రీ.................. ర్పణమస్తు అంటూ అక్షతలు నీటితోపాటు అరవేణంలో వదలవలెను. పిమ్మట ' శ్రీ..................... ప్రసాదం శిరసా గృహ్ణామి' అనుకొని స్వామివద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను. ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి నుంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.
ఓం శ్రీ.................. నమః యధాస్థానం ప్రవేశయామి. శోభనార్ధం పునరాగమనాయచ. అని ఉద్వాసన పలుకుతారు.
పూజావిధానం సంపూర్ణం.
తీర్ధ ప్రాశనమ్
శ్లో|| అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణమ్ |
సమస్త పాపక్షయ కరం శ్రీ..................... పాదోదకం పావనం శుభమ్ ||
అని తీర్ధమును చేతిలో వేసుకొని మూడుమార్లు నోటిలోనికి తీసుకొనవలెను.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML