గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 25 December 2014

గర్భిణీ స్త్రీ నాలుగవ నెలలో లలితా సహస్రానామాలని చదివి తేనె, ఆవునెయ్యి, పంచదార కలిపిన మిశ్రమాన్ని (త్రిమధురాలు లేదా మధువు) అమ్మకి నైవేద్యంగా పెట్టి నెలంతా రోజుకి చెంచా చొప్పున తాగడం గాని, అన్నంలో కలుపుకొని తినడం గానీ చేయాలి.

గర్భిణీ స్త్రీ నాలుగవ నెలలో లలితా సహస్రానామాలని చదివి తేనె, ఆవునెయ్యి, పంచదార కలిపిన మిశ్రమాన్ని (త్రిమధురాలు లేదా మధువు) అమ్మకి నైవేద్యంగా పెట్టి నెలంతా రోజుకి చెంచా చొప్పున తాగడం గాని, అన్నంలో కలుపుకొని తినడం గానీ చేయాలి.
ఒట్టి తేనే అనారోగ్యకరం. అలాగే ఒట్టి ఆవునెయ్యి, పంచదారలు కూడా అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. గర్భిణికి ఈ మూడింటినీ కలిపినట్లయితే ఒకదానిలో దోషాన్ని మరొకటి తొలగించి మూడూ కలిపి ఔషధంగా ఏర్పడి గర్భిణికి సహాయపడతాయి. దీనితో పాటు ఒక ముద్దా పెరుగన్నాన్ని రోజూ తినాలి.
'అధ చతుర్థే మాసే జఠరకటిప్రదో భవతః' అని ఉపనిషత్తు చెప్తోంది. కాబట్టి గర్భస్థ శిశువుకి జఠరం కటి ప్రదేశాలు ఏర్పడేదీ - శిరస్సులో తెల్లగా ఉండే మెత్తని మాంసం (మేధస్సు) బుద్ధిశాక్తిని పెంపొందించేందుకుగా తోడ్పడేదీ ఈ నెలలోనే కాబట్టి ఈ త్రిమధురాలని సేవించాలి నెలపొడుగునా. దానితో పాటు పెరుగాన్నాని తినాలి.
ఈనాలుగవ నెలంతా ఈ క్రింది స్తోత్రాన్ని వీలయినన్ని ఎక్కువమార్లు పఠించాలి.
స్వాధిష్టానాంబు జగతా చతుర్వక్త్ర మనోహరా
శూలాద్యాయుధ సంపన్నా పీతవర్ణాతి గర్వితా!
మేధోనిష్ఠా మధుప్రీతా బంధిన్యాది సమన్వితా
దధ్యన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణీ!!
పెరుగన్నమనగానే మనం ఇళ్ళలో చేసుకునే దధ్యోదనమానుకోకూడదు. దాన్ని ఈ కింది పద్ధతిలోనే చేయాలి.
దధ్నా చాన్విత శుద్ధాన్నం లవణేణ సమన్వితం
ఆర్ద్ర మరీచి సంయుక్తం ధానకీ పాత్ర సంయుతం
తథా నాగరఖండాఖ్యం దధ్యన్నమితి కీర్తితం!!
మిరియాల పొడి, తగు మాత్రపు ఉప్పు, కరివేపాకులు కలిసిన అప్పటికప్పుడు వండిన అన్నం పెరుగు మిశ్రమాన్ని మాత్రమె దధి (పెరుగు_, ఓదనం (అన్నం), దధ్యోదనం అనాలి (దద్దోజనం అనరాదు). ఈ నాలుగవ నెలంతా శిశువుని రక్షించే తల్లి పేరు 'కాకినీ దేవి'.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML