ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Friday, 19 December 2014

దానప్రశస్తిదానప్రశస్తి

మానవ జన్మను చరితార్థం చేసుకొనుటకు శాస్త్రకారులు, పెద్దలు చూపిన మార్గాల్లో ముఖ్యమైనది దానమార్గమే. కృతయుగంలో తపస్సు వల్ల, త్రేతాయుగంలో జ్ఞానం వల్ల, ద్వాపర యుగంలో యజ్ఞం వల్ల ఎంతటి ప్రశస్తి పొందారో అట్టి మహనీయ స్థితిని కలియుగంలో దానం వల్లనే పొందవచ్చని..

తపః కృతే ప్రశంసంతి త్రేతాయాం జ్ఞానమేవ చ


ద్వాపరే యజ్ఞమేవాహుః దానమేకం కలౌయుగే ॥

అనే శ్లోకరాజం మనకు ఉపదేశిస్తున్నది. నీరు పోయడం వల్ల చెట్లు పెరిగినట్లు దానం చేయడం వల్లనే సంపదలు పెరుగుతాయని దానేన వర్ధతే లక్ష్మీః జలేన తరవో యథా అనే సూక్తి తెలుపుతున్నది.

సద్భావంతో మనం దానంగా సమర్పించిన సంపదకు ఎన్నో రెట్లు అధికంగా భగవదనుగ్రహంతో సంపదను పొందే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల దానం చేసేప్పుడు శ్రద్ధగా దానం చేయాలని, అశ్రద్ధతో దానం చేయవద్దని, తన ఐశ్వర్యానికి తగినట్లుగా దానం చేయాలని, అధిక సంపదను నేననుభవిస్తూ ఇతరులకు కొద్దిగానే దానం చేస్తున్నాను కదా అని సిగ్గుపడుతూ దానం చేయాలి. భయపడుతూ దానం చేయాలి. దాన ప్రాశస్త్యాన్ని, గ్రహీత యొక్క యోగ్యతను, తన స్థితిని ఎరిగి దానం చేయాలని తైత్తిరీయోపనిషత్తులోని శిక్షావల్లిలోని పదకొండవ అనువాకంలోని శ్రద్ధయాదేయమ్, అశ్రద్ధయా-దేయమ్, శ్రియాదేయమ్, హ్రియాదేయమ్, భియాదేయమ్, సంవిదాదేయమ్ అనే వాక్యాలు ఉద్బోధిస్తున్నాయి.

ఆభరణాలు ధరించడంవల్ల చేతికి గొప్పతనం సమకూరదని, దానం చేయడంవల్లనే చేతికి విఖ్యాతి లభిస్తుందని భర్తృహరి మహాకవి దానేన పాణిర్నతు కంకణేన అనే శ్లోకపాదంతో పేర్కొన్నారు.దానం చేసేప్పుడు ముందుగ సరైన ప్రదేశాన్ని, సరైన సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. అంతకంటే మనం చేసే దానానికి తగిన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి. ఇట్లా ఎంపిక చేసుకొని చేసే దానమే సాత్త్వికదానమౌతుందని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ...

దాతవ్యమితి యద్దానం దీయతే-నుపకారిణే

దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ॥

అనే శ్లోకంతో పేర్కొన్నాడు.అట్లే ఆపదలో ఉన్నవారికి, నిరుపేదల కొరకు జరిపే ధన-వస్తు-వన్త్ర-విద్య- అన్న దానాల్లో యథాశక్తిగా పాల్గొందాం. మానవ జన్మను చరితార్థం చేసుకుందాం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML