గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 December 2014

సైన్స్ యుగంలోనూ గీతాసారానికి తగ్గని ప్రాధాన్యం ఐన్స్టీన్ నుంచి మార్టిన్ లూథర్ కింగ్ వరకూ ఎందరో ప్రపంచ ప్రముఖుల్ని ప్రభావితం చేసిన భగవద్గీతభగవద్గీతే నాకు మార్గదర్శకం

సైన్స్ యుగంలోనూ గీతాసారానికి తగ్గని ప్రాధాన్యం ఐన్స్టీన్ నుంచి మార్టిన్ లూథర్ కింగ్ వరకూ ఎందరో ప్రపంచ ప్రముఖుల్ని ప్రభావితం చేసిన భగవద్గీత

ఆల్బర్ట్ ఐన్ స్టైన్ భగవద్గీత గురించి ఇలా చెప్పారు. కొన్ని వేల సంవత్సరాల పూర్వం భగవద్గీత లక్షలాది పాఠకులుకు స్పూర్తినిచ్చింది. దీనిబట్టి గీత చాలా గొప్పది అని చెప్పకనే చెప్తోంది. ఇది మెచ్చుకోదగ్గ గ్రంధం అన్నారు. ఇలా అన్నారు గీత గురంచి.


భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త 1948-49 లో డా. బి.ఎన్ గుప్తా విదేశాలలో చదివారు . అతను విద్యార్థి గా ఉన్న రోజులలో . ఐన్ స్టీన్ ని కలవడానికి వెళ్ళారు. ఐన్ స్టీన్ కి భారతదేశం అన్నా, భారతీయ సంస్కృతి, సాహిత్యం అన్నా ఎంతో ఇష్టం, గౌరవం. మనదేశం నుండి వెళ్ళిన శాస్త్రవేత్తని చూడగానే ఐన్ స్టీన్ సంస్కృతంలో పలకరించారు. ఐన్ స్టీన్ మాట్లాడిన భాష మన శాస్త్రవేత్తకు ఏమీ అర్ధం కాక బిక్కమొహం వేసారు.

అప్పుడు ఐన్ స్టీన్ నేను సంస్కృత బాషలో చెప్తున్నాను "లోపలకు రండి" అని అన్నారు. "మీకు సంస్కృతం రాదా, పోనిలే లోపలి రండి!" అని మన శాస్త్రవేత్తను లోపలకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టేరు.

"హిందూతత్త్వచింతనకు మూలమైన భారతదేశం నుండి మీరు వచ్చేరు. మీ దేశంలోని అద్భుతమైన సాహిత్యమంతా సంస్కృతంలో వుంది. అటువంటిది మీకు ఆ భాష తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నా గ్రంధాలయంలో భగవద్గీత మొదలుకొని భారతదేశానికి చెందిన ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి" అన్నారు ఐన్ స్టీన్.

ఆ గదిలో ఐన్ స్టీన్ వ్యక్తిగత గ్రంధాలయం ఉంది. విశేషం ఏమిటంటే అక్కడ సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు కొన్నే ఉన్నాయి. ఎక్కడ చూసినా భగవద్గీత పుస్తకాలే ఉన్నాయి - వివిధ వ్యాఖ్యానాలతో .

మన భారత శాస్త్రవేత్త తెల్లమొహం పెట్టుకొని వాటినే చూస్తూ ఉండిపోయాడు.

అప్పుడు ఐన్ స్టీన్ మన శాస్త్రవేత్తకు భగవద్గీతను చూపించి, "ఇది తెలుసా మీకు?" అని అడిగారు. దానికి మన శాస్త్రవేత్త "విన్నానండీ" అని సమాదానమిచాడు .

"ఓహ్, విన్నారా .." అంటూ ఐన్ స్టీన్ ఇలా చెప్పారు: “ఈ రోజు ఐన్ స్టీన్ ని ఐన్ స్టీన్ గా నిలబెట్టింది ఈ భగవద్గీతయే గాని ఆ సైన్స్ కాదు. నాలో ఈ విజ్ఞానశాస్త్రం పట్ల నాలో పరిశోధన దృష్టిని, ఈ విశ్లేషణ శక్తిని, విషయ విచారణ చేయగలిగే అంతరిక దృష్టి కోణాన్ని కలిగించినది ఈ భగవద్గీత ఒక్కటే (I have made the Gita as the main source of my inspiration and guidance for the purpose of scientific investigations and formulation of my theories). అందుకే నేను సైన్సుకి చాల గొప్ప విలువనిస్తాను కానీ ఆ సైన్సుకే ఆధారం ఈ భగవద్గీత అని తెలియని ఆ వ్యక్తికి విలువ ఇవ్వను".

ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ఏమన్నారంటే,మనం భారతీయులకు ఎంతో రుణపడిఉన్నాం.భారతీయులే ప్రపంచానికి గణితంలో సులభంగా లెక్కించే దశాంశపద్ధతిని కనుగొన్నారు.అదే లేకపోతే ఎన్నో వైజ్ఞానిక పరిశోధనలు సాధింపబడేవి కాదు.అన్నారట.

భగవద్గీతను మార్గదర్శకంగా తీసుకున్న విదేశీయులెంతమందో అదేంవిచిత్రమోగానీ గీత ప్రభవించిన మనదేశంలో మాత్రం అది ఒక మతగ్రంథమే. దాని గొప్ప దనాన్ని గుర్తు పట్టడము లేదు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML