గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 10 December 2014

భారతదేశ సంస్కృతి, భారతదేశ సంప్రదాయం ప్రత్యేకించి ఆర్ష వాజ్ఞ్మయాన్ని పరిశీలనం చేస్తే ????

భారతదేశ సంస్కృతి, భారతదేశ సంప్రదాయం ప్రత్యేకించి ఆర్ష వాజ్ఞ్మయాన్ని పరిశీలనం చేస్తే మీకు స్పష్టంగా ధర్మమూ అనే మాటకి ఎటువైపునుంచీ అన్వయం అవుతోందో అర్థమౌతుంది. మహాపతివ్రతయైనటువంటి ఒక తల్లిని బాధపెట్టినట్లయితే పది తలలు ఉన్నా నిలబడవు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా ఋజువు చేసి మనకి నిరూపణం చేస్తుంది. అలాగే మహాభారతంలో రాజసూయ యాగం చేసి అవబృధస్నానం చేసినటువంటి ద్రౌపదీ దేవియొక్క జుట్టు పట్టుకున్నందుకు గాను దుర్యోధనాదులందరూ ఎలా మడిసిపోయారో అర్థమౌతుంది. దేవీ భాగవతాన్ని పరిశీలనం చేస్తే స్త్రీ అంటే అది ఒక భోగవస్తువు. అది అనుభవించడానికే తప్ప వేరొక ప్రయోజనం ఉండదు అని చాలా చులకన భావం చేసినటువంటి మహిషాసురాదులు స్త్రీని చులకన చేసినటువంటి కారణం చేత తిరిగి ఏ స్త్రీ స్వరూపంగా వచ్చినటువంటి పరబ్రహ్మం చేతిలోనే మడిసిపోయారో మనం గమనిస్తే అసలు స్త్రీకి ఇవ్వబడినటువంటి ప్రాధాన్యత, గొప్పతనం స్పష్టంగా అర్థం అవుతాయి. ప్రాతఃకాలంలో చేసేటటువంటి ఆరాధన మాత్రం గాయత్రికి సంబంధించినదై ఉంటుంది. ఆ గాయత్రీ మహా మంత్రాన్ని సాధన చేసి గాయత్రిని ఆరాధన చేయడం అనేటటువంటిది ఎంతో కాలంగా వస్తున్నటువంటి సంప్రదాయం. అలాగే బాగా తెలిసున్నవాడైతే గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తాడు. ఒక స్త్రీ పురుషుడికి స్నేహపూర్వకమైనటువంటి ఉపశాంతిని ఇవ్వగలిగినటువంటి స్థానం. అలాగే ఒక స్త్రీ బిడ్డలను కన్న తల్లి. వంశాన్ని నిలబెట్టేటటువంటి పరమ త్యాగమూర్తి. ఆమెకన్నా మధుర భావన పురుషునికి వేరొకటి ఉండదు. అంత గొప్పగా పదిమందియొక్క శాంతికి కారణమైన స్వరూపంగా స్త్రీ కొలువబడింది. అసలు ఒక పరమ సత్యం చెప్పాలి అంటే స్త్రీ లేని నాడు పురుషునికి ఇహమూ లేదు, పరమూ లేదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఎంత బయటపడి ఉద్యోగం చేసినవాడు కానివ్వండి లేదా ఏదైనా ఒక క్రియా కలాపాన్ని నిర్వహించిన వాడు కానివ్వండి ఇంటికి వెళ్ళేటప్పటికీ కేవలం ఇటుకలతో, ఇసుకతో కట్టినటువంటి ఇల్లు ఇల్లు కాదు. ఏది ఇల్లు అంటే “గృహిణీ గృహముచ్యతే” – ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలే ఇల్లుగా పిలువబడుతుంది. ఇంటిని ఎప్పుడు పరిపూర్ణంగా భావన చేస్తారు అంటే ఆ ఇంట్లో ఇల్లాలు ఉంది యజమాని వెళ్ళినప్పుడు పరమ ప్రేమతో పిలిచి ఒక్క పాత్రతో కాస్త పళ్ళరసం ఇచ్చిందనుకోండి. ఆ సంతోషం వేరు. ఎంత వృద్ధురాలు కానివ్వండి, ఎంత అనారోగ్యంతో ఉన్నటువంటిది కానివ్వండి, ఇల్లాలు ఇంట్లో ఉంటే పురుషుడికి కలిగేటటువంటి మానసికమైన ప్రశాంతత వేరు. ఆమె లేనప్పుడు ఏది ఎంత పెద్ద భవంతి కానివ్వండి పురుషుడికి సంతోషం ఉండదు. అందుకే పురుషుడి జీవితం ఎవరిమీద ఆధారపడింది అంటే స్త్రీమీదనే ఆధారపడింది. వేదంలో ఒక గంభీరమైన విషయాన్ని ప్రస్తావన చేస్తారు. ఐశ్వర్యమంతా ఎవరిది? అంటే పురుషునిది కాదు. అందుకే ఇల్లాలు అంటారు. అంటే ఐశ్వర్యమంతా ఎవరికి చెందుతుంది అంటే స్త్రీకి చెందుతుంది. నాకు ఇవాళ సభామర్యాద ఉంది. ఒక సభలో అగ్రస్థానంలో కూర్చొని మాట్లాడగలిగినటువంటి వైభవాన్ని నేను పొందాను అంటే అది నా భార్యయందు అటువంటి గౌరవం నాయందు నిలబడేటట్లు ఉంచగలిగినటువంటి లక్షణము ఆమెయందు కూడా ప్రకాశిస్తే తప్ప. అది భార్యవైపు నుంచి కూడా సమర్థింపబడితే తప్ప పురుషుడు అలా నిలబడలేడు అని. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం చేస్తూ వ్యాసుల వారు “పులోమజార్చితా” అంటారు. పులోమజ అనబడే శచీదేవి – పులోమునియొక్క కుమార్తె కాబట్టి పులోమజ – ఆమెచేత నిరంతరమూ లలితా పరాభట్టారిక అర్చించబడుతుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML