ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Friday, 12 December 2014

గర్భిణీ స్త్రీ రెండవ నెలంతా ఆవునేతితో బాగాకలిపి ముద్దచేసిన పప్పన్నం తినాలి

గర్భిణీ స్త్రీ రెండవ నెలంతా ఆవునేతితో బాగాకలిపి ముద్దచేసిన పప్పన్నం తినాలి - వేవిళ్ళ కారణంగా నేయి తినడానికి గర్భిణి ఇష్టపడని పక్షంలో పప్పునూనెతో కలిపిన పులిహోరని రోజుకి ఒక ముద్దచొప్పున మాత్రమే అమ్మకి నైవేద్యం పెట్టి తినాలి నెలంతా.
లోకంలో కొందరు 'తాము చేయరు - చేస్తున్న వాళ్ళని మాన్పించేవరకూ ఊరుకోరు'. అలాంటి వాళ్ళు తారసపడి - 'అమ్మకి నైవేద్యమంటే సామాన్యమా? మడితో పెట్టాలి. ఈ నియమాలు ఆ నియమాలంటూ భయపెడితే...'ఎవరూ భయపడద్దు.
అమ్మ అనేక కోటి బ్రహ్మాండ జనని (అనేక కోట్ల జీవరాసులకి జన్మనిచ్చిన తల్లి).
అంతేకాక, అవ్యాజ కరుణామూర్తి (ఏవంకా లేని కరుణతో అలా రూపుగట్టి నిల్చిన ఇల్లాలు). స్నానం చేసి, ఉతికిన వస్త్రాన్ని కట్టుకుని కేవల లలితా సహస్రనామాలు చదివి నైవేద్యం పెడితే చాలు సంతోషించే లక్షణం కలది ఆమె. కాబట్టి ఎవరి మాటల్నో విని గర్భిణులు భయపడొద్దు - మానివేయద్దు.
ఏ గర్భిణి ఈరోజు నుండి తొమ్మిది నెలలపాటు లలితా నామాలని చదవడానికి సిద్ధపడిందో ఆ రోజున మాత్రం పూర్వపీఠికతో పాటు లలితా సహస్రనామాలూ చదివి, ఇక అక్కడినుండి తొమ్మిది మాసాలపాటు సహస్రనామాలు చదువుతూ బాలసారె నాడు లలితా సహస్రనామాలు, ఉత్తర పీఠిక కూడా చదివి ముగించాలి.
రెండవ నెల మొత్తం ఈ క్రింది శ్లోకాలని అవకాశమున్నన్ని ఎక్కువమార్లు చదువుకోవాలి.
'అనాహతాబ్జ నిలయా శ్యామాభా వదనద్వయా
దంష్ట్రోజ్జ్వలాక్షమాలాదిధరా రుధిర సంస్థితా!
కాలరాత్ర్యాది శక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా
మహావీరేంద్ర వదనా రాకిన్యంబా స్వరూపిణీ!!
రెండవ నెలలో శిశువుకి శిరస్సు ఏర్పడడమే కాక రక్తం చేరుతుంది. కాబట్టి (మాసద్వయేన శిరః కురుతే) రక్తదోషం రాకుండానూ సరైన శిరస్సు శిశువుకి లభించేందుకూ పైశ్లోకాన్ని చదువుతూండాలి. ఈ నెల మొత్తం శిశువుని రక్షించే తల్లి పేరు 'రాకినీదేవి'

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML