గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 14 December 2014

విష్ణు సహస్ర నామాలలో 28వ నామం స్థాణుః :విష్ణు సహస్ర నామాలలో 28వ నామం స్థాణుః :

౧. స్థిరమైనవాడు, చలించని వాడు.
జగత్తు అనే చక్రం 'పరమాత్మ' అనే ఇరుసును ఆధారం చేసుకుని భ్రమిస్తుంది. కానీ ఆ ఇరుసు 'స్థిరం'గా పరిణామ రహితంగా ఉంటుంది. స్థిరత్వమే పరమాత్మ యొక్క అసలు తత్త్వం. ఆధారం ఎప్పుడూ స్థాణువే. జగదాధారుడైన విష్ణువు స్థాణువు.
౨. తిష్ఠతీతి స్థాణుః: భక్తులను అనుగ్రహించే విషయంలో దృఢంగా నిలిచేవాడు - అనే అర్థాన్ని కూడా గ్రహించవచ్చు. స్వామి కృప, సంకల్పం స్థిరమైనవి.
౩. వృక్ష ఇవస్తబ్ధో దివి తిష్ఠత్యేకః!
తేనేదం పూర్ణం పురుషేణ సర్వం!!
అని వేదం వివరించింది. వృక్షపు కొమ్మలు రెమ్మలు, పువ్వులు ఆకాశం వైపు ఎదుగుతూ, గాలికి కదులుతూ, చిగురిస్తూ, రాలుతూ, పండుతూ ఉన్నా దానిని నియంత్రించి చైతన్యాన్నిచ్చే స్కంధము (కాండము), వేళ్ళు నిశ్చలంగా, స్తబ్ధంగా ఉంటాయి. అలాగే సృష్టి స్థితి లయాది పరిణామాలతో నున్న విశ్వవృక్షంలో వీటన్నిటినీ నిర్వహించే అసలు చైతన్యం ఏ మార్పూ లేని శాంతమంగళ స్థిరత్వంతో ఉంటుంది. అందుకే పూర్ణ పురుషుడు 'శివః స్థాణుః' అని కీర్తించబడ్డాడు.
4. స్థిరమైన వాడు - అంటే చలించని వాడు.
'చలించడం' అంటే ఇంతకు ముందు తానులేని చోటుకి వెళ్ళడం. ఇక్కడ ఉన్న ఒక వస్తువు అక్కడికి కదిలింది - అంటే, ఇంతకు ముందు అక్కడ లేదు అని అర్థం. అక్కడికి వెళితే ఇక్కడ ఉండదు అని కూడా భావం. సర్వవ్యాపి అయిన పరమాత్మ ఎక్కడికని కదులుతాడు? ఎక్కడ లేడని - లేని చోటుకి వెళ్ళేది? అందుకే ఆయన ఎప్పటికీ స్థాణువే.
౫. 'స్థాణు' అంటే 'మోడు' అని అర్థం కూడా ఉంది.
కామాది వికారాలేవీ లేని నిస్సంగ స్థితిలో, 'కేవలత్వం'గా మిగిలే నిర్వికార పరతత్వమది.
౬. 'స్థాణు' శబ్దానికి 'లింగరూపి' అని కూడా అర్థం.
సర్వమునకు ఆధారం - అవ్యక్త, వ్యక్త తట్ట్వానికీ సంకేతము 'లింగం'. నిర్గుణమూ కాక సగుణమూ కాక - నిర్గుణ సగుణాల సమన్వయ తత్త్వమే లింగం. సగుణ బ్రహ్మను, నిర్గుణ బ్రహ్మను ఆరాధించిన ప్రభావం లింగారాధన వలన సిద్ధిస్తుందని - 'అరూపరూప' తత్త్వాన్ని 'స్థాణు' అన్నారు.
ఇదే అఖండ జ్యోతిః స్వరూపం. 'నారాయణ పరోజ్యోతిరాత్మా నారాయణః పరః'.
నిర్గుణ తత్త్వం సగుణమైన జగత్తుగా పరిణమించడానికి ముందున్న సగుణ నిర్గుణ సమన్వయస్థితియే 'స్థాణు' తత్త్వం.
ఈ సుస్థిర తత్త్వమే సకల జగత్తుకంటే ముందున్నది - జగత్తుని కలిగించినది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML