గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 December 2014

ధర్మసూక్ష్మం తెలియకుండా నిర్ణయము చేస్తే ఏమవుతుంది?

ధర్మసూక్ష్మం తెలియకుండా నిర్ణయము చేస్తే ఏమవుతుంది?
ఓ బ్రాహ్మణుడు పితృకార్యము చేస్తున్నాడు. పాలు పెరుగు పోసే అమ్మాయి, తన ఇంటిని నుండి ఈయనకు పెరుగు పొయ్యాలని బయలుదేరింది. కాని తట్టలో పెట్టుకున్న పెరుగుకుండకు పైన పెట్టిన బట్ట గాలికి తొలిగింది. అదేసమయానికి ఒక గరుడపక్షి ఓపాముని భూమి నుండి ఎగరేసుకు పోయింది. పాము కక్కిన కాలకూట విషం ఈ పెరుగు కుండలో పడింది. ఇదేమి తెలియని ఆ గొల్లవనిత, బ్రాహ్మణుడి ఇంట్లో ఆ పెరుగు పోసి వెళ్ళింది. బ్రాహ్మణుడు పితృకార్యమునకు వచ్చిన వేదబ్రాహ్మణులు మృత్యువాత పడ్డారు. ఇది జరిగిన తరువాత ఆ గ్రామంలో ఈ విషయాన్ని పెద్దగా చర్చించటం మొదలుపెట్టారు.
కొందరు " ఆ గొల్లవనితది" తప్పన్నారు. కొందరు పాముది తప్పుఅని, కొందరు గరుడపక్షిది తప్పు అని, కొందరు బ్రాహ్మణుడిది తప్పుఅని వాదించటం ఆరంభించారు. ఈ వాదప్రతివాదములు యమలోకం దాక వెళ్ళినాయి. చిత్రగుప్తుడు, "ప్రభూ! పాపం ఎవరికి చెందుంతుంది" అని తన ప్రభువైన యమధర్మరాజుని అడిగాడు.
దానికా సమవర్తి "చిత్రగుప్తా! ప్రకృతిసిద్ధంగా జరిగిన విషయాలకు పాపం ఎవరికి చెందదు. ఆకలిగొన్న పక్షి తన ఆహారంకోసం పాముని తన్నుకెళ్ళటం సహజం. అది ప్రాణభయంతో విషం క్రక్కుట సహజం. గాలికి పెరుగుకుండ పైన బట్ట తొలగటం సహజం. ఇలా సహజముగా జరిగిన సంఘటనలకు పాపం అంటావేమిటి? ఎమైనా పాపం ఉంటే, అక్కడ భూలోకంలో ఈ ధర్మసూక్ష్మాలు తెలియకుండా "పాపం వీరిది, వారిది అని" ధర్మనిర్ణయం చేస్తున్నారే, వారికి పంచు" అని తీర్పునిచ్చాడు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML