గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 14 December 2014

కన్నా...నువ్వు బతుకుతావు అంటూ బిడ్డను బ్రతికించి చనిపోయిన అమ్మకన్నా...నువ్వు బతుకుతావు అంటూ బిడ్డను బ్రతికించి చనిపోయిన అమ్మ

బిడ్డపై తల్లికి ఉండే మమకారానికి ప్రత్యక్ష నిదర్శనమిది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉద్వేగభరితమైన సంఘటన జపాన్ లో జరిగింది. ఈ ఏడాది మార్చిలో జపాన్ లో తీవ్రమైన భూకంపం సంభవించింది. రక్షక బృందాలు శిథిలాలను తొలగిస్తున్నప్పుడు మట్టిపెళ్లల మధ్య ఒక మహిళ కనిపించింది! ఆమె బ్రతికి ఉండవచ్చుననే ఆశతో వారు కొన్ని గంటల పాటు కష్టపడి జాగ్రత్తగా ఆమె దేహాన్ని వెలికి తీయగలిగిన ఆమె అప్పటికే చనిపోయి ఉంది. ఆమె చేతుల మధ్య గుండెకు ఆన్చుకుని ఒక దుప్పటి ఉంది. దాన్ని పట్టించుకోకుండా ఆ మృతదేహాన్ని అలాగే వదిలేసి మరో ఇంటి శిధిలాలను శోధించడానికి వీరు అక్కడ నుంచి ముందుకు కదిలారు.


అయితే వారి మనసులను ఏదో సందేహం వెనక్కి పట్టిలాగింది. వెంటనే తిరిగి వచ్చి, ఆమె చేతులను విడదీసి దుప్పటిని మెల్లిగా తెరిచి చూశారు. అందులో ...ఓ బిడ్డ! మూడునెలల వయసున్న ముక్కుపచ్చలారని పసిబిడ్డ. ప్రాణం లేని తల్లి దేహం ఆసరగా ప్రాణం నిలుపుకున్న బిడ్డ. నిశ్చింతగా నిద్రపోతోంది. సమాచారం అందుకుని హుటాహుటిన అక్కడికి వచ్చిన వైద్యుడు ఆ పసికందును పరీక్షించి ఎక్కడా గాయాలు లేవని, ప్రాణాపాయం లేదని తేల్చడంతో అక్కడి వారంతా సంతోషంతో నిట్టూర్చారు.

అదే సమయంలో దుప్పటి పొరల్లో కనిపించిన సెల్ ఫోన్ పై వారి దృష్టి పడింది. దాన్నితీసి చూశారు. అందులో ఒక సంక్షిప్త సందేశం! ‘కన్నా...నువ్వు బతుకుతావు. అంతేకాదు బ్రతికినన్నాళ్లూ ఈ అమ్మకి నువ్వంటే ఎంతిష్టమో గుర్తుంచుకుంటావు’... అంటూ బిడ్డకు వీడ్కోలు ఇస్తున్నట్లుగా ఆ తల్లి ఇచ్చిన సందేశం...అక్కడి రాళ్లను కూడా కరిగించేంత హృద్యంగా ఉంది. రెస్క్యూ టీమ్ సభ్యులు కంట తడిపెట్టారు.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML