శ్రీ పద్మావతి దేవి ఉద్భవించిన శ్రీ పద్మసరోవరమున. వైకుంటము విడి నారాయణుడు భుమండలమున శుక మహర్షి నివసించే ఇప్పటి తిరుచానూర్ న చేరుకొని కొన్ని లక్షల సంవత్సరాలు పద్మావతి అనగా పూర్వ నామము వేదవతి అనగా వైకుంట లక్ష్మి కొరకు తపస్సు చేసాడు శ్రీనివాసుడు. శుక మహర్షి ఆశ్రమ సమీపంలో జగన్ మాత శ్రీ పద్మావతి దేవి ప్రత్యక్షమైనది. తను ఆకాశరాజు పుత్రికగా ఎదిగి తమని వివాహము చేసుకొందును అంటూ శ్రీహరికి వరము ఇచ్చి పసి పాప రూపమును పొందినది శ్రీ పద్మావతి. శుక మహర్షిని కలువటానికి వచ్చిన ఆకాశరాజు పసి పాప ఏడుపు విని సరోవరమున కమలమున బంగారు కాంతులు విరజిమ్ముతూ పద్మావతి కనిపిచినది. ఆ పాప ని శుక మహర్షి దగ్గరకి కొనిపోయి తన పాప పెంచుకొందును అంటూ విన్నవించాడు ఆకాశరాజు . రాజ ఈ పసి పాప నీకు పూర్వ జన్మ వరముగా దొరికినది... తండ్రివై పెంచు అంటూ సెలవిచారు శుక మహర్షి. అటుపైన శ్రీహరి వకుళామాత దగ్గర శ్రీనివాసుడు ఎదిగి పద్మావతి ని ప్రేమిస్తూ తన రాక కొరకు ఎదురు చూడ సాగాడు. ఒకనాటి వసంత వేడుకలలో పద్మావతికి శ్రీనివాసుడు ఎదురుపడటం... మనసివ్వటం... వకుళామాతకు తన ప్రేమ సంగతి చెప్పి వివాహము నిశ్చయము చేసుకొని రమ్మని ఆకాశరాజు వద్దకు పంపాడు శ్రీనివాసుడు.. ఎరుకసాని వేషంలో మున్దెహ్ అంతఃపురం చేరుకొని ఆకాశారజునకు పద్మావతి జన్మ కారణం తెలిపింది పార్వతీదేవి. వకుళామాతకు ఎదురై స్వాగతించాడు ఆకాశరాజు. వివాహమునకు సిద్ధము తెలిపినారు రాజ దంపతులు. వివాహము అంగరంగ వైభవముగా జరిగినది. వైకుంటము చేరుటకు గరుడ వాహనము అన్నియు సిద్ధమై ఉండగా... కలియుగమున తన బిడ్డలు పడుచున బాధలు చూసి కన్నెర్ర చేసింది పద్మావతి... దేవి! పద్మావతి..నీవు కన్నెర్ర చేయరాదు ఇది కలియుగము ఈ యుగము ధర్మమూ ఇలానే ఉండుట బ్రహ్మ లికితము దైవము కూడా మౌనమై ఉండవలె అనెను శ్రీనివాసుడు. ప్రభు!! నేను మాతని నా ప్రేమకి యుగ ధర్మానికి సంభంధం లేదు... మీ భక్తులు- నా బిడ్డలు ఇలా పాప పంకిలమున పడి గోశిస్తుంటే నేను వైకుంటము ఎటుల సంతోషముగా ఉండేదా... కావున ప్రభు! తమరు నాకు ఒక్క వరమును ఇవ్వవలె... తమరు కలియుగాంతం వరకు నాతో ఇక్కడే పృధివి మండలమున నివసించవలెను.. భక్తుల కష్టాలు తిర్చలేకపోయిన వారికి శాంతిని నోసగుటకు... సంపదలు ఇవ్వకపోయినా ఆరోగ్యమున ఇవ్వుటకు... ఎదురు పడి సహాయము చేయకపోయినా..వారికి ఎప్పుడు రక్షణగా ఉండుటకు మనము ఇరువరుము ఇక్కడే నివసుచున్నట్లు వరము ఇవ్వండి నాద అని పద్మావతి కోరినది. అటులనే దేవి నీ అజ్ఞాగా భావిస్తాను నేను ఇక్కడే తిరుమల గిరులపై ఉండేదా... నీవు నీ భక్తుల చెంత అనగా తిరుమలగిరి కింద శుక మహర్షి పట్నమున(తిరుచానూరు) నివసింపు అనెను శ్రీనివాసుడు. శ్రిపద్మవతి సరోవర స్నానము చేసిన వారికి ఆ తల్లి తన చేతులతో కర్మలను తొలగించి స్వచమైన హృదయులుగా మలచి కలి భాధలనుండి రక్షణగా నిలుస్తుంది... స్వామి పై అలుగుటకు కారణమూ కూడా తన భక్తులు కోరిన వరములు ఇవ్వలేదనే ఆమెకి అలమేలు మంగా పేరు వచ్చినది. హరి అంత రంగా శ్రీ పద్మావతి దేవి మనలను సదా సర్వదా రక్షణగా ఉండాలని ప్రార్ధిస్తూ. ఓం నమో భగవతి హరివలభే!!

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment