గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 11 December 2014

ఆతిథ్యంఆతిథ్యం

ఇంటికి వచ్చిన బ్రహ్మచారులకు, సన్యాసులకు యథోచితముగా స్వాగత సత్కారాది రూపమైన అతిథి పూజలను చేయడం వల్లనే గృహస్థుడు ధన్యుడగుచున్నాడు. తల్లిదండ్రులను, గురువును దైవ స్వరూపులుగా భావించినట్లే, అతిథిని కూడా దైవస్వరూపుడిగా భావించాలని అతిథి దేవో భవ అనే శ్రుతివాక్యము ఉద్బోధిస్తున్నది.

ఇంటికి వచ్చిన అతిథి ధీమంతుడు కాకపోయినా, సామాన్యుడే అయినా అతడు పూజార్హుడే. అతనికి తగిన విధంగా అతిథి మర్యా దలను చేయవలసిందే అని సుందరకాండలోని అతిథిః కిల పూజార్హః (1వ సర్గ. 113 శ్లో) అను సూక్తి ద్వారా తెలుస్తున్నది. ఇంటికి వచ్చిన వ్యక్తి మిత్రుడు కాకపోయినా, అతడు శత్రువైనా అతనికి సముచితమైన పద్ధతిలో ఆతిథ్యాన్ని ఇవ్వవలసినదే అనే విషయం అరావప్యుచితం కార్యం ఆతిథ్యం గృహమాగతే అనే సూక్తి తెలుపుచున్నది. దీని వల్ల భారతీయ సంస్కృతిలో అతిథి మర్యాదకు ఎంతటి ప్రాముఖ్యమున్నదో తెలుస్తున్నది.


అతిథిగా వచ్చిన వ్యక్తి ఏ ఇంట్లో తగిన మర్యాదలను పొందడో ఆ ఇంటివారికి దుష్కృతాన్ని ఇచ్చి వారి సుకృతాన్ని తాను వెంట తీసుకువెళతాడని క్రింది శ్లోకం ఉద్భోధిస్తున్నది.

అతిథిర్యస్య భగ్నాశో గృహాత్ప్రతి నివర్తతే

సతస్మై దుష్కృతం దత్వా పుణ్యమాదాయ గచ్ఛతి ॥

గృహస్థులు తమ ఇంటికి వచ్చినవారికి అన్న పానీయములను సమృద్ధిగా సమర్పించవలెను. అన్నదానంతో సమానమైన దానం మరొకటి లేనందున శుభాశుభ కార్యములన్నింటిలో అతిథులకు, అభ్యాగతులకు, బంధు మిత్రులకు సమృద్ధిగా అన్నదానం చేయవలెనని..

అన్నేన సదృశం దానం న భూతం న భవిష్యతి

తస్మాదన్నం విశేషేణ దాతుమిచ్ఛన్తి మానవాః ॥

అనే సూక్తి ఉపదేశిస్తున్నది.

భారతీయుల జీవనవిధానంలో పరమోత్కృష్టమైన సదాచారముగా నిర్ణయింపబడిన అతిథి పూజను నిర్లక్ష్యం చేయకుండా తమ తమ శక్తి ననుసరించి ఇంటికి వచ్చినవారి యోగ్యతననుసరించి యథోచితంగా ఆతిథ్యాన్ని ఇచ్చే మన సంప్రదాయాన్ని నేటితరానికి చెందిన ఆధునికులు కూడా కొన సాగించవలసిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన తరుణమిది

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML