గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 19 December 2014

తిరుమంగైయాళ్వారు

తిరుమంగైయాళ్వారు

శ్రీ మహావిష్ణువు యొక్క శారజ్గ అంశచే కార్తీకశుద్ధ పౌర్ణమి గురువారం నాడు కృత్తికా నక్షత్రమందు చోళ దేశంలో పరిరంభపురము సమీపమున తిరుక్కరయులారులో తిరువాలినాడుడైయార్‌ దంపతులకు జన్మించాడు. ఆ కుమారునకు తల్లిదండ్రులు నీలుడని పేరుపెట్టారు. ఈతడు సకల శాస్త్రములందు, ధనుర్విద్య, శస్త్ర విద్యల యందు, రాజ్యపాలనయందు ప్రవీణుడైనాడు. తండ్రి కొలది కాలమునకు చనిపోవుటచే, చోళరాజు తండ్రిచేయు ఉద్యోగమునకు అర్హులెవ్వరాయని, నీలుని గుణగణాలు, సామర్థ్యమును విని అతనిని పిలవనంపి ఆయుద్యోగమును ఇచ్చినాడు. శత్రువులకు యముడిగా కనిపించేవాడు. దానితో అతనికి పరకాలుడు అని పేరు కూడా వచ్చింది. నీలుడు సమర్థుడుగా ఖ్యాతినందాడు. వయస్సు వచ్చుసరికి విషయసుఖములయందు ఆసక్తికలవాడైనాడు.
తన పురము సమీపమునందు శ్వేతహ్రదము అను ఒక కొలను ఉంది. అది తామరపూవులు, కలువపూలతో అత్యంత అహ్లాదకరంగా సొబగుతో యుంటుంది. దానికి ఆకర్షితులై దివి నుండి అప్సరస సమూహములు వచ్చి స్నానము చేయుచు క్రీడించు చుండెడివి. ఒక రోజు అప్సరసలతో వచ్చిన ఒక దశ వర్షముల బాలిక తన తోటివారితో తిరిగి వెళ్లలేకపోయింది. ఆ బాలిక ఒంటరిగా సంచరించు చుండగా పరిరంభపురము వాస్తవ్యుడు, ఒక వైష్ణవ వైద్యుడు, దైవికముగా ఆమెను చూచి, ఆబాలిక గూర్చి ప్రశ్నింపగా ఆమె, " మీ యింటికి కొని పోయినచో వచ్చెదను, నేను ఒంటరి దానను, నా వాళ్లందరూ వెళ్లిపోయారు" అని చెప్పింది. బిడ్డలు లేని ఆవైద్యుడు, ఆ బాలికను తమ ఇంటికి తీసుకునిపోయి తన భార్యకు అప్పజెప్పాడు. ఆమె బిడ్డలకై పరితపించుచున్నది. అందుకని ఆమె ఈ బాలికను తన కన్న కూతురు కన్నా ఎక్కువ ప్రేమతో చూడ సాగింది. ఆ బాలికకు కుముదవల్లి అని నామకరణము చేశారు. ఆమెకు యుక్త వయస్సు రాగానే - ఆ వైద్యుడు, తగిన వరునకై అన్వేషణ మొదలు పెట్టాడు.
నీలునకు ఈ విషయము తెలిసి, ఆ బాలను చూచి ముగ్ధుడై తన కిచ్చి వివాహము చేయమని తండ్రిని అడిగాడు. ఆ బాలిక తాను పంచ సంస్కార పరుని గాక, మరి యొకనిని పెండ్లాడనని ఖండితంగా చెప్పింది. నీలుడు వెంటనే తిరునరైయూరులోని నంచి సాన్నిధ్యములో పంచ సంస్కారములను పొందాడు. ద్వాదశోర్ధ్వ పుండ్రములను ధరించాడు. కాని ఈ బాలిక ఇంకొక షరతు కూడా విధించింది. అది నీలుడు ఒక సంవత్సరం పాటూ 1008 మంది భాగవతోత్తములకు భోజనమిడి వారి పాద తీర్థము, తళిహప్రసాదము నీలుడు స్వీకరించిననే, తాను నీలుని పెండ్లియాడగలనని చెప్పింది.
నీలుడు ఈ షరతును కూడా అంగీకరించాడు. ఆ నియమమవలంభించాడు. తనకున్న యావత్తు ధనము ఈ సమారాధనకే వ్యయించాడు. ధనముచాలలేదు. అందుకని రాజ ద్రవ్యము వెచ్చించాడు. రాజుగారికి ఈ విషయము తెలిసింది. వెంటనే రాజ ద్రవ్యము రాజుగారి ఖజానాకు చెల్లించాలని ఉత్తరువు పంపాడు. నీలుడు ఆ పని చేయలేకపోయాడు. రాజసేవకులు నయముగా చెప్పి చూచారు. సొమ్ము రాజునకు చెల్లించకపోగా, ఆ వచ్చిన రాజ సేవకులను అవమానించి పంపాడు. రాజు బలిష్టులైన సేవకులను పంపాడు. వారితో నీలుడు పోరు సలిపి వారిని తరిమివైచాడు. రాజుసైన్యముతో నీలుని సమీపించాడు. నీలుడు రాజును, రాజు సైన్యమును ఓడించాడు. రాజు నీలునితో ద్వంద్వ యుద్ధములో గూడా గెలవలేకపోయాడు. రాజు అంతటితో నీతో నాకు విరోధము వద్దు. దైవము మీద ఆన. నీ ధైర్య సాహసాలకు మెచ్చాను. స్నేహితుడా! మా ఆస్థానానికి రమ్ము" అని ఆహ్వానించాడు. రాజు ప్రియవాఖ్యములకు నీలుడు సంతోషించి రాజాస్థానానికి వెళ్లాడు. రాజు అతని నక్కడ బంధించి మన పైకమును ఇచ్చునంత వరకు ఈతనిని విడువవలదు అని ఒక దేవాలయములో నీలుని ఉంచాడు. నీలుడు మూడు రోజులు ఉపవాసము చేశాడు. మూడవ రోజు రాత్రి విష్ణుమూర్తి కలలో కనిపించి, " నీవు రాజునకివ్వవలసిన ద్రవ్యమంతా కంచిలో వరదరాజస్వామి గుడిలో ఇచ్చెదను అక్కడకు రావలసినది" అని చెప్పాడు. అప్పుడు నీలుడు రాజానుమతితో కంచి వరదుని యొద్దకు వెళ్లాడు. వరదరాజస్వామి అనుగ్రహముతో అక్కడ ద్రవ్యమున్న తావు కనిపించింది. రాజునకీయవలసిన దంతా నీలుడు ఇచ్చి వేశాడు. మిగిలిన ధనముతో తన వ్రతాన్ని కొనసాగించాడు. వరదరాజ స్వామి ప్రసన్నుడై నీలునికి ధనమిచ్చాడని విని తాను భగవతాపరాధము చేసితినని నీలుని కాళ్లపై పడి తాను అతడి నుండి పుచ్చుకున్న ద్రవ్యమంతయు నీలునికిచ్చివేశాడు. ఆ ద్రవ్యమంతయు యధావిధి తన నియమ వ్రతమునకే దేవ బ్రాహ్మణ సంతర్పణమునకు వినియోగించాడు. కంచి వరదుడు ఇచ్చిన ద్రవ్యమంతా ఖర్చయినది. ఇంకనూ వ్రతము పూర్తికాలేదు.
అందుకని వ్రతము సొమ్ముకై కొందరిని చేర్చుకుని దారులుకొట్టుట, అర్థరాత్రి వేళ వైష్ణువులు కాని ఇండ్లకు కన్నము వేసి దోచుకొనుట, ఆ ధనముతో బ్రాహ్మణ సమారాధన సాగించుట మొదలుపెట్టాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML