పూజా ఫలం పరిపూర్ణంగా దక్కాలంటే ?
ఆలయంలోనైనా ... పూజా మందిరంలోనైనా భగవంతుడిని షోడశ ఉపచారాలతో పూజించాలనే నియమం ప్రాచీన కాలం నుంచి పాటించడం జరుగుతోంది. ఆవాహనం .. ఆసనం .. పాద్యం .. అర్ఘ్యం .. ఆచమనం .. స్నానం .. వస్త్రం .. యజ్ఞోపవీతం .. శ్రీ గంధం .. అలంకారం .. పుష్పం .. ధూపం .. దీపం .. నైవేద్యం .. తాంబూలం .. నీరాజనం అనేవి షోడశ ఉపచారాలుగా చెప్పబడుతున్నాయి. ఈ ఉపచారాలకు ఎలాంటి భంగం కలగకుండా భగవంతుడిని పూజించ వలసి వుంటుంది.
కొంతమంది ఈ షోడశ ఉపచారాలతో కూడిన పూజా విధానాన్ని గురించి పెద్దగా పట్టించుకోరు. తీరిక లేదనో ... ఓపిక లేదనో పూజా కార్యక్రమాన్ని యాంత్రికంగా ముగించేస్తుంటారు. తమ దైనందిన కార్యక్రమాల్లో పడిపోతుంటారు. అయితే కాస్త తీరిక చేసుకునైనా ... ఓపిక తెచ్చుకునైనా పూజా విధానంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని శాస్త్రం చెబుతోంది.
ఉదయం వేళలో కాస్తంత ముందుగా నిద్రలేవడం వలన పూజను మనస్పూర్తిగా చేసుకునే అవకాశం లభిస్తుంది. అప్పుడు భగవంతుడికి షోడశ ఉపచారాలను చక్కగా నిర్వహించవచ్చు. అలా కాకుండా కొంతమంది ఆలస్యంగా నిద్రలేచి హడావిడి పడిపోతుంటారు. నిత్య జీవితంలో తలపెట్టిన ఏ కార్యం పూర్తి కావాలన్నా అందుకు భగవంతుడి అనుగ్రహం కావాలి. అలాంటి భగవంతుడి ఆరాధనలో షోడశ ఉపచారాలను పాటించకపోవడం దోషంగా చెప్పబడుతోంది.
అనారోగ్య కారణాల వలన శరీరం సహకరించకపోతే తప్ప, పూజలో షోడశ ఉపచారాలను పాటించవలసిందే. లేదంటే ... ఒక్కో ఉపచారాన్ని చేయడం వలన ఒక్కో విశేషమైన ఫలితం ఎలా లభిస్తుందో, ఒక్కో ఉపచారాన్ని చేయకపోవడం వలన ఒక్కో దోషం కలుతుందని చెప్పబడుతోంది. కాబట్టి షోడశ ఉపచార విధానాన్ని అనుసరిస్తూ భగవంతుడిని పూజించడం వలన మాత్రమే పరిపూర్ణమైన ఫలితం దక్కుతుందనే విషయాన్ని మరిచిపోకూడదు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Tuesday, 30 December 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment