నీతిజ్ఞా నియతిజ్ఞా వేదజ్ఞా అపి భవంతి శాస్త్రజ్ఞాః
బ్రహ్మజ్ఞా అపి లభ్యాః స్వాజ్ఞాన జ్ఞానినో విరళాః!!
నీతిజ్ఞా - నీతి శాస్త్రం తెలిసిన వాళ్ళున్నారు, నియతిజ్ఞా – నియమాలు నిష్ఠలూ అంటే ఒకరకంగా యోగశాస్త్రం తెలిసినవాళ్ళు ఉన్నారు, వేదజ్ఞా – వేదపండితులూ ఉన్నారు, అపి భవంతి శాస్త్రజ్ఞాః – తర్క శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, న్యాయశాస్త్రం, ధర్మ శాస్త్రం, ఆధునిక శాస్త్రములు చదివిన వాళ్ళు ఉన్నారు, అంతేకాదు బ్రహ్మజ్ఞా అపిలభ్యాః – ఇన్ని చదివిన వాళ్ళకి కూడా లభ్యం కానిది బ్రహ్మజ్ఞానం. ఒక రమణ మహర్షి లాంటి వారికి, ఒక జిడ్డు కృష్ణమూర్తి గారి వంటివారికి, ఒక కంచి పరమాచార్య వంటి వారికి మాత్రమే లభ్యమయ్యేది. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేడు? ఒకవేళ వెతికితే అటువంటి వాడూ దొరకవచ్చు మన అదృష్టం బాగుండి పరీక్షిన్మహారాజుకి శుకమహర్షి దొరికినట్లుగా. కానీ స్వాజ్ఞాన జ్ఞానినో విరళాః – తన అజ్ఞానాన్ని తాను గుర్తించినటువంటి జ్ఞాని లేడు. ఏ జ్ఞానం తెలిసిన తర్వాత ఇంకే జ్ఞానమూ అవసరం లేదో అదే బ్రహ్మజ్ఞానం.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment