గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 25 December 2014

భారతరత్న మాలవ్యా

భారతరత్న మాలవ్యా

భారతీయ నవతరానికి స్ఫూర్తిదాయకమైన అలనాటి నాయకులలో చెప్పుకుని తీరవలసిన హైందవ జాతి రత్నం పండిత మదన మోహన మాలవ్యా. ఏకవ్యక్తి సైన్యం అన్నట్లుగా ఆయన తన జీవితాన్ని గడిపారు. కాశీ విశ్వ విద్యాలయ స్థాపన కోసం విరాళాలను అర్థిస్తూ ఆయన దేశమంతటా పర్యటించిన నాటి అనుభవాలను నేటి విద్యార్థులు పాఠాలుగా చెప్పుకోవలసి ఉంది.
మాలవ్యా హైదరాబాద్ నవాబు వద్దకు వచ్చి, హిందూ విశ్వవిద్యాలయ స్థాపనకు విరాళం ఇవ్వవలసిందని చేయి చాచి అర్థించారు. కోపోద్రిక్తుడైన నవాబు, 'ఒక హిందూ విశ్వవిద్యాలయ స్థాపనకు నన్నే విరాళం అడుగుతావా? ఎంత ధైర్యం నీకు?" అని అంటూ, కాలి చెప్పును తీసి ఆయనపై విసిరారు. మాలవ్యా మారు మాటాడకుండా ఆ చెప్పునే కానుకగా రెండు చేతులతో అందుకుని, నేరుగా బజారు వీధికి చేరుకున్నారు. అక్కడ ప్రజలను పిలిచి నవాబు తనకు ఎంతో ప్రేమతో ఇచ్చిన పాదరక్షను వేలం వేస్తున్నాననీ, నవాబు మీద గౌరవం కలిగిన వారెవరైనా తగిన మూల్యం చెల్లించి, దానిని దక్కించుకోవచ్చుననీ ప్రకటించారు. ఈ కబురు క్షణాలలో నవాబు చెవిన పడింది. వేలంలో తన పాదరక్ష తక్కువ ధరకు అమ్ముడుపోతే తనకు అవమానమని భావించిన నవాబు, వెంటనే ఒక సహాయకునికి పెద్దమొత్తం ఇచ్చి, దానితో దానితో ఆ చెప్పును కొని తీసుకు రావలసిందిగా ఆదేశించారు. ఆ విధంగా లభించిన డబ్బును మాలవ్యా తన విశ్వవిద్యాలయ నిర్మాణానికి వినియోగించారు.
"శత్రువు నీపై విసిరిన రాళ్ళతోనే నీ జీవన సౌధాన్ని నిర్మించుకో" అనే సూక్తిని ఆనాడే సృజనాత్మకంగా ఆచరణలో చూపించిన మాలవ్యాను యువతరానికి స్ఫూర్తి దాటగా చెప్పుకోకుండా ఎలా ఉండగలం?
మాలవ్యా ప్రయాణిస్తున్న దారిలో ఒక బ్యాంకు నష్టాల్లో పది, కల్లోలంలో ఉంది. మదుపరులందరూ తమ డబ్బు తమకు ఇచ్చేయవలసిందని బ్యాంకు మీద విరుచుకు పడడంతో నిర్వాహకులు తలబాదుకుంటున్నారు. ఆ సమయంలో మాలవ్యా బ్యాంకు లోపలకు వెళ్ళి, తన విశ్వవిద్యాలయ నిర్మాణానికి విరాళం ఇవ్వవలసినదిగా బ్యాంకు పెద్దలను కోరారు. "పండిట్ జీ! మా బ్యాంకు దివాలా తీసే స్థితిలో ఉందని తెలిసి కూడా మీరు ఇలా అడగడం న్యాయమేనా?" అని వారు ఆయనని ప్రశ్నించారు. మాలవ్యా వారితో, "ఓ అయిదు లక్షల రూపాయలకు చెక్కు ఇవ్వండి చాలు, నగదు అవసరం లేదు" అని అన్నారు. ఆ కాలంలో అయిదు లక్షల రూపాయలంటే ఈ కాలంలో కోటానుకోట్ల కింద లెఖ్ఖ. వారు దిమ్మెరపోయారు. "భయం లేదు. నామీద నమ్మకముంచండి! మీకంతా మంచే జరుగుతుంది. నేను చెప్పినట్లు చేయండి" అన్నారు మాలవ్యా. వారు భయపడుతూనే, ఆయన అడిగినట్లుగా చెక్కు రాసి ఇచ్చారు.
మర్నాడు ఈ వార్త హిందూస్థాన్ టైమ్స్ దినపత్రికలో ప్రముఖంగా అచ్చయింది. దానితో డిపాజిటర్లకు బ్యాంకు మీద విశ్వాసం అనూహ్యంగా పెరిగింది. ఎంత పటిష్టంగా ఉండకపోతే, బ్యాంకు అంత విరాళం ఇవ్వగలుగుతుందనే ఆలోచన వారిని పునరాలోచనలో పడవేసింది. వారంతా తిరిగి బ్యాంకుకు రావడం మొదలుపెట్టారు. ఏడాది లెక్కలు ముగించే నాటికి బ్యాంకు లాభాలతో పరవళ్ళు తొక్కుతోంది. చెక్కు మాలవ్యా వద్దనే భద్రంగా ఉంది. బ్యాంకు యాజమాన్యం స్వయంగా వారి వద్దకు వచ్చి, ధన్యవాదాలను తెలియజేసి, పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చింది.
హిందువులకు అత్యంత పవిత్రమైన గంగానదితో పోల్చదగిన వ్యక్తిత్వం మాలవ్యాది అని గాంధీజీ కొనియాడారు. "కర్మయోగికి నిలువెత్తు రూపం" అని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ కితాబు ఇచ్చారు. "సమస్త హిందూ సమాజానికీ మకుటం లేని మహారాజు" గా లాలా లజపతిరాయ్ మాలవ్యాను అభివర్ణించారు. అకుంఠిత దేశభక్తితో పాటు సనాతన ధర్మ పరిరక్షణ అవసరాన్ని గుర్తించి, హిందూ జాతీయవాదాన్ని ఉద్యమంగా చేపట్టిన భరత మాత ముద్దుబిడ్డ పండిత మదన మోహన మాలవ్యా.
స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్రను పోషిస్తూనే, వార్తా పత్రికా రంగంలో, విద్యా రంగంలో విశేష కృషి చేసిన మాలవ్యా, హిందువులకు ప్రత్యెక విశ్వవిద్యాలయం ఆవశ్యకతను 1900 సంవత్సరంలో గుర్తించారు. వజ్ర సంకల్పబలంతో 1916 ఏప్రిల్ 1వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో ఆ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించగలిగారు. నేడు 1.370 ఎకరాల సువిశాల ప్రాంగణంలో, 14 రంగాలలో, 127 శాఖలతో 16,000 మంది విద్యార్తులాటి, 1,300 మంది అధ్యాపకులతో దేశానికి మకుటాయమానంగా నిలుస్తున్న బెనారస్ హిందూ యూనివర్సిటీ, హిందూ జాతికి మాలవ్యా ఇచ్చిన అపురూపమైన కానుక. దీనికిప్పుడు 13లక్షల పుస్తకాలతో కేంద్ర గ్రంథాలయం ఉంది. 38 చిన్న గ్రంథాలయాలున్నాయి. అనేక ఛాత్రాలయాలు, క్రీడా ప్రాంగణాలు, సభా భవనాలు, పరిశోధన సంస్థలు ఉన్నాయి. విశ్వ విద్యాలయానికి అనుబంధంగా ఉన్న అనేక కళాశాలలు ఉత్తర భారత దేశంలో ప్రముఖ విద్యాసంస్థలుగా విరాజిల్లుతున్నాయి. మరో మూడేళ్ళలో నూరు వసంతాలు పూర్తి చేసుకోబోతున్న ఈ సరస్వతీ నిలయం మాలవ్యా పండితుని దార్శనికతకు నిలువెత్తు నిదర్శనంగా వారణాసి నగరంలో దర్శనమిస్తోంది. అయితే, కాశీ విశ్వవిద్యాలయ స్థాపన అన్నది మాలవ్యా దేశసేవా చరిత్రలో చిన్న పుట మాత్రమె.
'సత్యమేవ జయతే' అనే నినాదాన్ని అవిరళంగా వ్యాప్తిలోకి తెచ్చిన ఘనత మాలవ్యాదే. దళితులను దేవాలయాలకు దూరంగా ఉంచే నాటి వ్యవస్థను గట్టిగా ప్రతిఘటించి, అనేక దేవాలయాలలో వారికి ప్రవేశం కల్పించి, దళితులకు చేరువైన అగ్రశ్రేణి హైందవ రత్నం మాలవ్యా. కాశీలోని పండితులనూ, అనేక హిందూ ప్రముఖులనూ ఆయన సమావేశ పరచారు. కేవలం శ్రమ విభజన ప్రాతిపదికగా ఏర్పడిన వర్ణాశ్రమ వ్యవస్థను వర్ణ వివక్షకు నెలవుగా మార్చరాదని వారికి నచ్చజెప్పారు. గాంధీజీ హరిజనోద్ధరణ ఉద్యమానికి చాలా ముందే కలకత్తా, కాశీ, నాసిక్, ప్రయాగ, ముంబయ్ వంటి అనేక చోట్ల దళితులకు సమాన గౌరవం కోసం పోరాడిన ధర్మయోగి మాలవ్యా.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML