గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 December 2014

భక్తులు ఎక్కడ ఉంటే రాముడు అక్కడ ఉంటాడు. ఇది సత్యం.భక్తులు ఎక్కడ ఉంటే రాముడు అక్కడ ఉంటాడు. ఇది సత్యం.

ఈశ్వరుడు ఎక్కడో ఉండడు. గుళ్ళో ఈశ్వరుడు ఉంటాడు అన్నమాట యదార్థమే. కానీ నిజంగా ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? బాగా గుర్తు పెట్టుకోండి. హృదయంలో ప్రతి ఊపిరిలో ఆయన ఆరాదిస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ కూర్చుంటాడో, ఎక్కడ నిలుచుంటాడో, ఎక్కడ తిరుగుతాడో ఆయన వెంటనే తిరుగుతూంటాడు ఈశ్వరుడెప్పుడూ. రాముడు ఎక్కడుంటాడు అని చెప్తారో తెలుసా శాస్త్రంలో. రామచంద్రమూర్తిని నమ్ముకొని బ్రతుకుతున్నవాడు ఎక్కడ ఉంటాడో రాముడు అక్కడే ఉంటాడు. ప్రక్కనే ఉంటాడుట ధనుర్ధరుడై. ఆయన కూర్చుంటే కూర్చుంటాడు, నిలుచుంటే నిల్చుంటాడు, ఆయన వెడుతూంటే వెళతాడు. ఆయన పడుకుంటే గుమ్మం ముందు కూర్చుంటాడట. ఎందుకంటే ఆయనకి ఇబ్బంది ఎవరైనా కల్పిస్తారేమో అని. రామచంద్రమూర్తి తనను నమ్మిన వాళ్ళను రక్షించడానికి గడప ముందుకొచ్చి కూర్చుంటాడు అని. అందుకే రాముణ్ణి నమ్ముకున్న రామభక్తులెక్కడ ఉంటారో అక్కడే సీతారామలక్ష్మణులు, హనుమ కూడా ఉంటారు. ఇది తులసీదాసు గారి జీవితంలో నిజమైంది. ఆయన రామదర్శనం అవ్వాలి అనుకుంటూ పడుకుంటే దొంగ వచ్చి లోపలికి వెళ్ళి దొరికినవి మూట కట్టుకొని బయటకు వద్దాం అనుకున్నాడు. తల బైట పెట్టాడు. రామలక్ష్మణులిద్దరూ కోదండాలు పట్టుకొని నిల్చొని ఉన్నారు. నన్ను నమ్ముకున్న వాడి సొత్తు ఎత్తుకు పోతావా నువ్వు అని. ఆయన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని వెనక్కి వచ్చాడు. తెల్లవారే వరకు తల బైట పెడుతున్నాడు, లోపల పెడుతున్నాడు. రామలక్ష్మణులు ఇద్దరూ అలాగే ఉన్నారు. తెల్లవారింది. తులసీ దాసు గారు నిద్రలేచారు. దొంగ మూటకట్టుకొని కూర్చుని ఉన్నాడు. నువ్వు ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అని అడిగారు. బుద్ధి గడ్డితిని దొంగతనానికి వచ్చాం. అన్నాడు. పట్టుకెళ్ళపోయావా? అన్నారు. తీసుకు వెళదామని బయటికి వెళ్తే ఎవరో ఇద్దరు ఉన్నారు. ఒకాయన నల్లగా మేఘంలా ఉన్నాడు. ఒకాయన ఎర్రగా ఉన్నాడు. కోదండాలు పట్టుకొని నిల్చున్నారు. హడలి లోపలికి వచ్చి కూర్చున్నాం. అన్నారు. ఆయన అప్పుడు బయటికి వెళ్ళి చూశారు. ఆయన ఏడ్చారు అప్పుడు. నిద్రపోకుండా స్వామీ నా పర్ణశాల ముందు కాపలా ఉన్నావా? మీరెంత ధన్యులురా..ఇన్నిమార్లు దర్శనం పొందారు, నాకు అవలేదు అని ఏడ్చారు. ఎవడు రాముణ్ణి నమ్మాడో వాడున్నచోట రాముడు ఉంటాడు తప్ప ఇంకొక చోట రాముడు ఉంటాడు అనుకోకండి. రామభక్తులెక్కడ ఉంటారో అక్కడే సీతారాములుంటారు. ఇది ప్రత్యేకించి రామావతారంలో మెండుగా కనిపిస్తోంది. త్యాగరాజ స్వామి విషయంలో, రామదాసు గారి విషయంలో. గంజి గుంటలో పడిపోయిన పిల్లవాడి శవాన్ని ఉడికిపోయిన దానిని తీసుకెళ్ళి రాముడి దగ్గర పెట్టి నువ్వు ఇచ్చిన కొడుకు, ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేకపోతే నీలో కలిపేసుకో. అంతరాలయంలో పెట్టి తలుపులు వేసి రామనామ భజన చేశాడాయన. పిల్లవాడు పరుగెత్తుకుంటూ వచ్చి తండ్రి ఒళ్ళో పడుకున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి? ఈమధ్యనే కదా రామదాసు గారు. ఆయన వాడిన మంగళసూత్రంలో శతమానం కూడా మనం కల్యాణంలో చూస్తూనే ఉన్నాం కదా! రాముడు ఉన్నాడు. మీరు నమ్మండి. ఇప్పటికీ రాముడు తిరుగుతూనే ఉన్నాడు. మీరు నమ్మి ఉన్నచోట మీవెంట రాముడున్నాడు. మీరు పడుకుంటే మీరు పడుకున్నచోట ఉన్న కుర్చీలో ఆయన ఉంటాడు. ఎక్కడ రాముణ్ణి నమ్మిన వాడున్నాడో అక్కడే సీతారాములు కూడా ఉంటారు. అందుకే శాస్త్రంలో ఒక మాటుంది. రాముణ్ణి తెచ్చుకోవడానికి తేలిక మార్గం రామభక్తుణ్ణి తెచ్చుకోవడం. రామభక్తుడొస్తే సీతారాములొస్తారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML