శివేచ పూజితే దేవాః పూజితాస్సర్వ ఏవ హి!
తస్మాచ్చ పూజయే ద్దేవం శంకరం లోక శంకరం!!
శివుడిని ఆరాధిస్తే, సకల దేవతలను ఆరాదిన్చినట్లే. అందువలన లోకములకు సర్వ శుభాలను ప్రసాదించే శివుడిని ఆరాధించవలయునని శాస్త్ర వచనం.
ఆత్మస్వరూపా! సముద్రములో స్నానం చేస్తే, సకల నదులలో స్నానం చేసినట్లే. అదేవిధంగా శివుడిని ఆరాధిస్తే, సకల దేవతలను ఆరాధించినట్లే. సకల దేవతలను ఆరాధించడం, సకల దేవతలా పూర్ణ అనుగ్రహం సాధించడం ఎవరికైనా, ఎంతటి వారికైనా అసంభవం, అసాధ్యం. కానీ ఒక్క శివుడిని ఆరాధిస్తే, సకల దేవతలను ఆరాధించిన ఘనత లభిస్తుంది. సకల దేవతలా పూర్ణ అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. శివారాధన ఇంతటి మహత్తరమైనది, మహిమాన్వితమైనది. అందుకే కూర్మ పురాణం
ఏవం విధే కలియుగే దోషాణా మేక శోధనం!
మహాదేవ నమస్కారో ధ్యానం దానమితి శ్రుతిః!!
పాప భూయిష్టమైన కలియుగాన సర్వ మానవుల దోషములను, పాపాలను హరించే ఏకైక సాధనం శివారాధన, శివధ్యానం. ఎవరైతే శివుడికి నమస్కరిస్తారో, శివుడిని ధ్యానిస్తారో వారికి సమస్త దానములు చేస్తే, ఏఫలం కలుగునో ఆ ఫలం కలుగునని తెలిపినది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment