గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 December 2014

మార్గశీర్ష శుద్ధ ఏకాదశి. పరమ పావనమైన గీతాజయంతి

 మార్గశీర్ష శుద్ధ ఏకాదశి. పరమ పావనమైన గీతాజయంతి. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకొని సర్వ జగత్తుకూ ఉపదేశించినటువంటి బ్రహ్మవిద్యా శాస్త్రం భగవద్గీత. అది ఈరోజున ఉపదేశించారు అని సంప్రదాయం చెప్తూన్నది. దాని ప్రకారంగా ఈ పవిత్రమైన ఏకాదశిని గీతాజయంతి అని వ్యవహరించడం జరుగుతున్నది. మానవజీవితంలో ప్రతి దశలోనూ ప్రతి సమస్యకీ పరిష్కారం చెప్పగలిగే గ్రంథం భగవద్గీత. ఎవరితో ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తిస్తే మనం ఈ జీవితాన్ని సార్థక పరచుకోగలం? చిట్టచివరికి జీవన పరమార్థమైన కైవల్యాన్ని పొందగలమో చెప్తున్న గ్రంథమిది.
ముందుగా "అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే" అని మొదలౌతుంది. అశోచ్యానన్వ శోచస్త్వం అంటే దుఃఖించ గూడని వాటి కోసం దుఃఖించకు అని మొదలు పెడుతున్నది. అంటే ఆనందంగా ఉండు, దుఃఖపడకు అనేది ప్రధమ వాక్యం కృష్ణ బోధలో. మళ్ళీ చిట్టచివరికి
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ!
అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః!!
అన్నాడు. దుఃఖపడకు అనేది చివరి వాక్యం. మొదట దేని గురించి దుఃఖ పడకూదదో దాని గురించి దుఃఖపడకు అని. చిట్టచివరికి దుఃఖపడకు, శోకించకు అని చెప్తున్నాడు. అంటే గీతయొక్క పరమార్థం శోకనాశనం, దుఃఖనాశనం. సృష్టిలో ఎవరైనా కోరుకొనేది అదే. దుఃఖం లేకుండా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అటువంటి పరమానందం అంటే ఏమిటో తెలియజేస్తూ అజ్ఞాన జనితమైన సర్వ శోకాలనీ నశింప చేయడం కోసమే భగవద్గీత పుట్టింది. అందుకే మొదటి వాక్యం చివరి వాక్యం రెండూ కూడా మనలో ఉన్నటువంటి సర్వ దోషాలనీ దుఃఖాలనీ పోగొట్టి పరమానంద జ్ఞానాన్ని ప్రసాదించడమే లక్ష్యమని తేటపరుస్తున్నది. ఇక మధ్య వచ్చిన వచనములలో చాలా విశేషములున్నాయి.
ఇక భగవద్గీతలో నన్ను అనే మాట సర్వ వ్యాపకమైన పరమాత్మ అని ఉద్దేశంతో తప్ప ఏదో ఒక దైవాన్ని అనే ఉద్దేశ్యంతో చెప్పలేదు. అందుకే ఏ సంప్రదాయం వాళ్ళు అయినా భగవద్గీతను చక్కగా అన్వయించుకొని తరించిపోవచ్చు. అంత విశ్వజనీనమైన విషయాలు దానిలో ఉన్నాయి. ఈవిషయాన్ని పాశ్చాత్య మేధావులు కూడా అంగీకరించారు. గాంధీ మహాత్ముడు, తిలక్ ఇత్యాది తత్త్వవేత్తలు, సామాజిక వేత్తలూ కూడా భగవద్గీతను ఆధారంగా తీసుకున్నారు.
ఇక కర్మమార్గంలో, జ్ఞాన మార్గంలో, భక్తి మార్గంలో మూడింటినీ సమన్వయ పరచిన గ్రంథం భగవద్గీత. అందుకని మొదటి సమన్వయ గ్రంధం భగవద్గీతను అర్థం చేసుకుంటే ఈ భగవద్గీతలో చెప్పిన కృష్ణ హృదయాన్ని ఆధారం చేసుకొని వేదవ్యాసుల వారు కూడా సమస్తములైన విద్యలనీ తీర్చిదిద్దారు. అటు తర్వాత వచ్చిన శంకర భగవత్పాదుల వారు కూడా భగవద్గీతను ఆధారం చేసుకొనే వేదముల హృదయమైన వేదాంతాన్ని ఆవిష్కరించగలిగారు. మొత్తానికి సమస్తమైన భారతీయ ఆధ్యాత్మిక వాజ్ఞ్మయానికి ఒక పునాదివలె, ఒక కేంద్రం వలే ఉన్నది భగవద్గీత.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML