
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Friday, 19 December 2014
ఆచారాలు-అభీష్టసిద్ధులు
ఆచారాలు-అభీష్టసిద్ధులు
ధార్యం భస్మత్రిపుండ్రంతు గృహిణా జలసంయుతం |
సర్వకాలం భవేత్ స్త్రీణాం యతీనాం జలవర్జితమ్ ||
గృహస్థులు విబూదిని జలముతో తడిపి మూడు రేఖలుగా ధరించాలి. స్త్రీలు, యతులు ఎప్పుడైనా సరే జలం లేకుండా, పొడిగా దాల్చాలి.
ఊర్ధ్వపుండ్రం త్రిపుండ్రం వా మధ్యే శూన్యం ప్రదాపయేత్ |
శ్రుణుషణ్ముఖ తన్మధ్యే ఉమాయాహం శ్రియాహరిః ||
ఊర్ధ్వ పుండ్రాన్ని (నిలువు) గానీ, త్రిపుండ్రం (అడ్డరేఖలు) గానీ ధరించేటప్పుడు రేఖల నడుమ ఖాళీ ఉండాలి. ఆ స్థలంలో - అడ్డబొట్టు అయితే శివపార్వతులు, నిలువుబొట్టయితే లక్ష్మీనారాయణులుంటారని 'ప్రయోగ పారిజాతం'లోని విషయం.
అనామిక శాంతిదోక్తా మధ్యమాయుష్కరే భవేత్ |
అంగుష్ఠః పుష్టిదః ప్రోక్తః తర్జని మోక్షదాయినీ ||
బొట్టు ధరించేటప్పుడు అనామిక (ఉంగరపు వ్రేలి) తో పెట్టుకుంటే శాంతి, నడిమి వ్రేలు ఆయుష్కరం, అంగుష్ఠంతో ధరించడం పుష్టికరం, చూపుడు వ్రేలితో మోక్షదాయకం.
భస్మము మీద పడుకొనినా, భక్షించినా, శరీరమునకు పూసుకొనినా ఆయుష్షు పెరుగుతుంది. సర్ప, వ్రుశ్చికాది విషజంతువులు కుట్టిన కరిచినా విషాన్ని హరిస్తుంది. గర్భిణీ స్త్రీలు ధరిస్తే సుఖప్రసవనం జరుగుతుంది. ఇంక భూత పిశాచాది గ్రహాలను నిశ్శంకగా పారద్రోలుతుం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment