గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 23 November 2014

రావిచెట్టు విష్ణు స్వరూపం- వేపచెట్టు లక్ష్మీ స్వరూపం.!

రావిచెట్టు విష్ణు స్వరూపం- వేపచెట్టు లక్ష్మీ స్వరూపం.!
రావిచెట్టును పురుషుడుగాను, వేపచెట్టును స్త్రీగాను భావించి పూజించే ఆచారం అనాదిగా వస్తోంది. సాధారణంగా ఈ రెండు వృక్షాలు కలిసి గానీ ... విడివిడిగా గానీ దేవాలయ ప్రాంగణంలో కనిపిస్తుంటాయి. రావిచెట్టును విష్ణు స్వరూపంగాను ... వేపచెట్టును లక్ష్మీ స్వరూపంగాను భావించి భక్తులు వాటికి ప్రదక్షిణలు చేస్తుంటారు.
ఈ విధంగా చేయడం వలన దాంపత్య పరమైన దోషాలు నివారించబడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 'పద్మపురాణం'... 'స్కంద పురాణం' కూడా రావిచెట్టు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపమని చెబుతున్నాయి. ఇక రావిచెట్టు కింద సేద దీరడం వలన శని కారణంగా సంక్రమించిన దోషాలు తొలగిపోతాయి.
అంతేకాకుండా మనసుకి ప్రశాంతత కలిగి రక్తపోటుకి సంబంధించిన వ్యాధులు రాకుండా నియంత్రిస్తుంది. గౌతమబుద్ధుడు జ్ఞానాన్ని పొందినది ... శ్రీ కృష్ణుడు తన అవతారాన్ని చాలించినది ఈ చెట్టుకిందనేనని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
ఇక రావిచెట్టుతో కలిసి పూజలందుకునే వేపచెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగివుంటుంది. వేప ఆకులను నీళ్లలో వేసి కాచి ... ఆ నీటితో స్నానం చేయడం వల్ల చర్మసంబంధమైన వ్యాధులు నశిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.
ఇక వేపచెట్టు పైనుంచి వచ్చేగాలి కూడా క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. ఇలా ఈ రెండు వృక్షాలు ఇటు ఆధ్యాత్మిక పరంగాను... అటు ఆరోగ్యపరంగాను మానవ మనుగడకు ఎంతో మేలుచేస్తున్నాయి కనుకనే దేవాలయ వృక్షాలుగా పూజలు అందుకుంటున్నాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML