గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 10 December 2014

అయ్యప్ప మాల ప్రాముఖ్యతఅయ్యప్ప మాల ప్రాముఖ్యత
మన పూజా విధానంలొ జపమాలగా ఉన్నత స్థానాన్ని పొందిన కంఠాభరణాలు తులసి,
రుద్రాక్ష, చందనం, స్పటికం, పగడాలు తామర పూసల మాలలు. రుద్రాక్షలు అనేవి అ
పరమేశ్వరుడు ఐన శివుని అంశ వలన ఉద్భవించినవిగా ప్రతీక. అందువలన రుద్రాక్షల
మాలలు అన్నింటిలొ శ్రేష్టమైనవిగా చెప్పుకుంటాము. రుద్రాక్షల వలన
రుద్రాక్షలు ధరించటం వలన మనకు చాలా మంచి ఫలితాలు అనగా భూత పిశాచ భాధలు
తొలుగుతాయి అంతేకాక మన ఆరోగ్యానికి కూడా ఎంతొ మంచిది. రుద్రాక్ష అధిక
కొపాన్ని తగ్గించి బి.పిని కంట్రోల్ చేస్తుంది ఏన్నో ఆరోగ్య సమస్యలకు మంచి
ఔషధంగా పనిచేస్తుంది. తులసి మాల విష్ణుమూర్తికి ప్రతీక. ఈ మాల ధరించటం వలన
శరీరంలో వేడి తగ్గుతుంది. చందన మాల శరీరానికి తాపనివారిణిగా పనిచేస్తుంది.
స్ఫటికమాల మాలిన్యాలను గ్రహిస్తుంది. పగడమాల వలన రక్తప్రసరణ బాగా
జరుగుతుంది. తామర పూసల మాల చర్మ వ్యాధులను దరిచేరనివ్వదు. అందుకే ఈ పరమ
పవిత్రమైన మాలలకు పూజ, అభిషేకం చేసి, ఆ మాలల యందు అ అయ్యప్ప స్వామిని
ఆవహింపచేసి వాటిని ధరించి భక్తులు అందరూ శుధ్ధిగా దీక్ష తీసుకుంటారు.


హరిహరసుతుడు అయ్యప్పస్వామి !
కలియుగంలో మనిష్యులను ఉద్దరించడానికి భగవంతుడు ఎన్నో అవతారాలను ధరించాడు. అటువంటి అవతారమే హరిహరసుతుడు అయ్యప్పస్వామి.


అయ్యప్పస్వామి కరుణాకటాక్షాలకోసం దీక్ష పూని, ఓ మండలంరోజుల పాటు ఆ దీక్షను
కొనసాగించి,తర్వాత ఇంట్లో పూజచేసి, అఖండదీపాన్ని వెలిగించి, ఆత్మదీప దర్శనం
కోసం ఇరుముడిని ధరించి శబరిమలయాత్రను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా
కొంతమంది అయ్యప్ప స్వామికి మండలదీక్ష (48 రోజులదీక్ష) ఎందుకు? ఒకరోజు,
ఐదురోజుల దీక్ష కూడ చేయవచ్చుగా అని అడుగుతున్నారు. అడగడమే కాదు, ఆ
పద్దతుల్లో దీక్షలు చేపట్టి జ్యోతి దర్శనానికి బయలుదేరుతారు. ఆ
వాదప్రతివాదనలను అలా వుంచితే, మండలదీక్షలో ఓ గూఢార్థం ఉంది. మనిషి
పుడుతున్నప్పుడు, అప్పుడున్న నక్షత్రస్థితి, రాశిస్వభావం, ఇంకా అప్పటి
గ్రహస్థితులు, ఆ మనిషి భవిష్యత్తు జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆ
దృష్టితో చూసినప్పుడు
నక్షత్రాలు - 27

రాశులు - 12

గ్రహాలు - 09

మొత్తం - 48
వీటి ప్రభావం నుంచి తప్పుకుని, భగవానుని
పాదపద్మాలను ఆశ్రయించి, ఆత్మసాక్షాత్కారమనే జ్యోతి దర్శనానికే 48 రోజుల
దీక్ష చేస్తున్నాం. ఇదే మండలదీక్షలోని అంతరార్థం. అందుకే మండలకాలంపాటు
దీక్ష.

అయ్యప్పస్వామి స్వరూపాలు
శ్రితజనప్రియం స్వామి చించితప్రదం

శృతి విభూషణం స్వామి సాధుజీవనం

శృతి మనోహరం స్వామి గీతాలాలసం

హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే


నారాయణుడు, పరమశివుడు ఇద్దరూ ఒక్కరే అని పురాణాలు చెబుతున్నాయి.
అయ్యప్పస్వామి పూజలో శంకరునికి ఇష్టమైన పాలాభిషేకం ఉంటే, విష్ణువుకు
ఇష్టమైన హోమమూ ఉంటుంది. తలపై ధరించే చంద్రునిముడిలో శంకరునికి సంబంధించిన
మూడునేత్రాలు ఉంటాయి. కొబ్బరికాయ, నెయ్యి ఉండగా, పిన్ ముడిలో జీవించడానికి
అవసరమైన వస్తువులుంటాయి. విష్ణువు స్థితికారుడు కాదా మరి! శంకరుని
నిరాడంబరమైన నేలపడక, తెల్లవారుఝామున స్నానం, చెప్పులులేని నడక, భస్మధారణ
వంటివి కనిపిస్తుండగా, మెడలోని పుష్పమాల శ్రీహరి మెడలోని వనమాలను
తలపిస్తుంది.


పానవట్టంపై కూర్చోబెట్టిన శివలింగంగా కనిపిస్తున్న అయ్యప్పస్వామి, ఎడమచేతి
వయ్యారపు వంపుతో విష్ణువు మోహీనీ అవతారానికి ప్రతీకగా కనిపిస్తున్నాడు.
ఒంటినిండా భస్మం హరరూపాన్ని తలపిస్తుంటే, ముఖాన ఉండే తిరునామం హరిరూపాన్ని
చూపిస్తుంది. మెడలోని రుద్రాక్షమాల శంకరునిది అయితే, తులసిమాల శ్రీహరికి
ఇష్టం అయినది. అయ్యప్పస్వామి దీక్ష శంకరునికి ఇష్టమైన కార్తీకమాసంలో
ప్రారంభమై, శ్రీహరికి ఇష్టమైన మార్గశిరమాసంలో ముగుస్తుంది.


అయ్యప్ప దర్శనానికి 40 రోజులు దీక్షను పాటిస్తారు. మన శారీరక, మానసిక
వ్యవస్థ భక్తితో చైతన్యం కావడానికి సుమారు 40 రోజులు పడుతుంది. మంత్ర,
దీక్ష నియమాలకు కూడా మండల కాలాన్ని నిర్ణయించారు. భారతీయ శాస్త్ర
సంప్రదాయంలో మండలకాల దీక్షకు ఉన్న శక్తి అటువంటిది.


అయ్యప్పస్వామి గుడికి ఉన్న పద్దెనిమిది మెట్లు, మోక్షము అనే మేడకు ఉన్న
పద్దెనిమిది మెట్లు అని శాస్త్రవచనం. ఇంకా ఈ 18 మెట్లు గురించి మన పురాణాలు
ఇలా చెబుతున్నాయి. ఆవాహన సమయంలో అష్టదిక్పాలకులు (8), త్రిమూర్తులు (13),
వారి భార్యలు (3), ఇంద్రుడు (1), బృహస్పతి (1), ఆదిపరాశక్తి (1), సూర్యుడు
(1) అంటూ మొత్తం పద్దెనిమిది మంది దివి నుండి భువికి దిగిరాగా, దేవాలయ
ప్రతిష్ఠనాడు మృదంగ, భేరి, కాహళ, దుందుభి, తుంబురు, మర్దల, వీణ, వేణు,
నూపుర, మట్టుక, డిండిమ, ఢమరుక, ఢక్క, దవళ, శంఖ, పటహ, జజ్జరి, జంత్ర, అనే 18
వాయిద్యాలను మ్రోగించారు.

Ayyappa Deeksha Niyamaavali


Deekshaasamayamlo Ayyappalu paatinchavalasina nithyaniyamaavali :-

1. Prathidinamu
udayamune Sooryodayamunaku mundugaamelkoni kaalakruthyamulu
theerchukuni, channeella shirasnaanam aacharinchi, Swaamiki
deepaaraadhan gaavinchi, Swaami stothramulu pathinchi tharuvaathane
manchi neerainanu thraagaali. Saayanthramu vela koodaa channeella
shirasnaanam chesi, Swaamiki devathaarchana jaripi, raathripoota bhiksha
cheyaali.

2. Rojoo udayam, saayanthram edo oka devaalayamunu darshinchaali.

3. Nallani dustulu maathrame dharinchaali.

4. Kaallaku cheppulu lekunda thiragaali.

5. Medalo
dharinchina mudramaalanu etti paristhithilonu theeyaraadu. Ayyappa
saannidhyamu cherutaku kaneesamu 41 rojulu mundugaa deesksha
aarambhinchaali.

6. Deekshaakaalamandu gaddamu geesukonutagaani kshavaram cheyinchukonuta gaani panikiraadu. Gollu koodaa katthirinchukonaraadu.

7.
Askalitha Brahmacharyamu paatinchuthooYogigaa jeevinchuta ayyappaku
entho avasaramu. intilo okaveru gadilo vunduta shreyaskaramu. Daampathya
jeevithamu manovaakkaayakarmamulandu thalachutakooda aparaadhamu.

8. Metthati parupulu, dindlu upayogincharaadu. Nela meeda kottha chaapa parachukoni parundata utthamamu.


9. Ayyappalu shavamunu choodaraadu. Bahishtamayina streelanu
choodaraadu. Atu okavela choosina yedala intiki vacchi,
Panchagavya shirasnaanamaacharinchi, Swaami sharanu ghosha
cheppina pidapane manchi neerainaa thraagavalenu.

10. Deekshalo 'Swaamiye sharanamayyappa' ane moola manthramunu eppudoo japinchavalenu.

11. Deekshaa samayamlo streela nandarinee (Bhaaryatho sahaa) Devathaamoorthulugaa bhaavinchaali.

12. Thama
peruchivara 'Ayyappa' ani padamu cherchaali. Itharulanu 'Ayyappa' ani
pilavaali. Stree Ayyappalanu 'Maalikaapuram' ledaa 'Maathaa' ani
pilavaali.

13. Ayyappalanu evarainaa bhikshaku (Bhojanamunaku) piliste thiraskarincharaadu.

14. Ayyappala nuduta eppudu Vibhoodhi, Chandanamu, Kunkuma bottu undaali.

15. Madyamu sevinchutagaani, Pogaaku peelchuta vanti duralavaatu maanukonavalenu. Thaamboolam koodaa nishiddhame.

16. Roju athisaathvikaahaaramune bhujimpavalenu. Raathrulandu alpaahaaramu sevinchavalenu.

17. Tharachoo
Bhajanalalo paalgonuta athyutthamu. Swaami sharanu ghosha priyudu
kaabatti entha sharanu ghosha jaripithe Swaamiki antha preethi.

18. Himsaathmaka
charyalaku dooramugaa vundaali. Abaddamaaduta, durbashalaaduta
cheyaraadu. Adhika prasangamulaku Dooramugaa vundaali.

19. Prathi dinamu swaamiki archana chesi, tharvaatha istadaivamunu preethikoddi dhyaaninchaali.

20. Ashtaraagamulu, Panchendriyamulu, Thrigunamulu, Vidya, avidyalaku dooramugaa vundaali. Ide padunettaambadi.

21. Shakthi koladi deekshaa samayamulo kaneesamu oka saarainaa nalguru Ayyappalaku bhiksha pettuta manchidi.

22. Swami vaariki karpooram preethi kanuka udayam, saayanthram koodaa Karpoora haarathi ivvaali.

23.
Deekshaa samayamlo vayassu, hodaa, anthastu sarvamu marachi saati
Ayyapalaku paadaabhivandanamu cheyutaku venukaadaraadu. Deekshaa
samayamlo thallidandrulaku paadaabhivandanamu cheyavacchunu. kaanee
deekshalenu itharulaku cheyaraadu.

అయ్యప్పస్వామి స్తోత్రం

మనకు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళల్లో మన అయ్యప్పస్వామి ఒకరు. ఏ
దేవుడి ప్రత్యేకత ఆ దేవుడికి ఉంటుందనేది మనందరికి తెలిసిందే ! అలాగే మన
అయ్యప్పస్వామి దేవుడికి కూడా ప్రత్యేకత ఉంది. వారి శక్తుల గురించి, వారికి చేయాల్సిన
పూజల గురించి, ఎలా పూజిస్తే అయ్యప్పస్వామి మనల్ని కరుణించి కాపాడుతాడో ఎ
ప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉందాం ! ఈరోజు తెలుగువన్.కామ్/భక్తి లో
అయ్యప్పస్వామి స్తోత్రం చదువుకుంటూ ఆ అయ్యప్పస్వామిని పూజించుకుందాం !


అయ్యప్పస్వామి స్తోత్రం


అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం

నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !!


చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే

విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!


వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం

సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం !!


కింగిణిదణ్యాను భూషణం పూర్ణచంద్ర నిబాననం

కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం


భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం

మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం !!

శరణు శరణు... అప్పయ్య శరణు.
ఎటుచూసినా
శరణు ఘోష. ఊరూవాడా అయ్యప్ప భక్తులే దర్శనమిస్తున్నారు. పవిత్ర
దీక్షతోస్వామీ అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటారు. కార్తీకమాసం వచ్చిందంటే
చాలు, శరణమయ్యప్ప మము కావుమయ్యప్ప అంటూ భక్తకోటి శబరిమలై వైపు అడుగులు
వేస్తుంటారు. శరీరాన్నీ. మనసును చెడు నుంచి మంచి మార్గంలోకి మళ్ళించే
దీక్షే స్వామి శరణమయ్యప్ప మండల దీక్ష. అందుకు అనువైనదే కార్తీకమాసం.
పరిమితకాలంలోనే అయ్యప్ప దర్శనం జరుగుతుంటుంది. దీనికి కార్తీకమే
ఆద్యం. మోక్షమార్గాన్ని అన్వేషించే వారూ, సన్మార్గాన జీవనయాత్ర
సాగించాలనుకునేవారూ తప్పనిసరిగా జీవితకాలంలో ఒక్కసారైనా శబరిమలై యాత్ర
చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు.
కేరళలోని పంపానదికి చేరువన ఈ పవిత్ర కొండ (మలై) ఉంది. పశ్చిమకనుముల్లోని దట్టమైన అడవిప్రాంతంలో ఉన్న శబరిమలై భక్తుల
ఆధ్యాత్మిక దాహం తీర్చే పుష్కరణి. పంపానది నుంచి ఆలయానికి చేరేలోపు
భక్తులకు అనేక పరీక్షలు తప్పవు. ఎత్తైన కొండప్రాంతం, ఆపైన దట్టమైన
అడవి...ఎంతటివారికైనాసరే, అయ్యప్ప దర్శనం సులువుగా లభ్యంకాదు. కొలిమిలో
కాలితేనేకానీ లోహం మాట విననట్టే, ఈ దేహం కూడా భగవంతుడు పెట్టే పరీక్షలో
కాలాల్సిందే. దానికి దగ్గర దారిలేదు. ఈ సత్యాన్ని చాటిచేప్పేది శబరిమలై
యాత్ర. చలికాలం...మాట వినని స్థితిలో ఉన్న శరీరాన్ని లొంగదీసుకోవాలంటే, ఈ
దేహచింతనను విడనాడి అలౌకికానందపుటంచులు చవిచూడాలంటే అందుకు మనము ముందు ఉన్న
ఏకైక మార్గం స్వామి అయ్యప్ప మండలదీక్షే.

ఆద్యంతం భక్తి పారవశ్యమే :-

శబరిమలై
యాత్ర ఆద్యంతం భక్తి పారవశ్యమే. లక్షలాది మంది భక్తులు ఎరుమేలి అనే
స్థలికి చేరుకుంటారు. అక్కడ పేటతుల్లి ఆడివావరు స్వామి, పేటశాస్త్రీలను
దర్శించుకుని ఆ తరువాత స్వామి సన్నిధానం చేరుతారు. పంపానది నుంచి బయలుదేరి
ఇరుముడి మోసుకుంటూ కొండ అంచున ఉన్న అప్పాచిమేడుకు చేరుకుంటారు. అక్కడి
నుంచి మరికొంత దూరం ప్రయాణం సాగిస్తే బహిరంగప్రదేశంలో శబరిపీఠం
కనిపిస్తుంది. దీన్నే శ్రీరాముని కోసం శబరి నిరీక్షించిన ప్రదేశంగా
చెబుతుంటారు. పంపానదికి. సన్నిధానానికీ మధ్య ఉన్న శరంగుత్తి ఆల్ కు భక్తులు
చేరుకుంటారు. అక్కడ కన్నెస్వాములు శరంపుల్లాలను అక్కడ ఉంచుతారు. ఆ తరువాత
సన్నిధానం చేరుకుని అయ్యప్పస్వామిణి దర్శించుకుంటారు.

అద్వైత మలై :-


అయ్యప్ప అవతారంలోనే ఒక విశిష్టత ఉంది. ఆయన హరిహర సుతుడు.శ్రీమన్నారాయణుడు
మోహినీఅవతారంలో ఉండగా, శివ కేశవులకు జన్మించిన వాడే స్వామి అయ్యప్ప. అందుకే
ఈ పుణ్యక్షేత్రంలో హరిహర బేధం లేదు. అద్వైతానికి నిలువెత్తు కొండ
శబరిమలై. కలియుగంలో ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వరుని తరువాత అంతటి
ప్రాచుర్యం పొందిన దైవం అయ్యప్పస్వామి. అయ్యప్ప దీక్షలోని కఠోర నియమాలు,
చిత్తశుద్ధి, గురుభక్తి, ఆత్మనివేదన ఈ దీక్షలోని ప్రత్యేకతలు. 41 (మండల)
రోజులపాటు ఈ దీక్ష కొనసాగుతుంది. పదునెట్టాండి (18 మెట్లు) ఎక్కి
స్వామివారిని దర్శించుకోవడంతో దీక్ష ముగుస్తుంది. కఠోర దీక్ష ముగియగానే
కలిగే మానసిక ఆనందం అంతా ఇంతా కాదు. మళ్ళీ ఎప్పుడు దీక్ష చేపడదామా, మళ్ళీ
అయ్యప్పస్వామిని కనులారా చూస్తామా... అంటూ పరితపిస్తుంటారు భక్తకోటి.
ఇనుమును సూదంటురాయి (అయిస్కాంతం) ఆకర్షించిన రీతిలోనే అయ్యప్ప తన భక్తులను
ఆకర్షిస్తుంటాడు. ఈ ఏడాది నవంబర్ 16 నుంచి జనవరి మూడు వరకు మండల దర్శనం,
అటుపై జనవరి పది నుంచి మకర సంక్రాంతి వరకు మకరజ్యోతి దర్శనంగా
పరిగణిస్తారు.

శ్రీ అయ్యప్ప పూజ విధానం

శ్రీ గురుభ్యోనమః
శ్రీమహావిష్ణువే నమః

స్వామియేశరణం అప్పయ్య

పూజావిధానం


శుక్లాంబరధరం విష్ణు, శశివర్ణం చతుర్బుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంతం ముపాస్మహే


(అని ప్రార్థన చేసి దీపారాధన చేయవలెను, కుందికి కుంకుమ అలంకరించి నమస్కారము చేయవలెను)


ఓం ధర్మశాస్త్రే నమః పాదౌ పూజయామి

ఓం శిల్పశాస్త్రే నమః గుల్బౌ పూజయామి

ఓం వీరశాస్త్రే నమః జంఘే పూజయామి

ఓం యోగశాస్త్రే నమః జానునీ పూజయామి

ఓం మహాశాస్త్రే నమః ఊరుం పూజయామి

ఓం బ్రహ్మశాస్త్రే నమః గుహ్యం పూజయామి

ఓం శబరిగిరీసహాయ నమః మేడ్రం పూజయామి

ఓం సత్యరూపాయ నమః నాభి పూజయామి

ఓం మణికంఠాయ నమః ఉదరం పూజయామి

ఓం విష్ణుపుత్రాయ నమః వక్షస్థలం పూజయామి

ఈశ్వరపుత్రాయ నమః పార్శ్వౌ పూజయామి

ఓం హరిహరపుత్రాయ హృదయం పూజయామి

ఓం త్రినేతాయ నమః కంఠం పూజయామి

ఓం ఓంకార స్వరూపాయ స్తనౌ పూజయామి

ఓం వరద హస్తాయ నమః హస్తాన్ పూజయామి

ఓం అతితేజస్వినే నమః ముఖం పూజయామి

ఓ అష్టమూర్తయే నమః దంతాన్ పూజయామి

ఓం శుభవీక్షణాయ నమః నేత్రే పూజయామి

ఓం కోమలాంగాయ నమః కర్ణౌ పూజయామి

ఓం మహాపాప వినాశకాయ నమః లలాటం పూజయామి

ఓం శత్రునాశాయ నమః నాసికాం పూజయామి

ఓం పుత్రలాభాయ నమః చుబుకం పూజయామి

ఓం గజాధిపాయ నమః ఓష్టౌ పూజయామి

ఓం హరిహరాత్మజాయ నమః గండస్థలం పూజయామి

ఓం గణేశపూజ్యాయ నమః కవచాన్ పూజయామి

ఓం చిద్రూపాయ నమః శిరః పూజయామి

ఓం సర్వేశ్వరాయ నమః సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ ఆదిశంకర ప్రణీత పంచరత్న స్తోత్రం

1. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం

పార్వతీ హృదయానంద శాస్తారం ప్రణమామ్యహం !!

ఓం స్వామియే శరణమయ్యప్ప

2. విప్ర పూజ్యం విశ్వ వంద్యం విష్ణు శంభు ప్రియం సుతం

క్షిప్ర ప్రసాదం నిరతం శాస్తారం ప్రణమామ్యహం !!

3. మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం

సర్వ విఘ్న హరం దేవం శాస్తారం ప్రణమామ్యహం !!

4. అస్మత్ కులేశ్వరం దేవం అస్మతౌ శత్రు వినాశనం

అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యాహం !!

5. పాండ్యేశవంశ తిలకం భారతేకేళి విగ్రహం

ఆర్తత్రాణ పరందేవం శాస్తారం ప్రణమామ్యాహం !!


పంచ రత్నాఖ్య మేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః

తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే !!

యస్య ధన్వంతరీ మాతా పితా రుద్రోభిషక్ నమః

త్వం శాస్తార మహం వందే మహావైద్యం దయానిధిం !!

స్తోత్రమ్

1. అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం

నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !!

2. చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే

విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!

3. వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం

సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం !!

4. కింగిణిదణ్యాను భూషణం పూర్ణచంద్ర నిబాననం

కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం

5. భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం

మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం !!

మంగళమ్


శంకరాయ శంకరాయ శంకరాయ మంగళమ్

శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళమ్

గురువరాయ మంగళమ్ దత్తాత్రేయ మంగళమ్

గజాననాయ మంగళమ్ షడాననాయా మంగళమ్

రాజారామ మంగళమ్ రామకృష్ణ మంగళమ్

సుబ్రహ్మణ్య మంగళమ్ వేల్ మురుగా మంగళమ్

శ్రీనివాస మంగళమ్ శివబాల మంగళమ్

ఓంశక్తి మంగళమ్ జై శక్తి మంగళమ్

శబరీశా మంగళమ్ కరిమలేశ మంగళమ్

అయ్యప్పా మంగళమ్ మణికంఠా మంగళమ్

మంగళమ్ మణికంఠా మంగళమ్ శుభ మంగళమ్

మంగళమ్ మంగళమ్ మంగళమ్ జయ మంగళమ్

కర్పూర హారతి


కర్పూర దీపం సుమనోహరం విభో

దదామితే దేవవర ప్రసేదభో

పాంపాంతకారం దురితం నివారాయ

ప్రత్నాన దీపం మనసే ప్రదీపయా

శ్రీ అయ్యప్పస్వామి అష్టోత్తర శతనామావళిః


ఓం మహాశాస్త్రే నమః

ఓం విశ్వశాస్త్రే నమః

ఓం లోశాస్త్రే నమః

ఓం ధర్మశాస్త్రే నమః

ఓం వేదశాస్త్రే నమః

ఓం కాలశాస్త్రే నమః

ఓం గజాదిపాయ నమః

ఓం గజారూఢయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం వ్యాఘ్రరూఢాయ నమః

ఓం మహాద్యుతయే నమః

ఓం గోప్తే నమః

ఓం గీర్వాణ సం సేవితాయ నమః

ఓం గతాంతకాయ నమః

ఓం గణగ్రిణే నమః

ఓం ఋగ్వేదరూపాయ నమః

ఓం నక్షత్రాయ నమః

ఓం చంద్రరూపాయ

ఓం వలఅహకాయ నమః

ఓం ధర్మ శ్యామాయ నమః

ఓం మహారూపాయ నమః

ఓం క్రూరదృష్టయే నమః

ఓం అనామయామ నమః

ఓం త్రినేత్రాయ నమః

ఓం ఉత్పలాతాతారాయ నమః

ఓం కాలహంత్రే నమః

ఓం నరాధిపాయ నమః

ఓం ఖంధేందుమౌళియే నమః

ఓం కల్హాకుసుమప్రియాయ నమః

ఓం మదనాయ నమః

ఓం మాధవ సుతాయ నమః

ఓం మందారాకు సుమార్చితాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం మహోత్సాహాయ నమః

ఓం మహాపాపవినాశాయ నమః

ఓం మహాధీరాయ

ఓం మహాశూరాయ

ఓం మహాసర్పవిభూషితాయ నమః

ఓం శరధరాయ నమః

ఓం హాలాహలధర్మాత్మజాయ నమః

ఓం అర్జునేశాయ నమః

ఓం అగ్నినయనాయ నమః

ఓం అనంగవదనాయతురాయ నమః

ధుష్టగ్రహాధి పాయ నమః

ఓం శ్రీదాయ నమః

ఓం శిష్టరక్షణాదీక్షితాయ నమః

ఓం కస్తూరి తిలకాయ నమః

ఓం రాజశేఖరాయ నమః

ఓం రాసోత్తమాయ నమః

ఓం రాజరాజార్చితాయ నమః

ఓం విష్ణుపుత్రాయ నమః

ఓం వనజనాధిపాయ నమః

ఓం వర్చస్కరాయ నమః

ఓం వరరుచయే నమః

ఓం వరదాయ నమః

ఓం వాయువాహనాయ నమః

ఓం వజ్రకాయాయ నమః

ఓం ఖడ్గపాణయే నమః

ఓం వజ్రహస్తాయ నమః

ఓం బలోద్ధాతాయ నమః

ఓం త్రిలోక జ్ఞానాయ నమః

ఓం పుష్కలాయ నమః

ఓం వృత్త పావనాయ నమః

ఓం పూర్ణాధవాయ నమః

ఓం పుష్కలేశాయ నమః

ఓం పాశహస్తాయ నమః

ఓం భయపహాయ నమః

ఓం వషట్కారరూపాయ నమః

ఓం పాపాఘ్నాయ నమః

ఓం పాషండ రుధి రానాశనామ నమః

ఓం పంచపాండవ సంస్తాత్రే నమః

ఓం పరపంచాక్షారాయ నమః

ఓం పంచాక్త్ర సూతాయ నమః

ఓం పూజ్యాయ నమః

ఓం పండితాయ నమః

ఓం పరమేశ్వరాయ నమః

ఓం భవతాప ప్రశమనాయ నమః

ఓం కవయే నమః

ఓం కవీనామాధిపాయ నమః

ఓం భక్తాభీష్ట ప్రదాయకాయ నమః

ఓం కృపాళవె నమః

ఓం క్లేశనాశనాయ నమః

ఓం సమాయ, అరూపాయ నమః

ఓం సేనానినే నమః

ఓం భక్తసంపత్ర్పదాయకాయ నమః

ఓం వ్యాఘ్రచర్మధరాయ నమః

ఓం శూలినే నమః

ఓం కపాలినే నమః

ఓం వేణువదనాయ నమః

ఓం కళారవాయ నమః

ఓం కంబు ఖఠాయ నమః

ఓం కిరీటవిభుషితాయ నమః

ఓం ధుర్జటినే నమః

ఓం వీరనిలయాయ నమః

ఓం వీరేంద్ర వందితాయ నమః

ఓం విశ్వరూపాయ నమః

ఓం వృషపతయే నమః

ఓం వివిధార్థ ఫలప్రదాయకాయ నమః

ఓం ధీర్ఘ నాసాయ నమః

ఓం మహాబాహవే నమః

ఓం చతుర్బాహవే నమః

ఓం జటాధరాయ నమః

ఓం సనకా మునిశ్రేష్టస్తుత్యాయ నమః

ఓం అష్టసిద్ధి ప్రదాయకాయ నమః

ఓం హరి హరాత్మజాయ నమః


సర్వదేవతా స్వరూప హరిహర సుత ధర్మశాస్త్ర

శ్రీ అయ్యప్ప స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ సమర్పయామి

శ్రీ అయ్యప్ప స్వామినే నమః ధూపః మాఘ్రాపయామి

భక్తుడే భగవంతుడు

దీక్ష చేపట్టగానే నేను అన్న భావన నశిస్తుంది. ఈ దేహానికి ఉన్న పేరు, ఈ దేహం ధరించే దుస్తులు, తినే ఆహారం, శారీరక సౌఖ్యాలు, ఆచార వ్యవహారాలూ, దినచర్య.... అన్నీ ఒకే ఒక్క దీక్షతో మారిపోతాయి. అందుకే దీక్ష పట్టగానే ఆ వ్యక్తికి పేరు అంతర్థానమై 'స్వామి' గానే పిలవబడుతుంటాడు. మమకారాన్ని విడిచిపెట్టి, స్వామి ఆకారాన్ని మనసులో ప్రతిష్టించుకోవడం ఏ క్షణాన మొదలవుతుందో అప్పుడే మానవుడు మాధవునిగా పరివర్తించడం మొదలవుతుంది. ఈ పరిణామక్రమం పూర్తి అయితే అప్పుడు భక్తునికీ భగవంతునికీ తేడా ఉండదు. అబేధ్యమే...ఈ సత్యాన్ని చాటిచెప్పడానికే అయ్యప్పదీక్ష ప్రారంభమైంది. కులమతబేధాలులేని, తరమత బేధాలు లేని ఓ ఆధ్యాత్మిక ప్రపంచమే శబరిమలై.

నవవిధ సేవలు :-
నవవిధ సేవలతో అయ్యప్పస్వామిని పార్థిస్తుంటారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, నమస్కారం, ధ్యానం, స్మృతం, ఆత్మనివేదనలతో అయ్యప్పని కొలుస్తుంటారు. స్వామి దీక్షలో ఇరుముడికి విశిష్టథ ఉంది. ఇందులో రెండు ముడులు ఉంటాయి. ముందు ఉన్న ముడిలో స్వామి అయ్యప్ప స్వరూపమైన ముద్ర, కొబ్బరికాయ, స్వామివారికి సమర్పించే వస్తువులు ఉంచుతారు. వెనుక ఉన్న ముడిలో యాత్రకు అవసరమయ్యే పదార్థాలను ఉంచుకుంటారు. కొబ్బరికాయను నేతితో నింపుతారు. ఈ నెయ్యి జ్ఞానానికి ప్రతీకగా చెప్పుకుంటారు.

కొబ్బరికాయకు బిగించే కార్క్ ను వైరాగ్యానికి చిహ్నంగా భావించి మూత పెడతారు. ఆపైన కాయకు ఆత్మ అనే లక్కతో సీల్ వేస్తారు. ఈ జ్ఞానమనే నేయ్యితోనే సన్నిధానంలో స్వామి అయ్యప్పకు నిండుమనసుతో అర్పించుకున్నట్లు భావించాలి. దీన్నే ఆత్మ నివేదన మంటారు. స్వామి దీక్షలో పరమార్థం కూడా ఇదే. నేను అన్న అహంభావంతో ఉన్న దేహం నుంచి జ్ఞానాన్ని వేరుచేసి దాన్ని అయ్యప్పకు కైంకర్యం చేయడంతో దేహంలోని అనేకానేక సందేహాలు పటాపంచలైపోతాయి. ఓ దివ్యజ్యోతి దర్శనమవుతుంది. అదే మకరజ్యోతి.

పదునెట్టాండి (18 మెట్లు):-
స్వామి సన్నిధానంలో ఉండే 18 మెట్లను పరుశురాముడు నిర్మించాడని చెప్పుకుంటారు. అష్టదిక్పాలకులు ఎనిమిది మంది (ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు), రెండు యోగములు (కర్మయోగం, జ్ఞానయోగం), విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానానికి రూపాలుగా ఈ పద్దెనిమిది మెట్లను ఏర్పరచారు. సన్నిధానంలో చేరిన భక్తులు 18 మెట్లను ఎక్కేముందు కొబ్బరికాయను కొట్టి ఆ నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత మాలిగై పుత్రమ్మ వారి సన్నిధికి చేరుకుని ఆమె చుట్టూ కొబ్బరికాయలు దొర్లించి పసుపు, జాకెట్ ముక్కలను ఆమెకు మొక్కుబడిగా చెల్లించుకుంటారు. ప్రతి ఏటా నవంబర్ మధ్య నుంచి జనవరి వరకు శబరిమలై భక్తకోటితో పులకించిపోతోంది.

రెండున్నరమాసాల పాటు దేశంయావత్తు, మరీ ముఖ్యంగా దక్షిణభారతం శరణుఘోషతో మారుమ్రోగిపోతుంటోంది. ప్రతిరోజు సుమారు ఐదారులక్షల మంది అయ్యప్ప భక్తులు పంపానదితీరం నుండి ఐదు కిలోమీటర్ల దూరం ఎత్తైన కొండ ప్రాంతంలో ప్రయాణం చేసి సన్నిధానం చేరుకుంటారు. అయ్యప్ప ఆలయానికి చేరుకోవాలంటే, పంపానది నుంచి సుమారు, 4,135 అడుగుల ఎత్తులో ఉన్న సన్నిధానంకు చేరాల్సిందే. ఈ మార్గమే మనోదౌర్భాల్యాలనీ , శారీరక సౌఖ్యాలనీ మండించి బూడిద చేయగల దైవమార్గం. ఈ మార్గంలో ఎదురయ్యే కష్టాలే ఆ హరిహరసుతుడు పెట్టే పరీక్షలు. వీటిలో నెగ్గితే మోక్షమార్గం కళ్లెదుట కనబడుతుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML