నా రాముడి చరిత్ర ప్రచారం లేకుండానే ప్రపంచం దాటింది.
అదే ప్రచారం మోదలు పెడితే?
వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కథకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక విష్ణుపురాణములోరాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారము అని చెప్పారు. భాగవతం నవమ స్కంధములో 10, 11 అధ్యాయాలలో రాముని కథ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో రాముని గురించిన అనేక గాధలున్నాయి.భారత దేశమంతటా వాల్మీకి రామాయణమే కాకుండా అనేక అనువాదాలు, సంబంధిత గ్రంధాలు, జానపధ గాధల రూపంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. మధ్వాచార్యుని అనుయాయుల అభిప్రాయం ప్రకారం మూల రామాయణం అనే మరొక గ్రంధం ఉంది గాని ప్రస్తుతం అది లభించడం లేదు. వేదవ్యాసుడువ్రాసినట్లు చెప్పబడే ఆధ్యాత్మ రామాయణం మరొక ముఖ్య గ్రంధం. 7వ శతాబ్దిలో గుజరాత్ ప్రాంతంలో నివశించిన భట్టి రచించిన "భట్టికావ్యం" రామాయణ గాధను తెలుపుతూనే వ్యాకరణ కర్త పాణిని రచించిన అష్టాధ్యాయిని, ప్రాకృత భాషకు సంబంధించిన అనేక భాషా విశేషాలను వివరిస్తున్నది.[1] ఇతర భారతీయ భాషలలో ఉన్న కొన్ని ప్రధాన రచనలు - 12వ శతాబ్దికి చెందిన తమిళ కవి పంబన్ వ్రాసిన పంబ రామాయణము; 16వ శతాబ్దికి చెందిన తులసీదాస్రచన రామచరిత మానసము.[2]తెలుగులో లెక్క పెట్టడం కష్టమైనన్ని రామాయణ రచనలు, అనుబంధ రచనలు వచ్చాయి. వాటిలో కొన్ని - తిక్కన రచించిన నిర్వచనోత్తర రామాయణము; గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాధ రామాయణము; భాస్కరుడు రచించిన భాస్కర రామాయణము; విశ్వనాధ సత్యనారాయణ రచించినరామాయణ కల్పవృక్షము.రామాయణ కథ భారతదేశం ఎల్లలు దాటింది. అగ్నేయాసియాలో అనేక జానపద గాధలు, కళారూపాలుగా ప్రసిద్ధి చెందింది. అక్కడి స్థానిక గాధలు, ప్రదేశాలు, భాష, సంస్కృతులతో కలిసి ప్రత్యేకమైన ఇతిహాసంగా రూపుదిద్దుకొంది. జావా దీవి (ఇండొనీషియా)లోని కాకవిన్ రామాయణ, బాలిదీవిలోని రామకవచ, మలేషియాలోని హికయత్ సెరి రామ (Hikayat Seri Rama), ఫిలిప్పీన్స్‌లోని మరదియా లవన (Maradia Lawana), థాయిలాండ్‌లోని రామకీన్ - ఇవన్నీ రాముని కథనే ఆయా ప్రదేశాల సంస్కృతితో రంగరించి చెబుతాయి.బ్యాంగ్‌కాక్ నగరంలోని వాట్ ఫ్రా కేవ్ మందిరంలో రామాయణ గాధకు చెందిన అనేక దృశ్యాలు అద్భుతంగా చిత్రీకరింపబడిఇఉన్నాయి. మయన్మార్దేశపు జాతీయ ఇతిహాసం యమ జత్‌దా కూడా బర్మా భాషలో రూపుదిద్దుకొన్న రామాయణమే అనవచ్చును. ఈ కథలో రాముని పేరు యమ. కంబోడియాలోని రీమ్కర్ లో రాముని పేరు ఫ్రీ రీమ్ (Preah Ream). లావోస్ కు చెందిన ప్ర లక్ ప్రా లామ్ కథలో రాముని అవతారమే గౌతమ బుద్ధుడుఅని చెప్పబడింది.
ఓం నమో నారాయణాయ.
మీ బొక్కా సత్యశివబాలబాలాజీ

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment