గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 11 December 2014

సన్మార్గముసన్మార్గము

ఎవరు జీవించియుంటూ, ఎక్కువమంది జీవించటానికి వీలుగా సహాయ సహకారాలను అందిస్తూ జీవనాన్ని కొనసాగించగలరో వారు మాత్రమే జీవించియున్నట్లు, అట్టివారి జీవనమే సఫలమైనట్లుగా యస్మిన్ జీవతి జీవంతి బహవః స తు జీవతి అను సూక్తి ద్వారా మన పూర్వు లు పేర్కొన్నారు.

కారణజన్ములైన ఈ సత్పురుషలు ఋణాని త్రీణ్యపాకత్య మనో మోక్షే నివేశయేత్ అనే మనువుయొక్క సదుపదేశాన్ని శిరసా వహిస్తూ దేవ పిత ఋషి ఋణాలను తీర్చుకుని ధన్యులౌతారు.


లోకోజ్జీవనమునకై కషిచేసే సాధుపుంగవులకు ఎటువంటి దుర్గతి లభించదని భగవద్గీతలో శ్రీకష్ణపరమాత్మ నహి కళ్యాణకత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి అను వాక్యము ద్వారా ప్రకటించెను.

ఎవడైతే తన మనసును మంచిమార్గమునందు ప్రవేశింపజేస్తాడో అట్టివానికే జీవితములో సర్వార్థములు ఫలిస్తాయనే విషయం మహాభారతంలోని విదురనీతి ఘట్టంలోని ...

యథా యథా హి పురుషః కళ్యాణే కురుతే మనః

తథా తథాస్య సర్వార్థాః సిధ్యన్తే నాత్ర సంశయః ॥

అను శ్లోకము ద్వారా వెల్లడగుచున్నది.

న్యాయమార్గంలో ప్రవేశించి జీవనయానాన్ని కొనసాగించే వారికి జంతువులు కూడా సహాయం చేస్తాయని, అపమార్గంలో పయనించేవాడిని సోదరుడు కూడా వదిలిపెడుతాడని

యాంతి న్యాయ ప్రవత్తస్య తిర్యంచో-పి సహాయతామ్

అపంథానం తు గచ్ఛన్తం సోదరో-పి విముంచతి ॥

అను మహాకవి సూక్తి ద్వారా వెల్లడగుచున్నది.

సన్మార్గంలో శ్రీరాముని జీవనయానం కొనసాగినందుననే వానరములు కూడా సహకరించినాయి. దుర్మార్గుడైన రావణుని, అతని సోదరుడైన విభీషణుడే వదిలి పెట్టినాడు అనే విషయం పై శ్లోకం ద్వారా ద్యోతకమగుచున్నది.

సన్మార్గులై సత్సంగులై జీవించేవారికి సమస్త శుభాలు లభిస్తాయి. స్వస్వరూప పరమాత్మ స్వరూపజ్ఞానం ఏర్పడుతుంది

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML