అమ్మనై నీకు లాలపోదామంటే గంగనే శిరము పైన ధరించి ఉన్నావు
తల ద్రువి పులు పెడుదమంటే నెలవంక ధరియించి ఉన్నావు
సుగంధ ద్రవ్యాలను రాదామంటే విభూది ధరియించి ఉన్నావు
ద్రిష్టి పడకుండా బొట్టు పెడదామంటే మూడో కంటిని కలిగి ఉన్నావు
అందమైన వస్త్రాలు కడదామంటే మాసిపోని జంతుచర్మ వస్త్రాన్ని కలిగి ఉన్నావు
అపురమైన ఆభరణాలు అలంకరిద్దామంటే నాగులను భూషణలుగా వేసుకున్నావు
వెండి గిన్నెలో నేతి బువ్వ పెట్టాలనుకుంటే అన్నపుర్ణయే నీ సగ భాగమై ఉన్నది
నీ ఆటలకు బొమ్మలను సేకరిద్దామంటే ఈ జగతి నీ ఆటలకు నిలయమై ఉన్నది
అద్దాల మెడ కట్టిదమంటే అన్యులకు అందని హిమ శిఖరాన కొలువై ఉన్నావు
అమ్మనై...లాలి పాడుదమంటే నిత్యము ధ్యానములో నిమగ్నమై ఉంటావు
ఏ విధముగా నీకు సేవ చేయను....ఏమి ఉన్నదని నీకు అందివను...!!
ఎల్ల లోకములకు తండ్రివి నీవు... ఈ తల్లి పిలుపు విని రావా నేడు....!!
ఓం నమశివాయ...ఓం నమశివాయ....ఓం నమశివాయ ...!!

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment