గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 10 December 2014

గరుడ, సత్యభామల గర్వభంగం చేసిన హనుమంతుడు . (7 photos)

గరుడ, సత్యభామల గర్వభంగం చేసిన హనుమంతుడు . (7 photos)
హనుమంతుడు గంధమాదన పర్వత ప్రాంతంలో బంగారు అరటి తోటలలో నిత్యం నివసిస్తూ ఉంటాడు. ఏ
కోర్కె లేనివాడైనా లోకానుగ్రహకాంక్షతో పరివారంతో కూడి శ్రీ రామచంద్ర
పాదద్వయ ధ్యానతత్పరుడై ఉంటాడు. ఒకప్పుడు గరుత్మంతుడు తన బలాన్ని ఎంచుకొని
గర్విస్తూ ఇలా అనుకున్నాడు. “దేవతలందుకాని, రాక్షసులందుకాని,
నరులందుకాని,సర్పజాతియందుకాని యక్షులందుకాని నాయెదుట యుద్దంచేసి నిలువగల
వాడెవ డున్నాడు? నన్నెదిరించి ప్రాణాలతో బ్రతుకగలవాడీ ముల్లోకాలూ
గాలించినాలేడు. పర్వతాలు మోయటంలో కీర్తింపబడవచ్చు. కాని వానరులు కూడా నాతో
సమానులెలా కాగలరు? నేను లోకమంతటిని ఉదరంలో వహించి దేవదానవులకు కదల్పటానికి
కూడా శక్యంకాని దేహం కల్గిన సాక్షాత్తు నారాయణమూర్తినే నా రెక్కలమీద
మోస్తున్నాను” అని అనుకొంటూ గర్వంతో గరుత్మంతుడు మైమరిచి ఉన్నాడు. ఇది
తెలిసిన యదుకుల భూషణుడు శ్రీకృష్ణుడు ద్వారకానగరంలో సత్యభామతో రత్నసింహాసనం
అధిష్టించిఉండి గరుత్మంతుని గర్వాన్ని పోగొట్టదలచి తనలో అతణ్ణి
స్మరించాడు. వెంటనే అతి వేగంతో ఆ గరుడుడు వచ్చాడు. కృష్ణునకు అంజలి ఘటించి
ఆజ్ఞకోసం నిరీక్షించాడు.
అంతట
కృష్ణుడు “ఓ వినతా తనయా! అమిత వేగము కలవాడా! మహాబల పరాక్రమ సంపన్నుడా!
బంగారు అరటిచెట్లచే రమ్యమైన గంధమాదన పర్వతం మీద ధ్యానమగ్నుడై భక్త సులభుడు,
ధర్మాత్ముడు అయిన హనుమంతుడున్నాడు. నేనతనితో మాట్లాడవలసి ఉంది, కాబట్టి
అతన్నిఇక్కడికి తోడ్కొని రావలసింది” అని అజ్ఞాపించాడు. వైనతేయుడు మనసును
మించిన వేగంతో తక్షణమే గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. అక్కడ నిశ్చలంగా మనసున
ధ్యానం చేసుకుంటూ ఉన్న వానర శ్రేష్టుడైన హనుమంతుని చూచాడు. అతని ఎదుట
గర్వంగా నిలబడి గరుడుడు అనేక పర్యాయాలు పిలిచాడు. “ఓ వానరశ్రేష్టా!
మహాత్ముడైన శ్రీకృష్ణుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ యోగాన్ని చాలించు. ఓ
మహాజ్ఞానీ! ఆలస్యం చేయకు. శ్రీకృష్ణుని శాసనం అతిక్రమింపతగనిది కాబట్టి
నిన్ను తీసికొని వెళ్ళనిదే ఇక్కడనుండిపోను” అన్నాడు. స్థిర యోగంలో
శ్రీరామచంద్రుని పాదద్వయమునందే ధ్యానముంచి నిశ్చలమనస్కుడై ఉన్న వానరవంశ
శ్రేష్టుడైన హనుమంతుడు ఈ బాహ్య విషయాన్ని దేనిని గమనింపలేదు.
అప్పుడు
గరుత్మంతుడు కృష్ణాజ్ఞనాలోచించుకొని భయపడి హనుమంతునియందు అల్పభావంతో తన
ముక్కుని హనుమంతుని ముక్కు రంధ్రంలోకి పోనిచ్చాడు సర్వ ప్రాణుల అంతః
కరణములందు సంచరించే హనుమంతుడు, గరుత్మంతుడు చేసిన వికార చేష్టలను గుర్తించి
కూడా గుర్తించనట్లున్నాడు. ఇంకా నిశ్చలుడై మెదలకుండా ఉన్న మారుతి చెవి
దగ్గర తన ముక్కునుంచి గరుత్మంతుడు మరల పిలిచాడు.ఇంతలో హనుమంతుడు యోగాన్ని
ఉపసంహరింప నెంచినవాడై యధావిధి ప్రాణాయామం విరమింపసాగాడు. యోగవేత్త అయిన
హనుమంతుడు ముక్కు కుడిరంధ్రం ద్వారా వాయువుని విడిచి, ఎడమ ముక్కు రంధ్రంచే
వాయువును పీల్చినవాడై, ముక్కు లోపల వాయువును కుంభిస్తూ ఉన్నాడు. ఆ
హనుమంతుని యోగం గరుత్మంతుని పాలిటి భయంకర ప్రయోగ మయింది. ప్రాణాయామంలో
మారుతి గాలిని విడిచే సమయానికి ఆ గాలిచే గరుత్మంతుడు దూరంగా
నెట్టివేయబడుతున్నాడు. మరల పీల్చేటప్పుడు ముక్కుదగ్గరకు ఈడ్చుకొని
రాబడుతున్నాడు. కుంభకంలో వాయువును నిరోధించినప్పుడు గరుడుడు కూడ ముక్కు
చివర నిరోధింపబడుతూ పితృదేవతలను తలచుకొనటం మొదలట్టాడు. ఇలా అతనికి ప్రాణాలు
పోయేటంతటి పీడ ఏర్పడింది.
హనుమంతుని
ప్రాణాయామం పూర్తి అయ్యేసరికి గరుత్మంతుడు విడుదలయ్యాడు. తనకు కలిగిన
క్షోభవల్ల, కృష్ణాజ్ఞ మీరినందువల్ల చాల కోపమువచ్చి ప్రళయ కాలాగ్నిలా
మండిపడుతూ ఆకాశాన్ని నొక్కుతూ పలుసార్లు వేగంగా పై కెగిరాడు. హనుమంతుని
అమాంతంగా తీసికొని వెళ్ళాలనుకుని దేహాన్ని బాగా పెంచి వీపుభాగం మేఘాలని
ఒరుసుకొనేటట్లు ఎగిరి లోకాన్ని, ఆంజనేయుణ్ణి చూస్తూ ఆతనిని పట్టుకొనిపోయే
ఆలోచనతో వర్తులాకారంగా తిరగసాగాడు. ఆ గరుత్మంతుని పట్టుకోవడంకోసం మేఘాలని
తాకేటట్లుగా తన తోకను పెంచాడు. గరుడుడు దాన్ని చూచి పొడవైన కట్టుకొయ్య
అనుకున్నాడు. బాగా తిరగటంవలన ఏర్పడిన శ్రమను పోగొట్టుకోవడం కోసం
విశ్రాంతికై దానిమీద నిలబడ్డాడు. సూర్య సంచారాన్నే నిరోధిస్తూ ఉన్న ఆ
హనుమద్వాలాన్ని గుర్తించి దానిని ఛేదిద్దామని అలోచించాడు. పెద్దదైన తన
ముక్కు కొనతో దేవేంద్రుడు వజ్రాయుధంతో హనువును వేదించినట్లుగా తోకను
పొడవనారంభించాడు. ముక్కుతో పోటు పొడవబడిన హనుమంతునికి త్రిపురాసురినియందు
శంకరునికి వచ్చినంత కోపం గరుత్మంతునిపై వచ్చింది.
తోకచివర
ఉన్న గరుత్మంతుణ్ణి వరుణపాశంతో సమానమైన రోమాలతో గ్రుడ్డును పట్టినట్లు
పట్టి బంధించాడు మారుతి. గట్టిగా బంధించటం వల్ల శ్వాసక్రియ కూడా జరుగునట్టి
యంత్రశిలవంటి గరుత్మంతుని రెట్టించిన వేగంతో ఒక్క విసురు విసిరాడు. తోకచే
చితుకకొట్టబడిన అవయవాలతో యమునికి చిక్కినట్లు చిక్కిఉన్న ఆ గరుడుడు బలంగా
పావనితోకతో విసరటంతో ఆపశక్యంకానివాడై శ్వేతదీపంలో పడ్డాడు. దాంతో రెక్కల
మొదళ్ళు విరిగిపోయాయి. గుహ్యాంగాలు దెబ్బతిన్నాయి. ముక్కుకొనలు
చితికిపోయాయి. అలా ఆ పాలసముద్రంలో మునిగాడు. క్షీరసముద్ర జల స్పర్శవల్ల మరల
మొలచిన రెక్కలు కలవాడై పాలసముద్రం ఒడ్డున కొంత సమయం విశ్రమించి
ద్వారకానగరం వెళ్ళాడు. వాడిపోయిన ముఖంతో అణగారిన బలగర్వంతో శ్రీకృష్ణుని
చూచాడు. సిగ్గుతో తలవంచి ఎదురుగాఉన్న గరుత్మంతునితో దాచుకొంటున్నా
బయటపడుతున్న చిరునవ్వులు కల శ్రీకృష్ణుడు చల్లగా ఇలా అన్నాడు. “ఓ
పక్షీంద్రా, అలా నిలుచున్నా వేమిటి? నిర్విణ్ణుడవై ఉన్న కారణమేమిటి? జరిగిన
వృత్తాంతమంతా నాకు చెప్పు. అనగానే గరుత్మంతుడు సిగ్గుతో తలవంచుకునే ఇలా
అన్నాడు.
“ఓ
దేవదేవా! జగన్నాయకా! నీ మాయవలన చరాచర జగత్తంతా మోహంచెంది ఉంది. బలగర్వంతో
ఉన్న నేను ఇక్కడనుండి వెళ్ళి గంధమాదన పర్వతంపై యోగనిష్టలో ఉన్న హనుమంతుని
చూచాను. నీ ఆజ్ఞను వినిపించాను. అయినా అన్యచింతనలో ఉన్న ఆంజనేయుడు నా మాట
వినలేదు.’ అనగానే ఆశ్చర్యభావం ప్రకటిస్తూ కృష్ణుడు ‘ఛీ! ఏమిటి ఆలస్యం?
అతనిది నియమరహితమైన జపంలాగుంది. వెంటనే వెళ్ళి వానిని తీసికొనిరా. నా కా
మారుతితో పని ఉంది.’ అన్నాడు. అది వెంటనే భయకంపితుడైన గరుత్మంతుడు తల
వంచుకొని దీనంగా ‘దేవదేవా! నా గర్వమణటంకోసం నా పాలిటి మృత్యువే ఆ
వానరరూపంలో ఉన్నాడు. ఇది నిశ్చయం. ఆ హనుమంతుడున్న దిక్కుకు త్రిసంధ్యలందూ
దణ్ణం పెడుతున్నాను. ఆ పని తప్ప మరేదయినా చేస్తాను. అతని జోలికి వెళ్ళేపని
మాత్రం వద్దు’ అని గరుత్మంతుడు చెప్పేసరికి
శ్రీకృష్ణుడు
నవ్వుతూ నర్మగర్భంగా ‘ఓ పరాక్రమశాలీ! ప్రకృతి విరుద్దమైన ఈ భాషణం నీకు
తగదు. నీ పరాక్రమానికి ఎక్కడా అడ్డు ఉండదు. అతడు కేవలం వనంలోని పండ్లు తిని
చెట్లపై సంచరించే కోతియే కదా! పరిహాసం వదిలిపెట్టి వెంటనే ఆతనిని
తీసికొనిరా’ అని అతి దీనుడు అయిన గరుడునితో ‘గరుత్మంతా! ఈమారు నీవు రామనామం
చేస్తూ వెళ్లు. వెళ్ళి ‘వానరా! నిన్ను సీతారాముడు నిన్ను పిలుస్తున్నాడు’
అని చెప్పు అన్నాడు. కాదనలేక ప్రాణములందు ఆశ వదలుకునే మళ్ళీ కృష్ణుడు
చెప్పినట్లే ‘సీతారాముడు నిన్ను పిలుస్తున్నాడు’ అన్నాడు. అంతే హనుమంతుడు
కన్నులు తెరచి యోగంవీడినవాడై ‘నేను ధన్యుడనైనాను. రామ నామామృతంవలన నా
చెవులకు సుఖం చేకూరింది. ‘ఓ ఖగరాజా! ఇవిగో సకలోపచారాలు’ అని పూజించి ‘ఓ
స్నేహితుడా! నీవునాకు పూజ్యుడవు. ఏడీ నా రాముడు? అతడెక్కడ ఉన్నాడో అక్కడకు
వెళ్దాము, నా భుజములపై ఎక్కు. లేదా ముందు నడుస్తూ దారిచూపు’ అనగానే
భుజాలెక్కే సాహసంచేయని గరుత్మంతుడు ముందు నడుస్తూ త్రోవ చూప నారంభించాడు.
మనోజవులైన ఇద్దరూ క్షణంలో ద్వారకకు చేరారు.
హనుమంతుని
రాక తెలిసి కృష్ణుడు క్షణంలో రఘురామునిగా మారాడు. సత్యభామను చూచి ‘నీవు
సీతవు కావలసిం’దన్నాడు. అలాగే అని యత్నించింది కాని సత్యభామకు అది సాధ్యం
కాలేదు. ఆమెను తొందర చేస్తూ కృష్ణుడు ‘అడుగో పావని వస్తున్నాడు, వెంటనే
నీవు సీతవు కాకపోతే మనకూ గరుత్మంతునిలా గర్వభంగం తప్పదు’ అన్నాడు. ఇది తనకు
పరీక్షగా గ్రహించి సత్యభామ తనబాధ రుక్మిణికీ కలగాలని ఆమెకు కూడా సీతగా
కావటం అసాధ్యమే అనే నమ్మకంతో ‘ఓ హరీ! నీకు రుక్మిణియందు ప్రీతి ఉంటే ఈపని
ఆమెచే చేయించటం శ్రేయస్కరం. నేనీపని చేయజాలనంది.’ వెంటనే కృష్ణుడు
వేగిరపాటుతో ‘సత్యా! అడుగో హనుమంతుడు సమీపించాడు. నీకు జానకీరూపందాల్చే
ధీరత లేకపోతే వెంటనే ఈ పనికై రుక్మిణినయినా అజ్ఞాపిస్తా నన్నాడు.’ సిగ్గుతో
తలవంచి సత్యభామ ‘ఈ కార్యం రుక్మిణి మాత్రం ఎలా చేయగలదు? నేను చేయలేనిపని
చేయటం ఆమెకూ సాధ్యంకాదు’ అంది. వెంటనే కృష్ణుడు రుక్మిణిని జానకి అయ్యేలా
ఆజ్ఞాపించాడు. తక్షణం రుక్మిణి రామ సహధర్మచారిణి అయిన జానకీమహాదేవి అయింది.

ద్వారకానగరం
అయోధ్యగా కానవచ్చింది. అక్కడ సీతతో కూడి సింహాసన మధిష్టించి ఉన్న
రామునిచూచి హనుమంతుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేశాడు. అనంతరం అంజలి
ఘటించి పరమానందంతో వేదాంత పూర్ణమైన స్తోత్రాలు చేశాడు. ఆనందాశ్రువులతో
గానంచేస్తూ నృత్యం చేశాడు. శ్రీరాముడు కుశల ప్రశ్నలు వేయగా మారుతి
వినమితుడై ‘రామా! భక్తులపాలిటి రక్షకుడవై నీవుండగా అశుభాలు ఎక్కడనుండి
వస్తాయి? సూర్యుడు తూర్పు కొండపైకి రాగా చీకటి ఎలా ఉంటుంది’ అన్నాడు.
అప్పుడు శ్రీరాముడు ‘ఓ హనుమంతా! భక్తులలో శ్రేష్టుడవైన నీయందు
యోగ్యలక్షణాలన్నీ ఏకీకృతమై ఉన్నాయి. నీ ప్రమాణం వలననే మేము కలకాలం లోకంలో
ఉంటాము. నీవు నాకు ప్రాణ సమానుడవు. ఓ హనుమంతా! ఇటు రా! ఈ మణిహారం తీసుకో.
ఎప్పుడూ దీన్ని ఉపేక్షింపకు.’ అని, ‘దూర ప్ర్రయాణంచే అలసిఉన్న నీవు
ఫలభరితమైన గంధమాదన పర్వతానికి వెళ్ళు’ అన్నాడు. హనుమంతుడు రామాజ్ఞను,
రామమాలికను శిరసావహించి మళ్ళీ ప్రదక్షిణ నమస్కారములు చేసి రాముని అనుమతితో
తన నిత్య నివాసమైన గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు

Hanuman and Garuda

s we all know, Bhagavaan does not want to see his devotee taking a reverse direction in the spiritual path. He takes the responsibility to turn them around by giving them different experiences or in other words he would never let His devotees perish even if the devotee complaints or seemingly suffers. He sticks on to His promise-

"Na mae Bhaktha: pranashyathy" or my devotees will never perish.

Often ego or pride makes all of us walk in the reverse direction knowingly or unknowingly, away from Bhagavaan. Garuda, Bhagavaan's dear vehicle also was deviating from the divine path due to his pride about his swiftness and strength.

Let us see how Bhagavaan purifies Garuda's mind. One day Bhagavaan told Garuda to invite Hanuman who was doing penance in Gandhamaadana Parvatha or mountain. Garuda was happy to follow Bhagavaan's order because he always wanted to meet Hanuman, the great devotee of Lord Rama. He had heard several stories about his greatness. Garuda flew straight to Gandhamaadana parvatham and saw Hanuman sitting turning towards the setting sun. Garuda approached and stood behind him. First he made some noises and then slowly touched him with his wings. Hanuman did not turn his head or acknowledge his touching either by any body movements or by making any noise. Garuda waited for a few minutes and touched him again and there was absolutely no response. Garuda was a little impatient and touched him again and this time it was a harder touch. Hanuman remained still and actually Garuda hurt his wings by touching him with a little force. Now he was actually angry and in that anger he spread his wings and lashed at Hanuman's back.

Garuda did not know what happened, He was thrown at least 50 yards to the back and fell with his wings striking on the hard rock. He was very badly hurt and was wriggling with pain. This made him more angry and with all his strength he jumped on Hanuman again and this time he was bounced back like a ball and fell again on the hard rock. Hanuman was sitting as if nothing had happened. Garuda was not only physically hurt, but his ego was hurt far more than his body. He was not bold enough to try to draw Hanuman's attention one more time. So he went to Bhagavaan and explained to him what happened and how he hurt his strong wings etc. Bhagavaan smiled and said:

"Garuda, go again and please tell him that Lord Rama and Sita Devi want to see him and I am sure he would immediately come with you. Forget about what happened and please be very nice to him."

Garuda could not disobey his Master's words. So he went again with his vanished ego about his unparalleled physical strength and stood in front of Hanuman with folded hands. He told Hanuman that Lord Rama and Sita Devi wanted to see him. The moment Hanuman heard Lord Rama he jumped in ecstasy and asked Garuda

"Where is my Lord? Where is my Lord and Mother Sita? I want to see them now".

Garuda said they were in Vaikundham waiting for him and he would carry Hanuman on his back. He said he was the fastest bird in the universe and it was better to go with him. He told that Vaikundha is far and Hanuman would take for ever to reach there. But Hanuman told Garuda to go first and he said he would come by himself. Garuda did not want to say anything more and flew back to Vaukundham as fast as his wings could take him. Then he reached the gate and told the guards (not Jaya and Viyaya because they were still doing their janmaas as Shishupaala and Dandavakthra!) that Hanumanji would be coming soon and they should let him in with out antagonizing him. Garuda warned them of the potential danger of rubbing Hanumanjit on the wrong side. Then the guards said:

"Garudaji, Hanumanji is already here. He came long back and is with Bhagavaan inside. Actually Hanumanji tod us that you would be coming behind him and you would be very tired. He left all these fresh fruits to be given to you and told you to eat these and get some rest."

Garuda now knew that there are people stronger than him and there are people who can travel more swiftly than him. His ego completed melted and dissolved in the pure devotion towards his Master who is the Lord of the Universe and who is Bhakthavathsala!

He fell prostrate at Bhgavaan's feet and then at Hanumanji's feet and disappeared in to his quarters.

VaayusoonO Namaamyaham.

Hanuman and Sathyabhama

When we continue the same story of Hanuman and Garuda we can see how Bhagavaan uses Hanumanji again to shatter the ego of one of His own chief consorts Queen Sathyabhaama. We saw that Garuda showed his respect and retired to this quarters. Hanumanji eagerly went inside Vaikundham to see his Lord Rama and Sita Devi.

Before Hanuman reached there, Bhagavaan told Queen Sathyabhaama to dress like Sita Devi and come and sit near Him who had dressed like Lord Rama. Sathyabhama was very proud of her beauty and her extreme vanity made her believe that she was the most beautiful woman. She believed that her unparalleled beauty made her Bhagavaan's favorite. This superiority complex was often reflected in her behaviour and of course Bhagavaan, a well-wisher of all devotees wanted to correct her attitude.

Sathyabhaama took a long time with the help of several 'sairandhris" or make-up ladies and dressed like Sitadevi and came and sat near Bhagavaan. In a few moments Hanumanji came and fell prostrate at Bhagavaan's feet, washed His feet with his tears of intense devotion and asked Bhagavaan: "Lord, where is Mata Sita? I want to do a pradakshinam (circumambulaion) of both of you and do a namaskaar. Please call Mata Sita, I am dying to see both of you together just like I saw you during the pattaabhishekam or coronaion in Ayodhya."

Sathyabhaama was perplexed and told:

"Bhaktha Hanuman, I am here. Look at this side."

Hanumanji silenced her: "Sodari, (sister) do not utter foolish words like this. You are an ordinary woman and my Mata Sita is not like you. She is as beautiful as Mahalakshmi and and she is the kindest and most affectionate woman in the whole universe. Do not play this game to me. Please go and ask Mata to come here. I will not leave this place unless I see her with my Lord."

Sathyabhaama's eyes were filled with tears. Hanumanji's words were like arrows piercing her heart. Bhagavaan saw this and asked her to go inside and asked one of his assistants to go and request Rukmini Devi to dress and come as Sita. Sahtybhaama disappeared in to the inner quarters and waited near a peep hole to watch everything.

In a few moments Rukmini Devi came in simple dress and humbly sat near Bhagavaan, who was waiting for her in the form of Lord Rama. Hanumanji was delighted to see Mata Sita with His Lord and jumped, clapped his hands and did somersaults to show his extreme emotion.Then he did several pradakshinams and did namaskaar again and again and washed their feet with his tears of joy and bhakthi. Bhgavaan embraced him, and both Sita Devi and Lord blessed him. Hanumanji took leave by walking backwards until he came out of Vaikundham and went back to Gandhamaadana parvatham to continue his Raama naama sankeertthanam.

Sathybhaama was watching all these from the inner quarters and realized how vane she was and apologized Bhagavaan. When the veil of ego was removed, she felt that the world was much brighter and she could serve Bhgavaan and His devotees with unswerving and pure devotion.

VaayusoonO namaamyhamNo comments:

Powered By Blogger | Template Created By Lord HTML