గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 8 December 2014

ధర్మం కాపాడుతుంది - అధర్మం కాటేస్తుంది! 'ధర్మో రక్షితి రక్షత:'

ధర్మం కాపాడుతుంది - అధర్మం కాటేస్తుంది!
'ధర్మో రక్షితి రక్షత:'
అనే ఆర్యోక్తిని మనం తరచు వింటూంటాం.ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనలను రక్షిస్తుందన్నది దాని అర్థం. ధర్మాన్ని పాటించేవారికి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమ విజయం వారిదే. ధర్మం అందరి పట్లా ధర్మంగానే ఉంటుంది. ఎవరి ధర్మం వారు ఆచరిస్తే సమాజంలో కలతలు, కలహాలు ఉండవు. అలాగే, ఇతరుల ధర్మాన్ని గేలి చేయడం, అవహేళన చేయడం వల్లనే సమాజంలో అశాంతి నెలకొంటోంది. మనుస్మృతిలో ధర్మానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ధర్మం మనిషిని కాపాడినట్టే, అధర్మం మనిషిని ముంచేస్తుంది. మనిషిని ఉత్కృష్ట స్థానంలో నిలబెట్టేది ధర్మమే. ఇతరుల గురించి ఆలోచించకుండా మన ధర్మాన్ని మనం ఆచరిస్తే ఎవరెన్ని పన్నాగాలు పన్నినా మనమీద ఈగ వాలదు. ధర్మాన్ని ఆచరించని వారి జీవితాన్ని పరిమళం లేని పువ్వుతో పోల్చారు పెద్దలు. మనిషికి ఎంతటి భోగభాగ్యాలున్నా, ఎంతమంది బంధు మిత్రులు ఉన్నా, ఎన్ని పదవులు ఉన్నా అవేమీ మనిషి వెంట రావు. అతడు ఆచరించిన ధర్మాన్ని బట్టే అతడికి మోక్షం ప్రాప్తిస్తుంది. ధర్మాచరణ వల్ల మోక్ష ప్రతిబంధకాలన్నీ తొలగి పోతాయి. పరలోక సుఖం పొందడం ధర్మాచరణ వల్లనే సాధ్యం. సమస్త జగత్తునీ నిలబెడుతున్నదీ, నడిపిస్తున్నదీ ధర్మమే. అయితే, అధర్మానికి పాల్పడిన వారు ఉచ్ఛస్థితికి చేరుకోవడం లేదా, ఉన్నత స్థానాలను పొందడం లేదా అని ప్రశ్నించేవారుంటారు. అలాంటివన్నీ తాత్కాలికం. అంతటి ఉచ్ఛస్థితిని పొందిన వారు కూడా సమాజంలో అధోగతి పాలైన వారెంతో మందిని మనం చూస్తూ ఉంటాం. అధర్మం ద్వారా ఆర్జించే సంపద, కీర్తి ప్రతిష్ఠలు శాశ్వతం కావు. మనుషుల్లోనే కాదు, సర్వ ప్రాణుల్లో శ్రేష్ఠత్వమనేది ధర్మాన్ని బట్టే నిర్ణయించబడుతుంది.
'ధర్మం చర, సత్యం వద' అనే ఆర్యోక్తిని ఆధునికులు పూర్తిగా మార్చేసి ధర్మాన్ని చెరలోకి నెట్టి సత్యాన్ని వధిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభాలూ, సమస్యలకు అదే మూల కారణం. ధర్మాన్ని అవహేళన చేసినా, న్యూనత పరిచినా ధర్మానికి కలిగే నష్టమేమీ లేదు. ఉదాహరణకు సనాతన ధర్మాలను తేలిక చేసి మాట్లాడేవారు ఏదో ఒక ఆపదను ఎదుర్కోక తప్పదు. ఇది శాపమూ కాదూ, శాపనార్ధమూ కాదు. ధర్మం యొక్క గొప్పదనం. స్వధర్మాచరణతో మనిషి ఉత్తమునిగా కీర్తింపబడతాడు. ధర్మ వ్యాధుని కథను చదువుకున్నాం. మాంసం విక్రయ వ్యాపారం చేసిన ధర్మవ్యాధుడు తల్లితండ్రుల పట్ల తన ధర్మాన్ని నెరవేర్చడం వల్లనే పురాణ ప్రసిద్ధి పొందాడు. అలాగే, అణగారిన వర్గాల్లో పుట్టిన భక్త కనకదాస వంటి వారు స్వధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుని అర్చించడం ద్వారా పరమ భాగవతోత్తములుగా కీర్తి పొందారు. మనిషిని కాపాడేదీ, సర్వకాలాల్లో అతడిని వెన్నంటి ఉండేది అతడు ఆచరించిన ధర్మమే.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML