గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 December 2014

ఈశ్వర కృపా ప్రసరణము జరగడాన్ని 'శ'కార బీజం అంటారు.ఈశ్వర కృపా ప్రసరణము జరగడాన్ని 'శ'కార బీజం అంటారు. అందుకే శివునికున్న పేర్లలో ప్రధానమైన పేరు 'శంకర'. "శం కరోతి ఇతి శంకరః" - అందరికీ శుభం చేస్తే ఒకడికి ఏడుపు ఎందుకండీ? వస్తువుయందు ఉండదు సుఖము. మనస్సుయందు ఉంటుంది. మనస్సుకు అనుకూలంగా ఉన్నదని భావనను ఏర్పాటు చేసేవాడు శివుడు. అది శివానుగ్రహం. అందుకే శివుడికి శంకరా అని పేరు. 'శ' ఎక్కడైనా వస్తే అది సుఖ బీజం అని గుర్తు. అంటే హమ్మయ్య అన్నీ అనుకూలంగా ఉన్నాయి అంటే ఉత్సాహంగా ఉంటుంది. ఉత్సాహాన్ని ప్రోది చేస్తూ అన్నీ అనుకూలంగా ఉన్నాయని సంతోషంగా ఉండగలిగేటట్లు చేయగలిగినది ఏదో అది 'శ'కారం. ఈ 'శ'కారం ఎక్కడనుంచి ఎక్కడి వరకు విస్తరిస్తుంది అంటే ప్రారంభంలో ఏదో ఒకటి నాకు బాగుంది అంటాడు. ఇంకా విస్తరించింది అనుకోండి అనుకూల ప్రతికూలములతో సంబంధం ఉండదు. దానికి ఉదాహరణ ఏం చెప్తారు అంటే గాలిని చెప్తారు. గాలి మల్లెపందిరి మీదనుంచి వెళుతోంది అనుకోండి. మల్లెపూలతో సంగమం పొంది సువాసన వస్తుంది. ఎవరికీ? పీల్చేవాడికి. అదే గాలి కొంచెం ముందుకెళ్ళి ఒక కుక్కయొక్క కళేబరం మీదనుంచి వెళ్ళింది. దుర్వాసన. గాలికి పొంగు లేదు, క్రుంగు లేదు. సూర్యకిరణములు చూడండి. గంగానదినీ చేత్తో ముట్టుకుంటాయి. కుళ్ళిపోయిన కుక్క కళేబరాన్నీ (కిరణములు)చేత్తో ముట్టుకుంటాయి. ఒకటి ముట్టుకున్నప్పుడు పొంగూ లేదు, ఒకటి ముట్టుకున్నప్పుడు క్రుంగు లేదు. పొంగు, క్రుంగు లేని స్థితి నిజమైన సుఖ స్థితి. దానిని వైరాగ్య సుఖం అంటారు. 'శ' విస్తరిస్తే వైరాగ్యంగా మారుతుంది. వైరాగ్యం బాగా ఉంచుకుంటే మోక్షసుఖంగా మారుతుంది. 'శ' విస్తరిస్తే ఎక్కడిదాకా వెళుతుంది అంటే ఇక్కడ అనుకూలంగా ఉన్నదన్న భావన దగ్గరనుంచి మోక్షము వరకు వెళుతుంది. అందుకే కామకోటికి పర్యాయ పదం 'శ'. కోటి అంటే కోటి సంఖ్య అని కాదు, కోటి అంటే హద్దు అని. కామ అంటే కోర్కె. కోర్కెల యొక్క హద్దు మీద ఆవిడ నిలబడి ఉంటుంది. దేని అంచైనా ఆవిడే. ఆవిడ ఇవ్వగలదు. ప్రసరణం చేయగలదు. కదలిక చేత ప్రసరింపబడితే అమ్మవారు. కదలికలన్నీ ఆగిపోతే శివుడు. అదీ తత్త్వం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML