గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 14 December 2014

శ్రీ శృంగార వల్లభస్వామి ఆలయంశ్రీ శృంగార వల్లభస్వామి ఆలయం

శ్రీ వైష్ణవ ఆలయాలలో అతి పురాతనమైనది. దాదాపు 9వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయ ప్రాంగణంలో శివాలయం... వైష్ణవాలయం రెండూ వుండడం విశేషం! భోజ మహారాజులు... భట్టివిక్రమార్కులు.. రాణీ రుద్రమదేవి వంటి మహామహుల పోషణలో అలరించబడిన పురాతన శిలాకట్టడం ఈ ఆలయం. బ్రిటిష్ పరిపాలనలో విక్టోరియా మహారాణి సైతం శ్రీ శృంగార వల్లభ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి వెండి కవచము సమర్పించుకున్నట్లు చరిత్ర చెబుతుంది.
ప్రపంచవ్యాప్తంగా విశిష్ఠత కలిగిన శ్రీ మహావిష్ణువు చిత్తూరు జిల్లా తిరుమలలో కొలువై వుంటే అంతటి విశిష్ఠత కలిగిన శ్రీ శృంగార వల్లభస్వామి అంతకంటే ముందే తూర్పుగోదావరి జిల్లా తిరుపతిలో వెలసినాడని కథనాలు ప్రాచుర్యం పొందాయి. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట రైల్వే జంక్షన్ నుండి కిర్లంపూడి వెళ్ళేదారిలో దివిలి గ్రామం అడ్డురోడ్డు గుండా లోపలికి 5 కి.మీలు ప్రయాణిస్తే తిరుపతి గ్రామాన్ని చేరుకోవచ్చును.
చదలాడ తిరుపతిగా పేరుగాంచిన ఈ ఊరిలో పారే సెలయేరు గ్రామాన్ని చదలాడ, తిరుపతిగా విభజిస్తుంది. బ్రిడ్జి కట్టడముకు ఇటువైపు చదలాడ అటువైపు తిరుపతిగా పేర్కొంటారు. శ్రీ శృంగార వల్లభస్వామి గ్రామ ప్రథమంలోనే కొలువై దర్శనమిస్తాడు. ఈ ఆలయం యిప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందడంతో భక్తుల సంఖ్య పెరుగుతుంది.
ధ్రువుని సవతి తల్లి అతనిని రాజ్యసింహాసనం అధిష్ఠించకుండా తంత్రాలు చేస్తున్న సమయంలో ధ్రువుని తల్లి సునీత ‘నాయనా! నీవు ఈ రాజ్య సింహాసనం అధిష్ఠించి సుపరిపాలన గావించుటకు గాను ముందుగా శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనభాగ్యం పొందవలయునని చెబుతుంది. అంతటి ధ్రువుడు కఠోర తపస్సును అటవీ ప్రాంతమందు ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని పొందుతాడు. శాండిల్య మహాముని ఆశీర్వాదము వలన ధ్రువునికి ఈ మహాభాగ్యము కలిగింది.
శ్రీ మహావిష్ణువు దర్శనంతో ధ్రువుడు తొలుత భయ కంపితుడైనాడు. ఆ దివ్య మంగళ తేజస్సును చూచుటకు సాహసించలేకపోయాడు. అంతటి శ్రీ మహావిష్ణువు ‘ఓరి బాలకా! నీకు భయమెందుకు?’ నిదానముగా నన్ను చూడు ‘నేను నీ అంతే వున్నాను కదా!’ అని నవ్వుతూ పలికేసరికి ధ్రువుడు నెమ్మదిగా కనులు తెరచి ఆయన దర్శనము చేసుకున్నాడు. ఇది యిచ్చట చెప్పబడే స్థల పురాణము.
స్వామివారు వెలసిన తరువాత కొంతకాలంపాటు ఎండకు ఎండి, వానకు తడిసి వున్నారట. అంతట దేవతలు మందుకు వచ్చి ఆలయ నిర్మాణము గావించారని చెబుతారు. స్వామివారికి యిరువైపుల శ్రీ లక్ష్మీదేవిని నారద మునీశ్వర్వులు, భూదేవిని శ్రీకృష్ణదేవరాయులవారు ప్రతిష్ఠించినట్లు శిలాశాసనములు చెప్పుచున్నాయి. శ్రీ మహావిష్ణువు ధ్రువునికి దర్శనమిచ్చి శిలారూపంలో యిక్కడే తొలుత వెలసినందున ఈ తిరుపతిని ‘తొలి తిరుపతి’ అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయ సందర్శనానికి వచ్చినవారు ప్రథమ ద్వారమునకు గల శ్రీచక్రము క్రింద నిలబడి గర్భాలయములోని స్వామివారిని చూచినచో ఎవరైతే చూస్తున్నారో వారంత ఎత్తులోనే ‘స్వామి కనిపించడం గమనార్హం! ధ్రువునికి యిచ్చిన రీతిలోనే దర్శనభాగ్యము భక్తులకు కలుగజేయుట విశేషం! బ్రిటీష్ విక్టోరియా మహారాణి వెంట వచ్చిన 6 అడుగులు ఎత్తుగల వానికి అంతే ఎత్తులో కనిపించి ఆశ్చర్యపరిచినట్లు చరిత్ర ఉవాచ. ఏ మహావిష్ణువు ప్రతిరూపంలోనూ కనిపించని విధంగా యిక్కడ స్వామివారు ఎడమవైపు శంఖువును.. కుడివైపు చక్రాన్ని కలిగి వుండడం భక్తులు తప్పనిసరిగా గమనించవలసిన విషయం. స్వామివారి దర్శన సమయంలో దీప ధూప నైవేద్య సమర్పణ చేసే అర్చకులు ప్రతిసారి స్వామివారి స్వయంభు కథనంతోపాటు యిత్యాది విశిష్ఠతలను కూడా తెలపడం అభినందనీయం.
చిత్తూరు జిల్లాలోగల పెద్ద తిరుపతి.. పశ్చిమ గోదావరి జిల్లాలోగల చిన్న తిరుపతి కంటే తూర్పుగోదావరి జిల్లాలో గల శ్రీ శృంగార వల్లభుని ఆలయం ‘ఆది తిరుపతి’గా ఖ్యాతికెక్కినా అంతగా ప్రాచుర్యం పొందకపోవడం విచిత్రమనే చెప్పాలి. ఆలయ ప్రాంగణములో నూతి నీటిని తలపై చల్లుకుని స్వామివారి ఎదుటకు వచ్చి కోరిక కోరుకున్నచో అది తప్పక నెరవేరుతుందని భక్తుల అచంచల విశ్వాసము. ఇలా కోరిక తీరిన వెంటనే స్వామివారికి పటిక బెల్లంతోపాటు సంతృప్తికరమైన కానుకలను భక్తులు విరివిగా సమర్పించుకోవడం నిత్యం జరుగుతూనే వుంటుంది.
ప్రతి యేటా చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవం దివ్యంగా.. శోభాయమానంగా జరుగుతుంది. భక్త దంపతులు ఈ కళ్యాణాన్ని రంగరంగ వైభవంగా జరుపుతారు. ధనుర్మాసంలో నిత్య పూజలు, గోత్రనామాలతో జరిపించుకుంటారు. ధనుర్మాసంతో తిరప్పావై చదవడం, ఆండాళ్ అమ్మవారి పూజలను విశేషంగా జరపబడుతుంది. పులిహోరా.. దద్దోజనం.. చక్కెరపొంగలి వంటి ప్రసాదాలను స్వామివారికి భక్తితో నివేదించి పంచిపెడతారు.
పూర్వం రాజుల పోషణలో అలరారిన శ్రీ శృంగార వల్లభుడు ప్రస్తుతం స్థానిక.. స్థానికేతర భక్తుల పూజలతో వెలుగొందుతున్నారు. రాజుల దేవాలయ మాన్యంగా 600 ఎకరాల భూమిగల ఈ ఆలయం ప్రస్తుతం 21 ఎకరాలతో దీప, ధూప నైవేద్యములతో ముందుకు నడుస్తుంది. ఆలయ ప్రాంగణములో గల స్థంభాలపై గల శిలా శాసనముల ద్వారా వేల సంవత్సరాల చరిత్ర గలిగినట్లు పురావస్తు శాఖద్వారా తెలుపబడినది. యింతటి పురాతన ఆలయ దర్శనభాగ్యం కోసం భక్తులు ఏ విధమైన ప్రచారం లేకపోయినా తరలిరావడం మహిమాన్వితం. భక్తుల కోరికలను తీర్చి పటికబెల్లానే్న కానుకగా తీసుకునే శ్రీ శృంగార వల్లభస్వామి భక్తుల పాలిట ముక్తిని ప్రసాదించే దైవంగా ప్రసిద్ధి.
ఆది తిరుపతికి వెళ్లేమార్గం
ధ్రువునికోరిక మేరకు భక్తవత్సలుడైన మహావిష్ణువు సాక్షాత్కరించిన ప్రదేశమే తూర్పుగోదావరి జిల్లాలోని ఆదితిరుపతి గ్రామం. ఈ ప్రదేశాన్ని సందర్శించే భక్తులుదేశ విదేశాలనుంచి తరలి వస్తుంటారు. కోరినకోరిలు ఈడేర్చే ఈ కలియుగ దైవం దగ్గరకు తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట రైల్వేజంక్షన్ నుండి కిర్లంపూడి వెళ్ళే దారిలో దివిలి గ్రామం అడ్డురోడ్డుగుండా లోపలికి 5 కి.మీలు ప్రయాణించాలి. ఈ గుడికి అంతగా ప్రాచుర్యం లేకపోయనా భక్తులుఎంత ఎత్తు ఉంటే అంతే ఎత్తుగా ఉన్నట్టు కనిపించే ఈ స్వామిని ఆశ్చర్యానందాలతో భక్తులు వీక్షించడానికి పోటీలు పడుతుంటారు. ఆలయ ప్రాంగణంలోని నూతినీటిని తలపై చల్లుకుని స్వామిని దర్శించుకొని తమ తమ మనసుల్లోని కోరికలను తెలుపుకున్నట్లయతే వెనువెంటనే వారి కోరికలు తీరుతాయని ఈ శృంగారవల్లభుని దర్శించిన భక్తులు చెబుతుంటారు.


తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలంలో ఉన్న ఒకానొక గ్రామం తిరుపతి. దీనిని చదలవాడ తిరుపతి, తొలి తిరుపతి అని అంటారు. ఇక్కడ స్వామి వారి పేరు శ్రీ శృంగార వల్లభస్వామి. సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి 12 కి.మీ, రాజమండ్రికి 45 కి.మీ దూరంలో ఉంది. ఈ ఆలయ స్తంభాలపై ఉన్న శిలా శాసనములను బట్టి 9 వేల సంవత్సరముల చరిత్ర గలదిగా తెలుస్తోంది. ఈ స్వామి ప్రత్యేకత ఏమంటే “ఎవరు ఎంత ఎత్తు ఉంటే వారికి అంతే ఎత్తు కనబడతాడు”.పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా కీకారణ్యము. ధృవుని తల్లి సునీత. ధృవుని సవతి తల్లి ధృవుడు సిం హాసనం ఎక్కకుండా తంత్రాలు నడుపుతుంది. సునీత, ధృవుని పిలిచి నీవు సిం హాసనం అధిష్టించి, రాజ్యపాలన చేయాలి. అందుకు శ్రీ మహా విష్ణువు దర్శన భాగ్యం కలగాలి. ఆయన దయతో నీకు రాజ్యపాలన యోగం కలుగుతుంది. అందుచేత తపమాచరించి, విష్ణు దర్శనం పొంది, రాజ్యాధికారం సంపాదించమని చెప్పి అడవులకు పంపుతుంది.అలా బయలుదేరిన ధృవుడు, ఈ కీకారణ్య ప్రదేశమునకు చేరుకున్నడు. ఇచ్చట శాండిల్య మహాముని ఆశ్రమం ఉన్నది. ఆ మునీశ్వరుని దర్శనం చేసుకున్న ధృవుని చూచి, అతని మనసులోని కోరిక తెలిసినవాడై, ముని అతన్ని పిలిచి “నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్య మంగళ రూపం తలుచుకొంటూ తపస్సు చెయ్యి. స్వామి ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పినారు. మునీశ్వరులు చెప్పినట్లుగా తపమాచరించుట మొదలుపెట్టినాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత, ధృవుని తపస్సుకి మెచ్చినవాడై విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూచి ధృవుడు భయపడ్డాడు. అంతట విష్ణువు “బాలక భయమెందుకు తత్తరపాటు చెందకు నేను నీ అంతే కదా ఉన్నాను” అని నవ్వుతూ పలుకటయే కాకుండా చెక్కిళ్ళు ఒత్తి భయము లేకుండా చేసినాడు. స్వామి అక్కడే శిలారూపంలో వెలసినాడు. ఇది స్థలపురాణము.ఆ దివ్యమంగళ సుందరమూర్తియే శ్రీ శృంగార వల్లభస్వామిగా పేరుగాంచాడు. “నీ అంతే ఉన్నాను కదా” అన్ని చెప్పిన కారణంగా చూసే భక్తులు ఎంత ఎత్తు ఉంటే అంతే ఉన్నట్లుగా దర్శనమిస్తాడు స్వామి. చెక్కిళ్ళు ఒత్తిన కారణంగా కుడి ఎడమలకు ఉండవలసిన శంఖు చక్రములు ఎడమ, కుడిలకు ఉంటాయి. స్వామి వారు వెలిసిన కొంతకాలానికి దేవతలు వచ్చి స్వామి వారికి ఆలయనిర్మాణం చేసినారు. తరువాత లక్ష్మీదేవి, నారదుడు. ఈ యుగమున శ్రీ కృష్ణదేవరాయలు వారు భూదేవి అమ్మవారి తామ్ర విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు శిలాశాసనములు ద్వారా తెలియచున్నది. భోజమహారాజు, భట్టివిక్రమార్కులు, రుద్రమదేవి, పెద్దాపురం సంస్థాన మహారాణులు ఈ స్వామిని దర్శించుకొన్నవారిలో కొందరు. విక్టోరియా మహారాణి స్వామిని దర్శించి వెండి కవచము చేయించినట్లు చెబుతారు. పిఠాపురం రాజులు స్వామి వారికి 600 ఎకరాల భూమిని దానం ఇచ్చారు. కాని ప్రస్తుతం 21 ఎకరాలు మిగిలింది. నిత్య దీపధూప నైవేద్యాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం దివ్యంగా జరుగుతుంది. అయితే ఈ ఆలయమునకు అంతగా ప్రచారం లేకపోవడం వలన కేవలం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలే ఎక్కువగా దర్శించుకొంటారు.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML