గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 19 December 2014

మనం చనిపోయాక మళ్లీ ఎలాంటి జన్మ వస్తుంది?మనం చనిపోయాక మళ్లీ ఎలాంటి జన్మ వస్తుంది?

ఈమధ్యలో దేశంలో దీనిగురించి ఒక కొత్త సిద్ధాంతం ప్రచారంలోకి వచ్చింది. అది వేద ప్రమాణాన్ని పొందలేదు. కానీ అది బహు ప్రచారంలో ఉంది.
ఇండియా మేడ్ వస్తువులు సరైన సమయంలో సరైన ధరకు అందుబాటులో లేకపోవడం వల్ల దేశమంతటా చైనా వస్తువులు మనతో ఆడుకుంటున్నాయి. అలాంటిదే ఈ సిద్ధాంతం.
ఆ సిద్ధాంతం ఏంటంటే ; చనిపోయిన ప్రతి జీవీ మళ్ళీ అదే శరీరాన్నే పొందుతుంది. అంటే కుక్క చనిపోతే మళ్ళీ కుక్కగానే పుడుతుంది. మనిషి చనిపోతే మళ్లీ మనిషి గానే పుడతాడు. అంతేగానీ వాడు చేసిన హీన ఖర్మల బట్టి వాడికి కుక్క, పాము లాంటి హీన జన్మలు రావు
.ఇది‬ తప్పు.
భగవంతుడు పరమ దయాళువు. ఆయన తన సృష్టి లో అసమతౌల్యం నెలకొల్పుతాడని అనుకోవడం మన అఙ్ఞాన సూచకం.
చూడండి, పైన చెప్పిన సిద్ధాంతం సరైందని మనం ఒప్పుకుంటే భగవంతుడు పక్షపాతి అని రుజువవుతుంది. ఎలాగంటే, ప్రతిరోజూ నీవు ఇంటిలో చక్కగా వండుకుని తింటుంటే, నీ ఇంటి ముందు ఉన్న కుక్క మాత్రం నీవెప్పుడు ఒక పిడికెడు అన్నం దానికి పెడతావా అని ఎదురుచూస్తూ బతుకుతోంది.
అలాగే నీ ప్రాణాన్ని ఎంతో విలువైందిగా భావించే నీవు నీకు ఏ హానీ చేయకపోయినా ఒక తేలు గాని, పాము గాని కన్పిస్తే వదిలేస్తే మళ్లీ ఎప్పుడైనా హాని చేస్తుందేమో అని దాన్ని కొట్టి చంపుతున్నావు.
మరి భగవంతుడు నిజంగా దయాళువు అయితే నీకు మాత్రమే అన్నీ ఇచ్చి మిగిలిన ప్రాణులకు ఎందుకలాంటి ఘోరమైన జన్మలను ఇస్తాడు?
అడవిలో జంతువులు ఒకదానికొకటి చంపుకుని, కొన్ని కేవలం చంపబడుతూ, జీవిస్తున్నాయి.సింహం అడవికి రాజే అయినా అది ఎలాంటి జీవితం గడుపుతుందో మనకందరకు తెలుసు.
మరి పై వారి సిద్ధాంతం ప్రకారం దేవుడు మనిషి పట్ల పక్షపాతం వహించి ఆలోచన శక్తిని, ఆహారం సంపాదించుకునే శక్తిని, మాట్లాడే, నవ్వే, ఎదిగే శక్తిని ఇచ్చి మిగిలిన జీవులకు అవేవీ ఇవ్వకుండా నిర్దయతో వాటికి నానా కష్టాలు గల జీవితాన్నిచ్చి ఆ వినోదాన్ని పై నుంచి చూస్తూ ఆనందిస్తున్నాడందామా ?
దయాళువు కాదంటావా? అలాంటప్పుడు ఆ దేవుడు మన కవసరం లేదు. ఎందుకంటే రేప్పొద్దున మనపైన కూడా తన కర్కశత్వాన్ని చూపుతాడేమో.
దయాళువే అంటావా, అలాగయితే కుక్కను, తేలును, మనలను సమానంగా ప్రేమించగలగాలి.


కానీ శాస్త్రం మాత్రం ఆయన అనంత కృపామయుడు, అపార దయాళువు అని చెబుతుంది. అయితే మరి ఈ జన్మలు ఎలా నిర్దేశించబడుతున్నాయి అంటే, మానవుడు చేసుకున్న పాప పుణ్యాల బట్టి వాడు మానవుడిగా, మానవులలో కూడా, కుంటివాడిగా, దరిద్రుడుగా, ధనవంతుడుగా, అనాధగా, లేకపోతే కుక్కగా, పందిగా ఇంకా 84 లక్షల జీవ రాశులలో పుడతాడు.
వేప విత్తనం వేస్తే వేప చెట్టే వస్తుంది. మామిడి చెట్టు రాదు అలాగే మనిషి చనిపోతే మనిషిగానే పుడతాడు అన్న వీరి సిద్ధాంతం పూర్తగా తప్పు అని రూఢీ అయింది.
అలాగే, ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిలో ఆత్మ ఉంది. పంది ఆత్మ, , మనిషి ఆత్మ, ,కోడి ఆత్మ సెపరేట్ గా లేవు. ఆత్మ పరిపూర్ణం. అది అంతటా ఒక్కటే. ప్రతి ప్రాణి లో ఉన్నదీ ఒకే ఆత్మ.
చేసిన పనులతో పాటుగా మన మరుజన్మను నిర్ణయించే మరో కోణం చూడండి.
యం యం వాపి స్మరణ్ భావం త్యజంత్యంతే కలేవరమ్|
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః|| భ.గీ.8-6
కౌంతేయ! మనుష్యులు అవసాన దశలో ఏఏ భావములను స్మరించుచూ దేహ త్యాగం చేస్తారో మరుజన్మలో ఆయా స్వరూపాన్ని పొందెదరు.
దీనికి ఉదాహరణే భాగవతం లోని జడభరతుని కథ.
కనుక భగవద్గీత లేదా వేద ప్రమాణానికి విరుద్ధంగా చెప్పబడేది ఏదైనా అసత్యమే.
పెద్దలద్వారా విన్నదాన్ని మీకు విన్నవించాను. విలువైనదనుకుంటే అందరికీ తెలియచేయండి.
# వైఖానస రత్నాకరం

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML