గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 December 2014

తెల్లదొరల సింహస్వప్నం ఝాన్సీలక్ష్మీభాయ్

తెల్లదొరల సింహస్వప్నం ఝాన్సీలక్ష్మీభాయ్
వీరనారి ఝాన్సీలక్ష్మీభాయ్ జయంతి నేడు.
ప్రథమ స్వాంతంత్ర్య సంగ్రామంలో ఆంగ్లేయులను ఎదిరించిన మరాఠా మహిళా
యోధురాలు రాణి ఝాన్సీ. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ
క్షత్రియ ధర్మాన్ని పుణికిపుచ్చుకుని రాజ్యాన్ని ఆంగ్లేయుల
పరం కాకుండా కడదాకా పోరాడింది ఝాన్సీ. రాణి ఝాన్సీ భారతీయుల
ఆధ్యాత్మిక నగరమైన కాశీలో 1828 సంవత్సరంలో కర్హాడే బ్రాహ్మణ
కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పేరు మోరోపంత్ తాంబే.
ఝాన్సీ అసలు పేరు మణికర్ణిక. అమెను ముద్దుగా అందరూ మనుగా
పిలిచేవారు. ఝాన్సీకి నాలుగేళ్ల ప్రాయంలోనే తల్లిని కోల్పోయింది. మరాషా
పీష్వాలలో చివరివాడైన రెండో బాజీరావు వద్ద ఆమె తండ్రి పంత్ సలహాదారుగా
పనిచేసేవాడు. ఝాన్సీ విద్యాభ్యాసంను పూర్తిచేసి గుర్రపు స్వారీ, కత్తి
సాము వంటి క్రీడల్లో రాటుదేలింది.
ఝాన్సీ ప్రాంత రాజు మహారాజా గంగాధర రావు నేవల్కర్ను కలవటానికి పంత్
ఒకసారి వెళ్లారు. ఈ సమయంలో మాటామంతీ కలిసి ఝాన్సీని
ఆయనకు ఇవ్వాలని తండ్రి పంత్ నిర్ణయించారు. ఝాన్సీ
వివాహం జరిగినపుడు వయస్సు 14ఏళ్లు. దీనితో ఆమె మహారాణి ఝాన్సీ
అయింది. ఆ సమయంలో పెళ్లైన తర్వాత అమ్మాయ పేరును మార్చేవారు.
దీనితో ఝాన్సీకి లక్ష్మీభాయిగా నామకరణం చేశారు.
ఝాన్సీ 1851లో ఒక కుమారుడికి జన్మనిచ్చినప్పటికీ నాలుగు నెలల
ప్రాయంలోనే ఆ పసికందుకు ఈ భూమిపై రూకలు నిండాయి. దీనితో రాజు గంగాధర
రావు సమీప బంధువు కుమారుడు దామోదర రావును పెంచుకోవాలని నిర్ణయించారు.
దత్తత తీసుకున్న మరునాడే రాజు గంగాధర రావు ప్రాణాలు విడిచారు. ఆ
సమయంలో మగపిల్లలు లేని రాజ్యాలను రాజ్య సంక్రమణ
సిద్ధాంతం ప్రకారం వాటిని ఆంగ్లేయులు తమ పరిధిలోకి తెచ్చుకొనేవారు.
దామోదర రావును పెంచుకునే విషయంపై అప్పటి బ్రిటీష్ గవర్నర్ జనరల్
లార్డ్ డల్హౌసీ దీనిని వ్యతిరేకించారు. ఈ విషయంపై లండన్ కోర్టులో
అనేక విచారణలు జరిగి వ్యవహారం కొలిక్కిరాలేదు. దీనితో లార్డ్ డల్హౌసీ
రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఝాన్సీని ఆక్రమించుకోవాలని అనుకోగా
దానిని తీవ్రంగా వ్యతిరేకించారు రాణి ఝాన్సీ.
ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడటానికి రాణి ఝాన్సీ
సంసిద్ధమయ్యారు. తదనంతరం జరిగిన పరిణామాల్లో తాంతియా తోపేతో
జరిగిన చర్చల్లో ఝాన్సీకి దేశానికి కొత్త భవిష్యత్తు అందిస్తుందని
ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో విప్లవ భావాలు గల రాజ్యాలతో మైత్రిని
రాణి ఝాన్సీ కొనసాగించారు.
ప్రథమ స్వాంతంత్ర్య సంగ్రామంలో రాణి ఝాన్సీ అందరికంటే ముందుండి
పోరాడారు. ఝాన్సీ రాజ్య దళాలను అన్నిరకాలుగా శిక్షణనిచ్చి
యుద్ధానికి సిద్ధం చేశారు రాణి ఝాన్సీ. పురుషులతో పాటుగా
మహిళలను సైన్యంలోకి తీసుకుంది రాణి ఝాన్సీ. ఝాన్సీ రాణి నేతృత్వంలో
సేనలు సమీపంలోని దతియా, ఓర్చా రాజ్యాలను ఆక్రమించారు. 1858
జనవరిలో బ్రిటీష్ సేనలు ఝాన్సీపై దాడికి దిగాయి. ఝాన్సీ
కోటను ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నప్పటికీ రాణి ఝాన్సీ వారికి
దొరకలేదు. పురుషుడి వేషంలో రాణి ఝాన్సీ అక్కడినుంచి పారిపోయారు.
రాణి ఝాన్సీ తాంతియా తోపే సేనలతో కలిసి గ్వాలియర్ కోటను రక్షించుకునే
పనిలో నిమగ్నమైంది. ఆంగ్లేయులతో జరిగిన పోరులో రాణి ఝాన్సీ
కడకు ప్రాణాలు వదిలింది. కల్పి వద్ద జరిగిన పోరులో 22 ఏళ్ల ప్రాయంలో
రాణి ఝాన్సీ ప్రాణాలు విడిచింది. ఆంగ్లేయులను ధైర్యంగా ఎదుర్కొన్న
మహిళా మూర్తులలో రాణి ఝాన్సీ ఒకరు. ప్రథమ భారత స్వాతంత్ర్య
సంగ్రామం అంటే అందరికీ ముందు గుర్తుకు వచ్చేది రాణి ఝాన్సీ

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML