గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 14 December 2014

భగవద్గీతను గురించి చెప్పుకునేటప్పుడు వ్యాసుని స్మరిస్తారు.

వ్యాసం వశిష్ఠ నప్తారం, శక్తే పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్||
వ్యాసుడు వశిష్ఠుడికి ముని మనుమడు, శక్తికి మనుమడు, పరాశరుడికి పుత్రుడు, తపోనిధియైన శుకునికి తండ్రి. భగవద్గీతను గురించి చెప్పుకునేటప్పుడు వ్యాసుని స్మరిస్తారు. ఆయన వంశము ఆర్యసంస్కృతికి మరోపేరు. వారి చరిత్రలు స్మరిస్తే ఆయనను స్తోత్రముచేసినట్లే.
భగవద్గీత ధృతరాష్ట్రుని మాటతో ప్రారంభమౌతుంది. యుద్ధములో ఏమిజరుతుందో అన్న ఆసక్తితో వ్యాసుని అర్థించాడు. వ్యాసుడు "యుద్ధముయొక్క పరిణామము ఎలా ఉంటుందో నాకూ తెలుసు, నీకూ తెలుసు, నీవు ఆదృశ్యాలను కళ్ళారా చూచి భరించలేవు. నీకు ఎప్పటికప్పుడు జరిగిన సంఘటనలను చెప్పడానికి సంజయునికి దివ్యదృష్టి ఇస్తున్నాను." అన్నాడు. ధృతరాష్ట్రునికి తన పిల్లలు అధర్మ మార్గంలో ఉన్నారని తెలుసు, అన్యాయంచేశారని తెలుసు. భగవంతుడు పాండవుల పక్షమున ఉన్నాడని తెలుసు. ఐనా ఏదో ఆశ. ఈషణత్రయము వలన వచ్చే దౌర్బల్యమతనిది. ధనేషణ, దారేషణ, పుత్రేషణ - (ధనము, భార్య, పుత్రులపై వ్యామోహము) ఇదే ఈషణ త్రయం. ఇదే మనుష్యునికి బంధనం.
యుద్ధము చేయడం అర్జునునకు స్వధర్మం. దానికై అతడు ఆయుధములతో రథముపై రణరంగానికి వచ్చాడు. స్వధర్మాచరణములో సందేహాలు వచ్చాయి. తన బంధువులచేతిలో తాను చనిపోవచ్చునని అతడు దుఃఖించలేదు. ఎవరిమృత్యువు వారికి దుఃఖప్రదముకాదు. దుఃఖించుటకు తాను ఉండడు. తనకు వచ్చిన సందేహము వేరు. ఇతరులకు దుఃఖకరమైన కర్మనుచేయుట అజ్ఞానమని తోచినది. దుఃఖము కలిగినది. ఈదుఃఖము మోహముచేత కలిగినదని భగవంతుని బోధ. మోహముచేత ఆవరించిన దుఃఖము పోతేనే మనుష్యుడు ఆనందస్వరూపుడై మోక్షసాధనకు అర్హుడౌతాడు. ముక్తికొఱకు సాధనచేయాలి. సాధన చేసే అర్హతకొఱకు మోహము నశించాలి. గీత చివర్లో “మోహముపోయినదా?” అని కృష్ణుడు అర్జునుని అడుగుతాడు. "నష్టే మోహః" అని సమాధానం ఇస్తాడు అర్జునుడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML