గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 17 November 2014

సన్యాసి, యతీశ్వరుడు భిక్షకు వెళ్ళాడు అంటే కొన్ని conditions ఉంటాయి. భిక్షాం పుష్టి ఇవన్నీ గొప్ప శబ్దాలు.

సన్యాసి, యతీశ్వరుడు భిక్షకు వెళ్ళాడు అంటే కొన్ని conditions ఉంటాయి. భిక్షాం పుష్టి ఇవన్నీ గొప్ప శబ్దాలు. మనం దరిద్రులు అడుక్కునే దానికి వేసేదాన్ని భిక్ష అంటాం. భిక్ష అంటే ఇక్కడ చూడండి. యతీశ్వరుడు, బ్రహ్మచారి వీళ్ళు చేసేది భిక్ష. యతీశ్వరుడు భిక్షకి వెళ్ళినప్పుడు ఒక టైం లో వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. ఇప్ప్పుడేదో తినాలనిపించింది. వాళ్ళింట్లో గారెలు వండారట. భిక్షకు వెళ్తాను అని వెళ్ళకూడదు. ఎందుకంటే యతీశ్వరుడు శరీరం పోషించుకోనేది బ్రతకాలి కనుక పోషించుకుంటాడు. అంతేతప్ప రుచుల కోసం పోషించుకోడు. అంత రుచుల మీద ఆసక్తి ఉంటె సన్యాసం తీసుకోనక్కరలేదు. సంసారిగా బ్రతికితే చాలు. జ్ఞానమే కావాలి అనుకొనేవాడు యతి. వాడికి ఇంకేమీ అక్కరలేదు. జ్ఞానం కావాలనుకున్న యతికి అది వచ్చేవరకు సాధన దశలో భిక్ష చేసుకోవాలి. భిక్ష ఎక్కడ చేయాలి అంటే శ్రోత్రీయ కుటుంబంలో మంచి గృహస్థు దగ్గరికి వెళ్ళాలి. ఆ గృహస్థు కూడా నిన్నరాత్రి వండింది ఎలాగూ ఉంది వేసేద్దాం అనుకునే గృహస్థు కాకూడదు. వండిన వంటలో గృహస్తులు యతీశ్వరులకి, బ్రహ్మచారులకి, అతిథులకీ, ఉంచుతారుట కొంత భాగాన్ని. పరమాత్మకు కొంత భాగం నివేదణ చేసి ఎదురు చూస్తూంటారు. వారికి పెట్టి తర్వాత తింటారు. అతిథులకీ వాళ్లకి పెట్టి తింటే తృప్తి. అంతేకానీ ఇప్పుడు వాళ్ళు వస్తారు అంటే భయం. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. ఒకవేళ ఎవరూ రాకుండా తింటే ఆ రోజును దుర్దినంగా భావించేవారు ఆరోజులలో. ఎవరూ రాకుండా ఇంట్లో మేం వండుకొని మేమే తిన్నాం అని బాధపడేవారు. ఇప్పుడు వారికి వారే వండుకొని ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఇవాళ బాగా ఖాళీ అయిపోయిందండీ తృప్తిగా ఉంది అనే పరిస్థితి వచ్చింది. పారేస్తే కుక్కైనా తింటుంది. దానిని కూడా తిననివ్వలేదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం చూడండి. అలా ఉండేది సంప్రదాయం. వాళ్ళు మధ్యాహ్నం వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. గృహస్థుకి అతిథి మర్యాద ఎంత చెప్పారో అతిథి కూడా గృహస్థు గురించి ఆలోచించాలి అని మర్యాదలు ఉన్నాయి. వీళ్ళ ధర్మాలు వీళ్ళకి ఉన్నాయి. వాళ్ళ ధర్మాలు వాళ్లకి ఉన్నాయి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML