గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 4 December 2014

ఇందులో విశేషం ఏంటంటే.. అ నుండి క్ష వరకు ఉన్న అక్షరాలతో పాదం ప్రారంభం కావడం.= శ్రీ సాంబ సదాశివ అక్షరమాలా స్తోత్రం

శివోదయం...!

శ్రీ సాంబ సదాశివ అక్షరమాలా స్తోత్రం ..

ఇందులో విశేషం ఏంటంటే.. అ నుండి క్ష వరకు ఉన్న అక్షరాలతో పాదం ప్రారంభం కావడం.

మీ అందరి కోసం....!

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ||
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ||

అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ||సాంబ||
ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ||సాంబ||
ఇందు కళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ ||సాంబ||
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ ||సాంబ||
ఉరగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నటేశ శివ ||సాంబ||
ఊర్జిత దానవనాశ పరాత్పర ఆర్జిత పాపవినాశ శివ ||సాంబ||
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్ని త్రినేత్ర శివ ||సాంబ||
ౠపనామాది ప్రపంచ విలక్షణ తాపనివారణ తత్వ శివ ||సాంబ||
ళుల్లిస్వరూప సహస్ర కరోత్తమ వాగీశ్వర వరదేశ శివ ||సాంబ||
ళూతాధీశ్వర రూపప్రియహర వేదాంతప్రియ వేద్య శివ ||సాంబ||
ఏకానేక స్వరూప సదాశివ భోగాదిప్రియ పూర్ణ శివ ||సాంబ||
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన సచ్చిదానంద సురేశ శివ ||సాంబ||
ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారప్రియ ఈశ శివ ||సాంబ||
ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ ||సాంబ||
అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ ||సాంబ||
ఆహారప్రియ అష్ట దిగీశ్వర యోగి హృదిప్రియవాస శివ ||సాంబ||

కమలాపూజిత కైలాసప్రియ కరుణాసాగర కాశి శివ ||సాంబ||
ఖడ్గశూల మృడ టంక ధనుర్ధర విక్రమరూప విశ్వేశ శివ ||సాంబ||
గంగా గిరిసుత వల్లభ శంకర గణహిత సర్వజనేశ శివ ||సాంబ||
ఘాతక భంజన పాతకనాశన దీనజనప్రియ దీప్తి శివ ||సాంబ||
జ్ఞాన్త స్వరూపానంద జనాశ్రయ వేదస్వరూప వేద్య శివ ||సాంబ||

చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ ||సాంబ||
ఛత్రకిరీట సుకుండల శోభిత పుత్రప్రియ భువనేశ శివ ||సాంబ||
జన్మజరా మృత్యాది వినాశన కల్మషరహిత కాశి శివ ||సాంబ||
ఝంకారప్రియ భృంగిరిటప్రియ ఒంకారేశ్వర విశ్వేశ శివ ||సాంబ||
జ్ఞానాజ్ఞాన వినాశన నిర్మల దీనజనప్రియ దీప్తి శివ ||సాంబ||

టంకస్వరూప సహస్ర కరోత్తమ వాగీశ్వర వరదేశ శివ ||సాంబ||
ఠక్కాద్యాయుధ సేవిత సురగణ లావణ్యామృత లసిత శివ ||సాంబ||
డంభవినాశన డిండిమభూషణ అంబరవాస చిదేక శివ ||సాంబ||
ఢంఢండమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్య శివ ||సాంబ||
నానామణిగణ భూషణనిర్గుణ నతజనపూత సనాథ శివ ||సాంబ||

తత్వమస్యాది వాక్యార్థ స్వరూప నిత్యస్వరూప నిజేశ శివ ||సాంబ||
స్థావరజంగమ భువనవిలక్షణ తాపనివారణ తత్వ శివ ||సాంబ||
దంతివినాశన దళితమనోభవ చందన లేపిత చరణ శివ ||సాంబ||
ధరణీధరశుభ ధవళవిభాసిత ధనదాదిప్రియ దాన శివ ||సాంబ||
నళినవిలోచన నటనమనోహర అళికులభూషణ అమృత శివ ||సాంబ||

పార్వతినాయక పన్నగభూషణ పరమానంద పరేశ శివ ||సాంబ||
ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ ||సాంబ||
బంధవిమోచన బృహతీపావన స్కందాదిప్రియ కనక శివ ||సాంబ||
భస్మవిలేపన భవభయమోచన విస్మయరూప విశ్వేశ శివ ||సాంబ||
మన్మథనాశన మధురానాయక మందరపర్వతవాస శివ ||సాంబ||

యతిజన హృదయాధినివాస విధివిష్ణ్వాది సురేశ శివ ||సాంబ||
రామేశ్వరప్రియ రమణముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ ||సాంబ||
లంకాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ ||సాంబ||
వరదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూష శివ ||సాంబ||
శాంతి స్వరూప అతిప్రియసుందర వాగీశ్వర వరదేశ శివ ||సాంబ||
షణ్ముఖజనక సురేంద్ర మునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ ||సాంబ||
సంసారార్ణవ నాశన శాశ్వత సాధుజన ప్రియవాస శివ ||సాంబ||
హరపురుషోత్తమ అద్వైతామృత మురరిపు సేవ్య మృదేశ శివ ||సాంబ||
లాళిత భక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ ||సాంబ||
క్షరరూపాభి ప్రియాన్విత సుందర సాక్షాత్ స్వామిన్నంబా సమేత శివ||సాంబ||No comments:

Powered By Blogger | Template Created By Lord HTML