గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 25 December 2014

గురుగ్రహాధిపత్యంతో జాతకులకు కలిగే ఫలాలుగురుగ్రహాధిపత్యంతో జాతకులకు కలిగే ఫలాలు

గురు గ్రహ ప్రభావంతోనే జాతకులు సకల ఐశ్వర్యాలకు చేరువవుతారని జ్యోతిష్కులు అంటున్నారు. అదే విధంగా గురుగ్రహ ఆధిపత్యంతో యోగ ఫలాలకు చేరువ అవుతారని జ్యోతిష్కులు పేర్కొంటున్నారు. అందమైన సౌందర్యంతోపాటు ఆకర్షణీయమైన ఛాయను కలిగి ఉంటారు. ఎటువంటి కార్యాన్నైనా సులభంగా ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నీతి నిజాయితీలకు ప్రాధాన్యత ఇవ్వటం వీరి నైజం. సమాజంలో ఇతరులు గౌరవించే విధంగా ప్రవర్తిస్తారు. కళత్ర స్థానంతో జీవితంలో అగ్రస్థానాన్ని అందుకుంటారు. భాగస్వాముల ప్రేమకు పాత్రులవుతారు.


గురుగ్రహం మొదటి స్థానంలో ఉంటే మంచి జీవితం సమాజంలో హోదా లభిస్తుంది. రెండో స్థానంలో ఉంటే... ఐశ్వర్యంతో కూడిన జీవనం, ఆనందం, బంధువుల సహకారం లభిస్తుంది. మూడో స్థానంలో ఉంటే సోదరుల సహాయం, బంధువుల సహకారం, బంధువులు వ్యాధులకు గురికావడటం వంటివి జరుగుతాయి. నాల్గో స్థానంలో ఉంటే పుత్రభాగ్యం లభిస్తుంది.

ఐదో స్థానం దైవభక్తిలో నిమగ్నం కావటం వంటివి చేస్తారు. ఆరో స్థానం భవిష్యత్తులో పురోగమనంలో ఆటంకాలు, శత్రువుల నుంచి అధిక ఎత్తులో సమస్యలు చోటుచేసుకుంటాయి. ఏడో స్థానం అందమైన సౌందర్యం, సుఖవంతమైన జీవితం, ఎనిమిదో స్థానం జీవితంలో చేరువైన వాటి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి.

తొమ్మిదో స్థానం పూర్వ జన్మ సుకృతంతో మంచి కార్యాలు, పదో స్థానం సాధనలతో కీర్తి, పదకొండో స్థానం ధనాన్ని మితంగా ఖర్చు చేయటం పొదుపు చేయటం వంటివి, పన్నెండో స్థానం అనవసరమైన ఖర్చులు, కీడు కలిగించే పరిస్థితులు నెలకొంటాయి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML