చంద్రుడి అనుగ్రహాన్ని ఇలా పొందవచ్చు !
ఆకాశంలోని చంద్రుడిని ఎప్పుడు చూసినా కొత్తగా కనిపిస్తాడు ... అందంగా అనిపిస్తాడు. ఆకాశమనే సరస్సులో తెల్లతామర తేలుతున్నట్టు కనిపించే చంద్రుడిని ఇష్టపడని వాళ్లుండరు. ఒంటరిగా ఉన్న సమయంలో చంద్రుడిని తోడు చేసుకుని కబుర్లు చెప్పుకునే వాళ్లు చాలామందే వుంటారు. చిక్కని చీకటిపై చల్లని వెన్నెల పరుస్తూ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే చంద్రుడు పదహారు కళలను సంతరించుకుని కనిపిస్తుంటాడు.
నవగ్రహాలలో రెండవ స్థానంలో దర్శనమిచ్చే చంద్రుడు, కర్కాటక రాశికి అధిపతిగా చెప్పబడుతున్నాడు. చంద్రగ్రహ సంబంధమైన దోషాలతో బాధపడుతున్నవాళ్లు ఆయనని శాంతింపజేయడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తూ వుంటారు. చంద్రగ్రహ సంబంధిత దోషాలు గల వారు అవమానాలను ... ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటూ వుంటారు. ఆయన అనుగ్రహాన్నిపొంది వాటి బారి నుంచి బయట పడటానికి ఎవరి ప్రయత్నం వాళ్లు చేస్తుంటారు.
చంద్రగ్రహ సంబంధిత దోషాలతో బాధలుపడుతున్నవాళ్లు 'ముత్యం' ధరించాలనీ ... శంఖాన్ని దానం చేయాలని శాస్త్రం చెబుతోంది. చంద్రుడికి తేనెతో కూడిన పిండివంటలంటే చాలా ఇష్టమట. అందువలన పౌర్ణమి రోజున ఆయనకి వాటిని రాగిపాత్రలో నైవేద్యంగా సమర్పించాలని చెప్పబడుతోంది. భక్తిశ్రద్ధలతో ఈ విధంగా చేయడం వలన ఆయన సంతృప్తిచెంది శాంతిస్తాడట. ఫలితంగా చంద్రగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోయి, ఆయన అనుగ్రహం లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment