గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 12 December 2014

ఆవు అనగా భారతీయ సంతతికి చెందిన గోవు మాత్రమే. జెర్సీ కాదు. జెర్సీ ఆవు కాదు.

ఆవు అనగా భారతీయ సంతతికి చెందిన గోవు మాత్రమే. జెర్సీ కాదు. జెర్సీ ఆవు కాదు. పాలిచ్చు జంతువులు ఆవు, గేదె, జెర్సీ. ఈ మధ్య దేవాలయాలలో కూడా జెర్సీ గోదానాలు చేసేస్తున్నారు. ఇంకా బాధాకరం పేర్లు చెప్పకూడదు కానీ పేర్లు చెప్తే రికార్డ్ చేసే వాళ్ళకే కోపం వస్తుంది. ప్రసిద్ధమైన ఆలయంలో కోట్లు కోట్లు కలిగిన ఆలయంలో స్వామి వారికి జెర్సీ పాలతో అభిషేకం చేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊరు వాళ్ళు(మదనపల్లి...) అన్యాయం జరుగుతోంది అని ఉద్యమంగా తయారై కేవలం భారతీయ గోజాతి ఆవుల్ని 250 వెంకటేశ్వర దేవస్థానానికి ఇచ్చారు. ఇచ్చినా అవి కొంత కలిపి అవే అవే చేస్తూన్నారు. ఈమధ్య మరొక ఘోరమైన వార్త. పైగా మనకు దగ్గరగా ఉన్న విజయవాడ కేంద్రంగా జరుగుతున్న మహా అన్యాయం. ఆలయాలకు సప్లై చేసే ఆవునెయ్యిలో ఆవుమాంసంలోని కొవ్వుని, కొమ్ములలోని కొవ్వుని కలిపి నెయ్యిగా ఇస్తున్నారు. వాటిని దేవాలయాలలో వాడుతున్నారు. ప్రసిద్ధి చెందిన ఆలయాలలో యజ్ఞానికి, పదార్థాల నైవేద్యాల తయారీకి, నివేదన సమయానికి వాడుతున్నారు. ఇది చేసి దేవతల అపచారానికి మనందరం పాల్పడుతున్నాం. వాటియొక్క ప్రమాదాలకి లోనవుతున్నాం. దణ్ణం పెట్టి బాధ్యత తీరిపోయింది అనుకోవద్దు. దేవాలయాలను కాపాడుకోవాల్సిన అవసరం భారతదేశంలో ఉన్న అందరికీ ఉంది. మనందరిదీ అని మనం గట్టిగా నిలబడగలిగితే మాకు దేవుడు అక్కరలేదు, గుడి అక్కరలేదు, ఆదాయమే కావాలి అనుకునే వాళ్ళు కళ్ళు తెరవచ్చు. చాలా ప్రధానం. గుడికి రాబడి కానీ రాబడి కోసం గుడి కాదు. దేవాలయ అభివృద్ధి అంటే దానికున్న income status చూపించి కాదు. దాని తపస్సును చూసి చెప్పాలి, దాని అనుష్ఠానాన్ని చూసి చెప్పాలి., దాని పవిత్రతను చూసి చెప్పాలి. చిత్రమేమిటంటే ఇది అన్యాయం జరుగుతోంది అని కొందరు ఫిర్యాదు చేస్తే పరీక్షాధికారులకి పరీక్షకి పంపారుట. వాళ్ళు test చేసి ఏమీ లేవు మాంస వస్తువులేమీ లేవు అని pure అని certificate చేసేశారట. అదే sample ని Germany కి పంపి report తీసుకువస్తే అందులో తప్పకుండా మాంస వస్తువులు ఉన్నాయి అని నిరూపించింది. అంటే పరీక్ష చేసేవాళ్ళు కూడా లంచాలకి లోనై అవినీతి పరులయ్యారు. ఇదీ దౌర్భాగ్యం. ఇది బాధపడవలసిన విషయం. ఉద్యమించాలి, ఉప్పెనలా కదలాల్సిన విషయం. దీనికి ఒక్కటి చేయాలి. దేశవాళీ గోశాలలు పెంచాలి, వాటియొక్క పంచగవ్యములు వాడుకోవడం మొదలుపెట్టాలి. ప్రతివారూ మేము దేశవాళీ గోవుపాలు మాత్రమే త్రాగుతాం, ఆ నెయ్యే వాడుతాం అని నియమం పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ గోశాలలు అభివృద్ధి చెందుతాయి. అది జరగాలి. భారతదేశం తనదైన ప్రత్యేకమైన గోజాతితో వర్ధిల్లుగాక! ప్రతి జాతి, ప్రతి దేశం తనకు మాత్రమే ప్రత్యేకమైన ఒకానొక జాతిని కాపాడుకోవడం దానియొక్క అవసరం. భారతీయ గోవు లాంటి గోవు ఇంకో నేలమీద ఉండదు ప్రపంచంలో. ఈ గోవు ప్రత్యేకత వేరు. మొత్తం ఆసేతుసీతాచలం గోవుల జాతులు వేరైనా భారతీయ గోవు లక్షణం మాత్రం ఒక్కటే. ఇది కేవలం కామధేను సంతానం భారతదేశానికే దిగి వచ్చింది. యజ్ఞ భూమియైన భారతదేశానికి దిగి వచ్చింది. అందుకే ఎన్ని దేశాలు తిరిగినా భారతదేశం లాంటి దేశం లేదు. అందుకే ఆ గోసంస్కృతిని, యజ్ఞసంస్కృతి ని భారతదేశంలో పుట్టిన ప్రతివాడూ కాపాడుకోవాలి. వాడు ఏమతం వాడైనా ఈ దేశంలో పుట్టిన ప్రతివాడూ గోవును కాపాడుకోవాలి. భారతదేశపు గోవును హింసించే వాడు ఎవడైనా దేశద్రోహియే.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML