గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 12 December 2014

ఋగ్వేదం ఏ కాలం నాటిది?

ఋగ్వేదం ఏ కాలం నాటిది?
మనం చదువుకునే చరిత్ర పాఠ్యగ్రంథాలు క్రీపూ. 1250.
అని చెబుతున్నాయి. ఇది నిజమేనా?
కాదంటున్నాయి పరిశోధనలు.
మనం ప్రస్తుతం చదువుకుంటున్న చరిత్ర
మనం వ్రాసుకున్నది కాదు. తెల్లోడు వ్రాసిస్తే.. వాడు ప్రపంచ
మేధావి అని విశ్వసించి , వాడిచ్చిపోయిన అదే చరిత్రనే మనం ఇంకా
పవిత్రంగా చదువుకుంటున్నాము.
తెల్లోడు చరిత్ర ఎలా వ్రాశాడు?
వాడు మానవ చరిత్రను భూమి పుట్టినప్పటి నుంచి లెక్కించి
చరిత్రను తయారుచేసాడు. మరి
మానవుడు ఎప్పుడు పుట్టాడు అని వాడికెలా తెలిసింది అంటే,
వాడి మతగ్రంధం బట్టి తొలిమానవ జననం నుంచి కాలాన్ని
లెక్కించాడు. వాడి వెర్షన్ లో తప్పేమీ లేదు. వాడి లెక్క
ప్రకారం సృష్టి క్రీపూ. 4000 ఏండ్ల క్రింద జరిగింది. ఆ
ప్రకారము ప్రపంచ చరిత్రను అంచనా వేసాడు.
ఐతే మరి ఆప్రకారము మన దేశ
చరిత్రను వ్రాయడం మొదలు పెట్టిన వాడికి
ఆద్యంతాలు అర్థం కాలేదు. నాల్గు యుగాలు, 9 అవతారాలు,
ఇంకా వాడు సృష్టి మొదలైందని చెబుతున్న నాటికి ఇక్కడ ద్వాపర
యుగం నడుస్తోంది. వాడికి అర్ధం కాలేదు.నిజాన్ని
నిగ్గు తేల్చలేక,
ఈ గందరగోళం అంతా ఎందుకని భారతదేశ చరిత్రను ఈ 6 వేల
ఏళ్లల్లోనే కుదించాలని నిర్ణయించాడు.
దాని ఫలితమే ఋగ్వేదం రచనా కాలం క్రీపూ 1250 కి
కుదించబడింది. పైగా ఋగ్వేదం ఒక కల్పిత కథ అనీ, ఋగ్వేద
ఋషులు అసలు భారతదేశంలో లేని "" సరస్వతీ నది "" గురించి
చెప్పడం బట్టి ఇది ఋజువవుతుంది అని ప్రచారం చేసాడు.
ఈ రోజు వరకు అందరు విద్యార్థులు, IAS, IPS ఇంకా అన్ని
కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు చదివేవాళ్ళు ఇలా వ్రాసే
మార్కులు తెచ్చుకుంటున్నారు.
ఇంతవరకూ బాగానే ఉంది. కాని కొన్ని సంవత్సరాల క్రిందట నాసా
ఉపగ్రహం తీసిన ఛాయాచిత్రాలలో భారతదేశానికి సంబంధించిన ఒక
చిత్రం కలకలం లేపింది. ఆ చిత్రం పంజాబ్, హర్యానా , రాజస్థాన్
ల గుండా భూమికి లోపల అంతర్వాహినిగా ఒక నది ప్రవహిస్తున్నట్
లు చూపింది. దానిపైన పరిశోధనలు జరిగాయి. అక్కడ ఒక నది
ప్రవహిస్తున్నదని నిరూపించారు. ఆ నది ఏదో కాదు, ఋగ్వేదంలో
2000 సార్లు " అంబితమే నదీతమే" అని కీర్తించబడ్డ
""""సరస్వతీ నది""""" అని ఋజువయ్యింది. ఇక ఆ నది
ఎప్పుడు భూమిలో అంతర్వాహినిగా మారిందని చేసిన కార్బన్ డేటింగ్
టెస్టులు తెల్లవాడు వ్రాసిన చరిత్రను ఒక్కసారి ఎగురగొట్టాయి.
పరిశోధనల ప్రకారం సుమారుగా క్రీపూ.4000 క్రితం ఆ నది
భూగర్భంలోకి వెళ్లింది. అంటే ఋగ్వేదం అంతకన్నా
ముందటిదే.ఎందుకంటే తాము కళ్ళతో చూడని నది గురించి
దాని ప్రవాహ విస్తృతి గురించి ఋగ్వేద ఋషులు ఎలా
చెప్పగలరు?కాబట్టి నిస్సందేహంగా ఋగ్వేదం క్రీపూ 4000 కన్న
ముందటిదే. బాలగంగాధర తిలక్ గారి అభిప్రాయాన్ని బట్టి క్రీపూ.
10,000 నాటిది.చాలా సంతోషంగా ఉంది కదా!
ఇంతవరకూ బాగానే వుంది. ఇది తెలిసి దాదాపుగా 10
సంవత్సరాలు అవుతున్నా మన పిల్లలు ఇంకా
తెల్లోడు వ్రాసిచ్చిన అదే చరిత్రనే బట్టీలు పట్టి
మార్కులు తెచ్చుకుంటున్నారు. ఎందుకో
నాకర్థం కావటం లేదు. శాటిలైట్ తీసిన సరస్వతీ నది ఫోటో, ఇంకా
రెండు కూడా జతచేస్తున్నాను. మీరే చూడండి.(ఏది చరిత్ర
అన్న పుస్తకం నుంచీ సంగ్రహించబడింది.)##

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML