పరిపూర్ణ పుణ్యఫలం ఇలా దక్కుతుంది
తెలిసో తెలియకో చేసిన పాపాలు జీవితంలో కొన్ని ఇబ్బందులను కలిగిస్తుంటాయి. ఆర్ధికపరమైన ... ఆరోగ్యపరమైన సమస్యలు ప్రధానమై, మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా దైవానుగ్రహాన్ని కోరుతూ ఆయన పాదాలను ఆశ్రయిస్తుంటారు. ఇందుకోసం దగ్గరలో గల ఆలయాలకు వెళ్లి పూజాభిషేకాలు చేయిస్తుంటారు.
ఇక సమస్యలు తీవ్రరూపం దాల్చినప్పుడు ఏ దేవుడైనా తమ మొర ఆలకించకపోతాడా అని ఆయా పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వుండటం జరుగుతుంది. మరికొందరు తమ భవిష్యత్తు ఆనందంగా ... ఆశాజనకంగా వుండాలని దైవాన్ని కోరుకునేందుకు ఆలయ దర్శనం చేస్తుంటారు. ఇలా ఒక్కొక్కరూ తమ మనసులోని మాటను భగవంతుడి చెవిన వేయడానికే ఆలయాలకి వెళుతూ వుంటారు.
మనసులోని కోరిక ఏదైనా దైవ దర్శనం కోసం వెళ్లినప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలి. చాలామంది నేరుగా గుడిలోకి వెళ్లి ప్రధాన దైవాన్ని దర్శించుకుని, వెంటనే బయటికి వచ్చేస్తుంటారు. అంతటితో ఆలయదర్శనమైపోయినట్టుగా భావిస్తుంటారు. ధ్వజ స్తంభాన్ని ... గర్భాలయ విమానాన్ని ... పరివార దేవతలను గాని పట్టించుకోకుండా హడావిడిగా వెనుదిరుగుతుంటారు. ఓ రకంగా ఇది పరివార దేవతలను అవమానపరచడమే అవుతుంది.
ఎప్పుడూ కూడా ఆలయంలోకి ప్రవేశిస్తూ గోపురానికి ... లోపలికి అడుగుపెట్టిన తరువాత ధ్వజ స్తంభం పైభాగానికి ... ఆ తరువాత గర్భాలయ విమానానికి నమస్కరించాలని శాస్త్రం చెబుతోంది. అలాగే ప్రధాన దైవదర్శనం అనంతరం అక్కడి ప్రాంగణంలో గల పరివార దేవతల ఆలయాలను ... మందిరాలను ప్రదక్షిణ క్రమంలో తప్పనిసరిగా దర్శించుకోవాలి. ఇక భగవంతుడి సన్నిధిలో ఉన్నంత వరకూ ఆయనపైనే దృషి పెట్టాలి. ఆయన నామాన్నే స్మరిస్తూ నమస్కరించాలి. ఆ సమయంలో తమకన్నా పైస్థాయి వాళ్లు కనిపించినా అక్కడ నమస్కరించకూడదు.
భగవంతుడి తీర్థ ప్రసాదాలు భక్తి భావంతో స్వీకరించి, దర్శనం ద్వారా లభించిన కుంకుమ .. అక్షితలను పదిలంగా ఇంట్లోని పూజా మందిరానికి చేర్చాలి. తొందరపడకుండా ... నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఈ నియమాలను పాటించినప్పుడే ఆలయ దర్శన ఫలితం పరిపూర్ణంగా దక్కుతుందని గ్రహించాలి.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Tuesday, 30 December 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment