గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 15 November 2014

శ్రీ మహా విష్ణు ప్రాతఃస్మరణము

శ్రీ మహా విష్ణు ప్రాతఃస్మరణము

ప్రాతఃస్మరామి భవభీతి మహార్తి శాంత్యై
నారాయణం గరుడ వాహన మబ్జనాభం
గ్రాహాభిభూత వరవారణ హేతుం
చక్రాయుధం తరుణ వారిజ పత్ర నేత్రం

గరుడ వాహనా రూఢుడు,బోడ్డునందు తామర పూవు గలవాడు,లేత తామర రేకులవంటి కన్నులు గలవాడైన శ్రీ మహా విష్ణువును సంసార భాధా విముక్తికై ప్రాతఃకాలమున స్మరిస్తాను.

ప్రాతర్నమామి మనసా వచసాచ మూర్థ్నా
పాదారవింద యుగళం పరమస్య పుంసః
నారాయణస్య నరకార్ణవ తారణస్య
పారాయణ ప్రవణ విప్రపరాయణస్య

పరమ పురుషుడు,నరకమనెడి సముద్రమును దాటించువాడు, భక్తులను రక్షించుటయందు ఆసక్తి గలవాడైన శ్రీ మహావిష్ణువు యొక్క తామరలవంటి పాదాల జంటను మనస్సుతో ,మాటలతో ,శిరస్సుతో నమస్కరిస్తాను.

ప్రాతర్భజామి భజతా మభయంకరం తం
ప్రాక్సర్వజన్మ కృత పాపభయాపహృత్యై
యో గ్రాహవక్త్రపతి తాంఘ్రి గజేంద్ర ఘోర
శోక ప్రణాశ మకరోత్ ధృతవంఖ చక్రః

మొసలి నోటి యందు చిక్కిన కాలుతో దుఃఖిస్తున్న ఏనుగు శోకాన్ని మాన్పించిన వాడు, శంఖ చక్ర గదాధరుడు నైన విష్ణువును పూర్వ జన్మములందు చేసిన పాపములు పోవుటకై ప్రాతఃకాలములో స్మరిస్తాను.

శ్లోకత్రయ మిదం పుణ్యం ప్రాతఃకాలే పఠేచ్ఛయః
లోక త్రయ గురుస్తస్త్మె దదాత్యాత్మపదం హరిః

పుణ్య ప్రదములైన ఈ మూడు శ్లోకములను ఉదయాన భక్తీ శ్రద్ధలతో పఠించే వాళ్లను శ్రీ మహా విష్ణువు వైకుంఠమునకు చేరుస్తాడు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML