గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 10 December 2014

దేవతా స్వరూపాలలో రెండు స్వరూపాలకే సింధూరంతో అర్చన. మొట్టమొదటి వాడు గణపతి. రెండవ వారు హనుమ. సింధూరమును ఎవరు ధరించాలి?

దేవతా స్వరూపాలలో రెండు స్వరూపాలకే సింధూరంతో అర్చన. మొట్టమొదటి వాడు గణపతి. రెండవ వారు హనుమ. సింధూరమును ఎవరు ధరించాలి? అని అడిగారు. ఒక్క స్త్రీ మాత్రమే ధరిస్తుంది. అది కూడా సువాసినులైనటువంటి స్త్రీలు. వివాహమై భర్తకలిగిన స్త్రీలు ఎవరున్నారో వాళ్ళు తప్పకుండా ప్రక్క పాపిడులు అవీ తీయమని శాస్త్రంలో చెప్పలేదు మధ్య పాపిట తీసి – అదేంటండీ అలా కూడా చెప్పారా? అని అనుమాన పడతారేమో! దీర్ఘమైన మధ్య పాపిడి తీసి పాపిటయొక్క మధ్య ప్రారంభమునందు సింధూరంతో అలంకారం చేసి తీరాలి. అలా చేస్తే ఏమౌతుంది? భర్తకి ఆయుర్దాయం పెరుగుతుంది. భర్తకి ఆయుర్దాయం పెరిగితే తనకి అయిదోతనం నిలబడుతుంది. సింధూరం అలంకారం చేయబడని పాపిట కలిగినటువంటి స్త్రీయొక్క పిల్లని వివాహం చేసుకోవడానికి పెద్దలు వెళ్ళారు అనుకోండి ఆవిడకి సంప్రదాయం తెలియదన్నమాట. కనుక ముందు ఆవిడకి నేర్పాలి. అయ్యా మీ ఆవిడగారిని సింధూరం పెట్టుకోమనండి అని చెప్పి నేర్పి ఆ తర్వాత వాళ్ళ అమ్మాయిని ఇంటికి తెచ్చుకోవాలి కోడలిగా. సూత్రమున్నన్నాళ్ళు ఆయన ఉన్నాడని గుర్తు. ఈ సూత్రం ఉంటుందని నమ్మకం ఏమి? స్నానం చేయగానే ముందు సింధూరం తీసుకొని పాపిటలో పెట్టుకుంటారు. సువాసిని స్త్రీ పాపిట యందు సింధూరం అలంకారం. హనుమ వంటికి తైలం రాసుకొని దానిమీద సింధూరం రాసుకుంటారు.
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML