గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 11 November 2014

సత్యమేవ జయతే..

సత్యమేవ జయతే..
సత్యం స్వతస్సిద్ధంగా జయిస్తుంది. అసత్యానికి తోడుదొంగ అవసరం.''సత్యమునకు ప్రచారము అవసరము లేదు. ఎవ్వరైనా అంగీకరించి తీరవలసినదే. ఉదాహరణకు పాలరంగు తెలుపు అనీ, వెన్నపూస స్వచ్ఛమైన తెలుపుతో మృదువుగా, సున్నితంగా ఉంటుందనీ, మల్లెపూవు సువాసనలు వెదజల్లుతూ మలినంలేని తెల్లదనంతో ఉంటుందనీ, మంచు చల్లగా, స్వచ్ఛంగా ఉంటుందనీ నిప్పు కాలుతుందనీ పనికట్టుకుని ప్రచారం చేయవలసిన అవసరం లేదు. అందరూ ఒప్పుకుని తీరాల్సిన నిజం. సత్యమునకు, ధర్మమునకు, దైవమునకు ప్రచారము అవసరము లేదు. ``ప్రబోధము'' అవసరము. ధర్మమును అనుసరించుట లేదా ఆచరించుట ద్వారా సత్యము బోధపడుతుంది. ఈ మార్గంలో చేసే ప్రయత్నమే జ్ఞానము. తమ తమ కర్మములను (విధులను) ఆచరిస్తూ భక్తిమార్గంలో అంతరాత్మ ప్రబోధంతో నడిచే మానవునికి లభించే జ్ఞానమే (వి)ముక్తి! ఎటువంటి ప్రచారాలకు, ఆడంబరాలకు, ప్రలోభాలకు, నిందలకు లొంగని ఏకైక దైవము సత్యరూపుడైన ధర్మరక్షణ అర్హత, అధికారము కలిగిన దైవము శ్రీ మహావిష్ణువు. రక్షణ భారము వహించవలసిన బాధ్యత ఆ పరమాత్ముడిదే. మినహాయింపు లేదు. నిక్కచ్చిగా నిజం. ఖచ్చితమైన నిజం. దాని పేరు సత్యము. ఎవరైతే సృష్టి(ంచ)చేయగలరో వారే రక్షణ చేయగలరు. ఆ బాధ్యత వారే నిర్వహించగలరు. సృష్టి విలువ వారికొక్కరికే తెలిసి ఉంటుంది. అధికారమునకు, బాధ్యతకు తేడా ఆ స్వామికే తెలిసి ఉంటుంది. సృష్టి, స్థితి, రక్షణ పూర్తిగా స్వామి నిర్వర్తించే ఘనకార్యములు. మోయగలవాడే బరువునెత్తుకోగలడు. ఆ బరువు మోసేవాడే కాపాడుకోగలడు. ఆయన పేరు భగవంతుడు. అటువంటి భగవంతుని గూర్చి తెలుసుకోవడం మన కనీస కర్తవ్యము, సత్కర్మ. నమ్మకానికి, అమ్మకానికి ఉన్నంత తేడా సత్యానికి, ప్రచారానికి ఉన్నది.``సత్యమేవ జయతే''``సృష్టి యజ్ఞా''నికి అధిపతి, ఏలిక అయిన భగవంతుడు శ్రీహరికి నమస్కారములు తెలుపుకుంటూ భగవంతుని మహిమలను, లీలలను, ఎంతో తపస్సు చేసినా లభించని అదృష్టాన్ని యీ ఉత్తమమైన మానవ జన్మలో పొందగలిగే వరాన్ని యిచ్చినటువంటి భగవంతుని గూర్చి తెలుసుకోవడం మన కనీస కర్తవ్యము, సత్కర్మ.సప్త ఊర్థ్వ లోకములు: భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము.సప్త అధో లోకములు: అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, మహాతలము, పాతాళము.సప్త అధోలోకములు, సప్త ఊర్థ్వలోకములతో కూడిన పదునాలుగు లోకములకు ఊర్థ్వమునగల వైకుంఠము సర్వవ్యాపి అయిన శ్రీ మహా విష్ణువునకు నిత్యధామము. వైకుంఠ ధామమునందు పరంధాముడు పరమోజ్వల శుద్ధ సత్యమూర్తిగా విరాజిల్లుతూ ఉంటాడు.వైకుంఠము: అనగా కుంఠిత ధర్మములు లేనిది. కుంఠితమనగా సుఖదు:ఖములు, శీతోష్ణములు, పాప, పుణ్యములు మున్నగు ద్వంద్వములు, కలి అని అర్థము కుంఠిత ధర్మములు లేనిది వికుంఠము, వైకుంఠము ఎటువంటి ద్వంద్వములు లేని కల్మష రహితుడు, పరమోత్కృష్ణుడై ఏకఛత్రాధిపతి అనగా సర్వాధికారి అయిన శ్రీ మహావిష్ణువు కొలువుండే పరంధామము. పరమాత్ముడు, పరమ ఆప్తుడు నెలవుండే దివ్యధామము. ఆత్మబంధువు నివసించే మానస సరోవరము. సర్వజీవులకు ప్రాణమైన ఏకైక దిక్కు, అనాధ నాధుడు, శ్రీనాధుడు వేంచేసియున్న వైకుంఠమే జీవులందరి గమ్యస్థానము. ప్రత్యామ్నాయము(ల)నకు అవకాశము లేని మోక్షదాత మన (ఆత్మ) ప్రాణదాత జగన్నాధుడు, జనార్థనుడు, పరమాత్మ తత్వం జ్ఞానము. రాజమార్గము ధర్మ ఆచరణ. క్షీరసాగర శయనుడు, భగవానుడు, శుద్ధ సత్యమూర్తి, శాశ్వతుడు, పరిపూర్ణుడు, అరుదయిన, అద్భుతమైన, అపూర్వమైన, అపురూపమైన, అందమైన సృష్టికి ఆదిమూలము, సృష్టికర్త, దేవతా చక్రవర్తి, విధికే విధి అయిన పరమాత్ముడు, లోకకల్యాణము కొరకు, ధర్మరక్షణ కొరకు భూలోకములో అవతరిస్తూ ఉంటాడు.ఎప్పుడెప్పుడు ధర్మమునకు పీడ, అధర్మమునకు అభివృద్ధి కలుగునో అప్పుడు భగవంతుడు ఆవిర్భవిస్తాడు. సత్పురుషులను రక్షించుటకు (సజ్జనులను), దుష్టులను శిక్షించుట, ధర్మమును స్థాపించుట కొరకు సాక్షాత్‌ భగవంతుడు నరాకృతిలో జన్మిస్తాడు. ప్రతి యుగమునందు సామాన్య మానుష దేహధారుడై వైకుంఠము నుండి భూలోకమునందు అవతరించే అఖిలాత్ముడు.ధర్మరక్షణ, దుష్టశిక్షణ, శిష్టరక్షణ, లోక కల్యాణ ఘనకార్యములు చేయు అధికారము సృష్టికర్త అయిన శ్రీ మహా విష్ణువునకు మాత్రమే సాధ్యము. అన్యులకు అసాధ్యమైన యీ పని కష్టతరము.జీవుల కర్మల ఫలితములు ప్రసాదించుట ఎవరి కార్యము? ఎవరు చేయగలరు? పునర్జన్మలను, మోక్షమును, కర్మ ఫలితములను, పాప, పుణ్యములను, నిష్కామకర్మలను, యోగులను, జ్ఞానులను, ఉత్తములను గుర్తించి ఫలితములను జన్మజన్మములకు పంపకములు చేయు జ్ఞానము గల సర్వజ్ఞులు ఎవరు? ఆ లెక్కలు తెలిసేది ఎవరికి?దేవుని కుమారులు, దేవదూతలు, బాబాలు, సద్గురువులు, ఫకీరులు, ప్రవక్తలు, భగవంతుని సేవకులు. కారణ జన్ములు తదితరులెవరైనా సృష్టికర్తలు కాలేరు. అవకాశము లేదు. పరమాత్మను చేరుటకు మార్గదర్శకత్వము మాత్రమే చేయగలరు. కారణజన్ములు ఏ కారణమున పరమాత్ముని ఆదేశముతో అవతరించుతారో ఆ కారణమును నిర్ణయించువాడు నడిపించువాడు, నియంత శ్రీ మహావిష్ణువు మాత్రమే. ఆ పరాత్పరుని(స్వామి) దయాభిక్షతో సృష్టికర్తలుగా చెప్పుకోవచ్చునేమో! ఆత్మ ఎవరి సొంతం? ఎవరి ఆదేశముతో, ఎవరి ప్రేరణతో, ఎవరి దయాభిక్షతో భూమిపైన జన్మించి ఉత్తములుగా బ్రతకగలుగుతున్నామో ఆ మహావిష్ణువుని మరచి ఉత్తమ జన్మను ఎవరి సహాయముతో, ఎవరి చేయూతతో, ఎవరి అనుగ్రహంతో, ఎవరి కరుణతో, ఎవరి ప్రేమతో, ఎవరి త్యాగంతో పొందామో మరచి కర్మభూమిలో సత్కర్మలను, సద్భావాలను మరచి చేసిన కర్మల ఫలితాలను (దుష్కర్మ) కొండంత పాపానికి గోరంత శిక్ష వేసే దయా స్వరూపుని గ్రహించ(నమ్మ)కుండా, సత్కర్మలకు గోరంత కర్మకు కొండంత ఫలితమిచ్చే దేవాది దేవుని తూలనాడుతూ బ్రతుకులీడ్చే మనము భగవంతునికి దాసులమా, ఐశ్వర్యానికి దాసులమా ఒక్కసారి ఆలోచించుకోవలసిన అవసరము, బాధ్యత మనపైన ఉందేమో, స్వేచ్ఛకు కూడా హద్దు ఉందేమో!
కలియుగ దైవం శ్రీనివాస రక్ష... సర్వ జగద్రక్ష
శ్రీనివాసుని శ్రీచరణములనే ఆశ్రయించండి.
మీ.....బొక్కా సత్యశివబాలబాలాజీ.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML