
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 11 December 2014
మౌనవ్రతం ఎందుకు చేస్తారు?
మౌనవ్రతం ఎందుకు చేస్తారు?
మునీశ్వరులు ఎక్కువగా మౌన వ్రతం పాటిస్తారు. మౌన వ్రతం పాటించేవారు కనుకే వారికి ముని అనే పేరు వచ్చిది. ఇప్పటికీ చాలామంది చాతుర్మాస దీక్షలోనో లేక వేరో ఏదో కొన్నిరోజులో లేకపోతే ఫలానా వారమనో మౌన వ్రతాన్ని పాటిస్తున్నారు. ఇది ఎందుకు చెయ్యాలి? దీని వల్ల ఉపయోగం ఏమైనా వుంటుందా?
తప్పకుండా వుంటుంది. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా మౌనవ్రతం మనిషికి ఎంతో మేలు చేస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే మౌనవ్రతం వల్ల వాక్శుధ్ది, వాక్ శక్తి పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే మనని మనం ప్రశాంతంగా వుంచుకోవటానికీ, కోపాన్ని అదుపులో పెట్టుకోవటానికి ఈ మౌనవ్రతం ఉపయోగపడుతుంది. సిధ్ధులు వాక్ శక్తిని పెంచుకోవటానికి, వాళ్ళని వాళ్ళు ప్రశాంతంగా వుంచుకోవటానికి ఎక్కువగా మౌనవ్రతాన్ని పాటిస్తారు.
మనకి వచ్చే రోగాలు చాలామటుకు మన ఆవేశాలతో, కోపంతో వస్తాయి. వాటిని నియంత్రించుకుంటే మన
ఆరోగ్యం బాగుంటుంది. మనకి ఎదుటివారిమీద వచ్చిన కోపాన్ని చూపించకుండా కొంత సంయమనాన్ని పాటిస్తే గొడవలు పెరగటం, అనవసరమైన పోట్లాటలు, అశాంతి వుండవు. సమస్యలు తేలిగ్గా పరిష్కారమవుతాయి. దీనిమూలంగా సామాజికంగా ఉపయోగం వున్నట్లేకదా. ఈ కలికాలంలో మనకి
అంత వాక్శుధ్ధి అక్కరలేకపోవచ్చు...మనం ఏమైనా అంటే వెంటనే అది జరిగేంత వాక్శక్తి మన వాక్కుకి వుండాల్సిన అవసరం కూడా వుండకపోవచ్చు. కానీ ఈ టెన్షన్ల ప్రపంచంలో మన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం మనకి చాలావుంది.
అంటే కోపం వచ్చినప్పుడు మాట తూలకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం చాలావుంది. దానికోసం మౌనవ్రతం పాటించటం చాలా అవసరం. కనీసం కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా వుండటం అలవాటు చేసుకున్నా చాలు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment