గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 December 2014

పరమశివుడే అనేక రూపాలు ధరించాడు. వీరభద్రునిగా, కాలభైరవునిగా అనేక రూపములతో ఆరాధింపబడతాడు.

పరమశివుడే అనేక రూపాలు ధరించాడు. వీరభద్రునిగా, కాలభైరవునిగా అనేక రూపములతో ఆరాధింపబడతాడు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క స్వరూపం. దక్షయజ్ఞం విధ్వంసం మొదలైన వాటికి వీరభద్రుడుగా వచ్చాడు. కాలభైరవుడిగా కాశీలో యమధర్మస్థానం కాలభైరవుడు. పంచక్రోశరూపమైన కాశీలో కేదారఖండం పడింది. ఘాట్లు అన్నీ అక్కడే కనపడతాయి మనకు. మహాపుణ్యభూమి. ఈ ఐదుక్రోసుల కాశీలో యమధర్మరాజుకానీ, ఆయన establishment కానీ రాకూడదు. వాళ్ళకు ఆ హక్కు లేదు. యముడు boarder చుట్టూ తిరుగుతాడు కానీ లోపలికి రాడు. ఇక్కడ హక్కంతా కాలభైరవుడిదే. అందుకే కాలభైరవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దండంతో బాదతారు వీపుమీద. నీకు రక్షణ ఇచ్చినట్లు కాలభైరవుడు. కాలభైరవుడు శివస్వరూపం. ఆయనకు ప్రత్యామ్నాయంగా మనం సర్వభూతములయందు పరమాత్మను చూస్తాం. అదీ గొప్పతనం. మన సంప్రదాయంలో అన్ని భూతములలో భగవంతుడున్నాడు. విష్ణుమూర్తి వరాహంగా కనపడ్డాడు. శంకరుడు కాలభైరవరూపంలో శునకంగా కనపడతాడు. సుబ్రహ్మణ్యస్వామి సర్పరూపంగా కనపడతాడు. అటువంటి కాలభైరవుడు కాశీ క్షేత్రానికి అధిపతి. శివస్వరూపమే ఇంకోరూపంగా కాలభైరవుడిగా ఉన్నాడు. ఢిల్లీలో పురాన్ ఖిల్లా వెనక గోడకి దగ్గరగా కాలభైరవుడు ఉన్నాడు. ఆ కాలభైరవుని భీముడు తీసుకువచ్చాడు. రాజసూయయాగం పాండవులు చేసేటప్పుడు నిర్విఘ్నంగా జరగాలంటే ఏమిటి ఉపాయం? అంటే కాలభైరవుని ఆశ్రయించు. విఘ్నాలు రావు అన్నారు. ఆయనను సేవిస్తే నేను వస్తున్నా పో అన్నారు. మనప్రాంతంలో తెలంగాణాలో నిజామాబాద్ దగ్గర కాలభైరవక్షేత్రం ఉన్నది. చాలామంది భక్తులు వెళతారు కనుక ఎక్కడ ఉన్న కాలభైరవుడైనా కాలభైరవుడే, మూలస్థానం కాశీలో.
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML