గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 December 2014

ఆధ్యాత్మిక ‘గీత’

ఆధ్యాత్మిక ‘గీత’
హిందువుల పరమపవిత్ర గ్రంథం భగవద్గీత. యుగాల క్రితం కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన జ్ఞానం ఇది. పురాణాలలో ఇది పవిత్ర భూమిగానూ ధర్మక్షేత్రంగానూ పిలువబడుతూ వచ్చింది. నేటి హర్యానా రాష్ట్రంలో గల కురుక్షేత్ర ఒక జిల్లా. వేద, వేదాంత, యోగ విశేషాలున్న భగవద్గీత పుట్టిన రోజున పురస్కరించుకొని వారం రోజులు పాటు కురుక్షేత్రలో ప్రతి ఏటా ఉత్సవాలు జరుపుతుంటారు. ఆ విధంగా ఈ ఏడాది డిసెంబర్ 2 నుంచి గీతా జయంతి వేడుకలు కురుక్షేత్రలో జరగనున్నాయి.
ఈ క్షేత్రంలో జరిగే భగవద్గీత ఉత్సవాలలో పాల్గొనడానికి ప్రపం చం నలుమూలల నుంచి హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక వేత్తలు ఇక్కడకు చేరుకుంటారు. వీరి ప్రవచనాలు వినడానికి ఎక్కడెక్కడి వాళ్లో ఇక్కడకు వస్తారు. ఇక్కడ పవిత్ర సరస్సులుగా పేర్కొనే సన్నిహిత్ సరోవర్, బ్రహ్మసరోవర్‌లలో స్నానమాచరిస్తారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలతో ఇక్కడ వాతావరణమంతా ఆధ్యాత్మికతతో నిండిపోతుంది. ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా.. శ్లోక పఠనాలు, నృత్యాలు, భగవద్గీత కథలు, భజనలు, నాటక ప్రదర్శనలు, పుస్తకశాలలు.. ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ కురుక్షేత్ర అభివృద్ధి సంస్థ, హర్యానా రాష్ట్రప్రభుత్వం, జిల్లా అధికార విభాగం, హర్యానా ప్రజా సంబంధాల శాఖ.. నిర్వహిస్తున్నాయి.
కురుక్షేత్రంలో చూడదగినవి: కృష్ణా మ్యూజియం, విష్ణు మందిరం, జలకుండం, బ్రహ్మ సరోవరం, గీతా భవన్...
రవాణా: కురుక్షేత్ర 7వ నెంబర్ జాతీయరహదారితో అనుసంధానమై ఉంటుంది. దీంతో కురుక్షేత్రకు రోడ్డు, రైలు మార్గాలు బాగున్నాయి. ఢిల్లీ వెళ్లే రైళ్లన్నీ కురుక్షేత్ర మీదుగా వెళతాయి. చంఢీగడ్, ఢిల్లీలను కలుపుతూ కురుక్షే త్ర మీదుగా బస్సులు ప్రయాణిస్తుంటాయి.
సమీప విమానమార్గం: చండీగఢ్ (82 కి.మీ)


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML