గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 December 2014

అంతకాల స్మరణ

అంతకాల స్మరణ

శ్రీమద్భగవద్గీత "అక్షరపర బ్రహ్మయోగము" ఐదవ శ్లోకం

"అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరమ్
య: ప్రయాతి స మధ్బావం యాతి నాస్త్యత్ర సంశయ:"

తాత్పర్యం: ఎవడు మరణకాలమందు కూడ నన్నే స్మరించుచు శరీరమును విడిచిపోవుచున్నాడో, అతడు నాస్వరుపమును పొందుచున్నాడు. ఇందు సంశయమేమి లేదు.
ఈ అంతకాలస్మరణకు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారు చేసిన వ్యాఖ్యానము శ్రీవైకుంఠ ఏకాదశి నాడు ఓసారి జ్ఞాపకం చేసుకుందాము.
ఈ శ్లోకములో చెప్పినట్లు అంతకాలస్మరణ చేయటానికి అందరికీ అవకాశములేకపోవచ్చుకదా?
కొంతమంది ఆస్పత్రిలో ముక్కులో, నోట్లో ట్యూబులతో, కృత్రిమ శ్వాసలతో, ఉంటారుకదా? మరివారు
అంతకాలస్మరణ ఏలా చేయగలరు? వారిని అంతకాలములో ఆ స్థితిలో "తనను" స్మరించమనటము న్యాయమేనా? అన్న అనుమానము మనకి వస్తుంది. మరి మన స్వామి అంత కఠినుడా? అన్న చర్చకు తావులేకుండా ఈ అంతకాలస్మరణకి అర్ధం ఏమిటంటే " నీవు బాగున్నప్పుడు, అంటే నీ అవయవాలన్నీ బాగా పనిచేస్తూ నీవు బాగా తిరుగుతున్నప్పుడు, భగవంతుని మరువకుండా రోజు శ్రీస్వామిని ఆరాధిస్తూ ఉంటే, నీకు చేతకాకుండా అచేతనుడవై పడిఉన్నప్పుడు, ఆ దయామయుడు నీబదులు అంతకాలస్మరణ తనే చేసి, నీకు కావలసిన పరమపదాన్ని కలుగచేస్తాడని" మహోన్నతమైన వ్యాఖ్యానము చేసి మనము నిత్యారాధనమగ్నులమై ఉండాలని భోధించారు.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML