సోమనాథ్ దేవాలయ విశేషాలు....!
సౌరాష్ట్రే సోమనాథంచ ..అంటూ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ప్రారంభిస్తాం.
సౌరాష్ట్రం అంటే ఇప్పటి గుజరాత్ రాష్ట్రం
సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్‌లో ఉన్న హిందూ పుణ్య క్షేత్రము. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని "ప్రభాస తీర్థం" అని కూడా పిలుస్తారు.
స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్ధం. చంద్రుడిని దక్షుడి శాం నుండి విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనిక ఇది సోమనాధ ఆలయం ఇక్కడి శివుడు సోమనాధుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు. ఆరమార్లు ధ్వంశం చేయబడి తిరిగి పునర్మించబడినందు వలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణించబడుతుంది. చివరిసారిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన సర్దార్ వల్లభాయి పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. పటేల్ మరణానంతరం భారతదేశ మరియొక మంత్రి అయినకె ఎమ్ మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి.
పురాణ కథనం అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని. ఆ తరువాత రావణుడు వెండితోను, కృష్ణుడు దీనిని కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి. భీముడు రాతితోనూ పునర్నిర్మించారని చెబుతారు. చంద్రుడు దక్షుడి కుమార్తెలు తన భార్యలు అయిన 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకోగా మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించిన కారణంగా తనకు ప్రాప్తించిన క్షయ వ్యాధి నివారణార్ధం చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ప్రభాసతీర్ధము. ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై చంద్రుడికి అందరిని సమానంగా చూసుకొమ్మని సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడు.
]
ఈ ఆలయాన్ని ముందుగా నిర్మించిన కాలము సాధారాణ యుగము(చరిత్ర ఆరంభానికి ముందుకాలము). రెండవసారి యాదవరాజైన వల్లభాయి ముందునిర్మించిన అదే ప్రదేశంలో ఆలయాన్ని క్రీ పూ 649లో పునర్నిర్మించాడని అంచనా. తరువాత క్రీ శ 725లో సింధూ నగరఅరబ్ గవర్నర్(రాజప్రతినిధి) జనయాద్ ఈ ఆలయాన్ని ధ్వంశం చేయడానికి సైన్యాలను పంపాడు. 815లో గుర్జర ప్రతిహరా రాజైన రెండవ నాగబటా ఈ ఆలయాన్ని మూడవమారు ఎర్ర ఇసుక రాళ్ళతో బృహత్తర నిర్మాణ్ణాన్ని నిర్మించాడని ఉహించబడుతుంది. క్రీ. శ 1024 గజనీ మహమ్మద్ ధార్ ఎడారి గుండా ఈ ఆలయానికి చేరుకుని తన దండయాత్రలో భాగంగా మరొకసారి ఈ ఆలయాన్ని ధ్వంశం చేసాడు. ఆలయం తిరిగి గుర్జర్ పరమకు చెందిన మాల్వా రాజైన భోజి మరియు అన్హిల్వారాకు చెందిన చోళంకి రాజైన భీమ్‌దేవ్‌ల చేత క్రీ. శ1026 మరియు 1042ల మధ్యీ ఆలయ పునర్నర్మాణం జరిగింది. కొయ్యతో చేయబడిన నిర్మాణం కుమరపాల్ చేత క్రీ శ 1143-1172 ల మధ్య పునర్నిర్మించబడింది. క్రీ శ 1296 ఈ ఆలయం మరొకమారు సుల్తాన్ అల్లాద్దీన్ ఖిల్జీ సైన్యాల చేత తిరిగి కూల్చబడింది. క్రీ శ 1308లో సౌరాష్ట్రా రాజైన చుదాసమా వంశీయుడైన మహీపాదావ చేత ఈ ఆలయం పునర్నిర్మించబడింది. క్రీ శ 1326-1351 మధ్య ఈ ఆలయములో లింగప్రతిష్ఠ జరిగింది. క్రీ శ1375లో ఈ ఆలయం మరొకమారు గుజరాత్ సుల్తాన్ అయిన మొదటి ముజాఫర్ షాహ్ చేత కూల్చబడింది. క్రీ శ 1451లో గుజరాత్ సుల్తాన్ అయిన ముహమ్మద్ చేత తిరిగి కూలచబడింది. క్రీ శ 1701లో ఈ ఆలయం మరొక మారు కూల్చబడింది. క్రీ శ 1701లో ఔరంగజేబు చేత ఈ ఆలయాన్ని మరొకమారు ధ్వంశంచేయబడింది. ఈ ఆలయాన్ని ధ్వంశం చేసిన రాళ్ళను ఉపయోగించి ఔరంగజేబు మసీదును నిర్మించాడు. తరువాత క్రీ.శ 1783లో పూనా పేష్వా, నాగపూరుకు చెందిన ''భోన్స్లే , ఖోలాపూరుకు చెందిన చత్రపతి భోన్స్లే, ఇండోరుకు చెందిన హోల్కార్ రాణి అహల్యాభాయి గ్వాలియరుకు చెందిన శ్రీమంత్ పతిభువా సమిష్ఠి సహకారంతో ఈ ఆలయం పునర్నిర్మించబడింది. కూల్చబడి మసీదుగా కట్టబడిన నిర్మాణానికి సమీపంలోనే నిర్మించబడింది.
గజనీ మహమ్మద్ ఈ ప్రాంతంపై దాడిచేసి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఆఖరిసారిగా ఔరంగజేబు పాలనలో నేలమట్టమయింది. భారత స్వాతంత్ర్యం తర్వాత 1950 సంవత్సరంలో సర్దార్ వల్లభాయి పటేల్ దీనిని తిరిగి నిర్మింపజేశాడు. ఇక్కడి స్తూపాలు, దేవతా మూర్తులు మొదలైన వాటిని ఒక మ్యూజియంలో భద్రపరిచారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది.
దేవాలయానికి దగ్గరలో వెరావల్ సముద్రతీరం ఉన్నది. సమీపంలో భల్కా తీర్థం ఉన్నది. ఇక్కడే శ్రీకృష్ణుడు వేటగాడి బాణం తగిలి అవతారాన్ని చాలించాడని చెబుతారు. సోమనాథ్ లో త్రివేణీ సంగమంగా ప్రసిద్ధిచెందిన హిరణ్, సరస్వతి, కపిల నదులు సముద్రంలో కలిసే దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది.
స్వాతంత్రం రాక ముందు జునాగఢ్ రాజ సంస్థానం ప్రభాస్ పటాన్ అధీనంలో ఉంది. సమైక్య భారతదేశంలో జునాగఢ్ విలీనం అయిన తరువాత అప్పటి ఉపప్రధాని అయిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ 1947 నవంబర్ 12న భ్రతీయ సైన్యాలను క్రమపరిచే నిమిత్తం ఇక్కడకు వచ్చి అదే సమయంలో ఈ ఆలయపునర్నిర్మాణానికి ఆదేశాలను జారీ చేసాడు. ఎప్పుడైతే సర్ధార్ పటేలు, కె ఎమ్ మున్షి మరియు ఇతర నాయకులతో గాంధీని దర్శించి ఈ ప్రస్తావన తీసుకు వచ్చినప్పుడు గాంధీ ఆ ప్రస్తావనకు ఆనందంతో అంగీకరించి ఆలయ పునరుద్ధరణకు కావలసిన నిధులను ప్రభుత్వము నుండి మంజూరు చేయకుండా ప్రజల నుండి చందాలను గ్రహించి చేయవలసినదిగా సలహా ఇచ్చాడు. అయినా త్వరలోనే పటేల్ మరియు గాంధీ మరణించారు. ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలను కె ఎమ్ మున్షీ నిర్వహణలో జరిగింది. కె ఎమ్ మున్షి అప్పుడు నెహ్రు ప్రభుత్వంలో ఫుడ్ అండ్ సివిల్ సప్లై మంత్రిగా పనిచేస్తున్నాడు. 1950 అక్టోబర్ మాసంలో శిధిలాలు తొలగించబడి ప్రస్తుత మసీదు కొన్ని మైళ్ళ దూరానికి తీసుకు పోబడినది. 1951లో భారతప్రభుత్వ ప్రధమ రాష్ట్రపతి అయిన రాజేంద్రప్రసాదు ఆలయ కుంభాభిషేకానికి కె ఎమ్ మున్షి చేత అహ్వానించబడ్డాడు. ఆయన తన ప్రసంగంలో " నా దృష్టిలో ఈ పునాదుల నుండి అద్భుతమైన ఈ బృహత్తర ఆలయం పునర్నిర్మించబడడమే కాక పురాతన సోమనాధ ఆలయ పునరుద్ధణ వలన భారతీయ శిల్పకళావైభవానికి ఈ ఆలయం ఒక తార్కాణంగా నిలిచింది. అయన సన ప్రసంగం పొడిగిస్తూ " పునర్నిర్మించే శక్తి యొక్క గొప్పతనం పడగొట్టే శక్తికంటే ఘనమైనది అనడానికి సోమనాధ ఆలయ పునర్నిర్మణం ఒక ఉదాహరణ " అని ఉద్ఘాటించాడు. ఈ పూర్తి సంఘటన అప్పటి ప్రధాన మంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ రాష్ట్రపతుల మధ్య పెద్ద అఘాతాన్ని సృష్టించింది. జవహర్లా నెహ్రు దీనిని హిందువుల ప్రతి ఘటనగా భావించగా రాష్ట్రపతి రాజేంద్రప్రసాదు మరియు కె ఎమ్ మున్షీ ఈ ఆలయ పునరుద్ధరణ స్వాతంత్ర ఫలంగా మరియు తమకు జరిగిన అన్యాయానికి హిందువుల ప్రతిస్పందనగా భావించబడినది. రాజేంద్రప్రసాదు మరియు కె ఎమ్ మున్షీల చేత పునరుద్దరించబడి దేశానికి సమర్పించిన ఈ సోమనాధ ఆలయం ఇప్పుడు సోమనాధ ఆలయ ట్రస్ట్ చేత నిర్వహించబడుతుంది.
బాణ స్తంభం (యారో పిల్లర్)
కైలాస మహామేరు ప్రసాదం గా పిలవబడే నేటి ఆలయ కట్టడం చాళుక్యులనాటి ఆలయ నిర్మాణ శైలిని లేక కైలాష్ మహామేరు ప్రసాద్ శైలి ప్రతిబింబిస్తుంది. 1951లో ఈ నూతన ఆలయంలో జ్యోతిర్లింగ ప్రతిష్టాపనగావించిన నాటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ "సృష్టించే శక్తి నాశనం చేసే శక్తి కన్నా గొప్పది అనడానికి సోమనాథ్ ఆలయం ప్రతీక" అని అన్నారు. ఈ ఆలయం గుజరాత్ శిల్పాచార్యుల సోమపుర నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం నిర్మించిన స్థలానికీ, ఎక్కడో దక్షిణాన ఉన్న అంటార్కిటిక్ ఖండానికీ మధ్య భూభాగమన్నదే లేదు. ఈ విశేషాన్ని సంస్కృత భాషలో తెలియచేస్తున్న ఒక శాసనం అక్కడి బాణ స్తంభం (యారో పిల్లర్) మీద చెక్కబడియున్నది. వెయ్యి సంవత్సరాల పైబడినదిగా భావిస్తున్న ఈ బాణ స్తంభం అక్కడి సముద్రతీరాన ఉన్న రక్షణకుడ్యము పై నిర్మింపబడినది. ఈ బాణ స్థంభం ఉత్తర దక్షిణ ధృవాల కేంద్ర బిందువుగా భావించబడుతుంది.
1782-1783ల మధ్య శ్రీనాధ్ మహదాజీ సిందే (ఉజ్జయిని, గ్వాలియర్ మరియు మధుర పాలకుడు) లాహోరు పాలకుడైన ముహమ్మద్ షాహ్‌ను ఓడించిన తరువాత విజయోత్సాహంతో లాహోరు నుండి మూడు వెండి ద్వారాలను తీసుకువచ్చాడు. గుజరాత్ పండితులు ఆ చర్యను నిరాకరించడంతో పాలకుడైన గీక్ వాడ్ వాటిని సోమనాధ ఆలయంలో పెట్టించాడు. ఈ ద్వారాలు ప్రస్తుతం ఉజ్జయిని ఆలయాలలో ద్వారములుగా నిలబడి ఉన్నాయి. ప్రస్తుతం వాటిని మహాకాళేశ్వర్ జ్యీతిర్లింగ మందిరం మరియు గోపాల్ మందిర్ లలో చూడ వచ్చు. 1842లో 1 ఎర్ల్ ఆఫ్ ఎడిన్బర్గ్ కు చెందిన ఎడిన్బర్గ్ ప్రసిద్ధిచెందిన ప్రొక్లెమేషన్ ఆఫ్ గేట్స్ పేరుతో చేసిన ప్రకటనలో ఆఫ్ఘన్స్థాన్ లోని గజనీలో ఉన్న గజనీ మహ్ముద్ సమాధిలో ఉన్న ఈ ద్వారాలను గజనీ నుండి తీసుకు వచ్చి భారతప్రభుత్వానికి అందించమని ఆదేశాలను జారీచేసాడు. వీటిని గజనీ మహ్ముద్ సోమనాధ్ ఆలయం నుండి తీసుకు వెళ్ళబడినట్లు తీసుకువెళ్ళినట్లు విశ్వసించబడింది. సోమనాధ ఆలయ ఈ ద్వారాల గురించిన చర్చ 1843లో లండన్లఖౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగినట్లు అధారాలు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య జరిగిన చెలరేగిన చర్చల మంటల తరువాత ఈద్వారాలు వెలికి తీసి విజయవంతంగా వెనుకకు తీసుకురాబడ్డాయి. కాని వచ్చిన తరువాత అవి అసలైన ద్వారాలాలకు ఖచ్ఛితమైన నమూనాలని తెలుసుకున్నారు. అవి ప్రస్తుతం ఆగ్రా స్టోర్ రూమ్ లో ఇంఖా అలా పడి ఉన్నాయి.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment