ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Thursday, 11 December 2014

కోపాగ్నికోపాగ్ని

తన కోపమె తన శత్రువు అనే వాక్యం అందరికీ తెలిసినదే. కోపం అనేది శత్రువులా బాధించడమే కాకుండా నిప్పులా నిలువునా కాల్చివేస్తుంది.కోపానికి వశులైనవారు ఎంతటి పాపాలను చేయుటకైనా సిద్ధపడుదురు. గురువుల ను చంపుటకు కూడా వెనుకాడరు. మంచి-చెడు, పెద్ద-చిన్న అనేది చూడకుండా కఠినమైన వాక్కులతో సజ్జనులను కూడా నిందిస్తారు. వివేకాన్ని కోల్పోయి ఎంతటి అకృత్యాలనైనా చేస్తారు. అనకూడని మాటలనంటారు.

క్రుద్ధః పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాద్ గురూనపి


క్రుద్ధః పరుషయా వాచా నరస్సాధూనధిక్షిపేత్ ॥

వాచ్యావాచం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్

న కార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విద్యతే క్వచిత్ ॥

అనే శ్రీమద్రామాయణ సూక్తులు కోపం వల్ల కలిగే అనర్ధాలను తెలియపరుస్తున్నాయి.

కోపానికి మూలం కోరికలు. అవి నెరవేరకపోతే మనుషులు కోపానికి వశమౌతారు. కామమైనా, క్రోధమైనా రజోగుణం నుంచి పుట్టేవే. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః భగవద్గీత తెలియజేస్తూ, ఈ కామ క్రోధాల విషయంలో తగిన జాగరూకత అవసరమని ఉద్బోధించింది.

కోపం వ్యక్తి నాశనానికి కారణమౌతుంది. అంతేకాకుండా జన సముదాయానికి కూడా తీవ్ర అనర్ధాన్ని కల్గిస్తుంది. అందుకే అనర్ధాలను కలిగించే కోపాగ్నిని సత్పురుషులు తెలివి అనే నీటిని కుండలతో కుమ్మరించి చల్లారుస్తారు అనే విషయాన్ని సత్పురుషాః కోపాగ్నిం జ్ఞానాంబుఘటైః ప్రశమయంతి అనే సూక్తి వెల్లడిస్తున్నది.

వివేకవంతులైన మానవులు సాధుసజ్జనుల సాంగత్యముతో ప్రశాంతచిత్తులై తమలోని కోపాగ్నిని చల్లబరచుకునేందుకు కృషి చేస్తారని ఆశిద్దాం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML