ఇది వాయు స్తంభన విద్య, మహాభారత యుద్ధంలో కౌరవసేన మొత్తం చనిపోగానే దుర్యోధనుడు భయపడి దగ్గరలో ఉన్న ఒక కొలనులో ఆ వాయుస్తంభన విద్య ద్వారానే ప్రవేశించి దాక్కున్నాడు. తరువాత పాండవులు కనిపెట్టి వదించారనుకోండి అది తరువాతి విషయం. ఇలాంటి ఎన్నో విద్యలు ఉన్నాయి. మనదేశం మీద ఆంగ్లేయులు, మహమ్మదీయులు దాడులు చేసి చాలావరకు నాశనం చేసి, కొన్ని గ్రంధాలను అపహరించి, వాటిలోని విద్యలు నేర్చుకొని ''మేమే చేశాం'' అని గొప్పలు చెప్పుకుంటున్నారు. పూర్వికులు తెలియని అమాయకత్త్వంలో కొన్ని పోగోడితే మనం చదువులు సంపదలు అంటూ ఉన్నవాటిని కూడా నాశనం చేస్తున్నాం. కనుక ఈ తరం నుండైనా జాగ్రత్తపడండి. భారతీయ సంస్కృతీ నేర్చుకునే సమయంలో అడ్డం వస్తే తల్లిదండ్రులని కూడా లేక్కచేయవద్దు. ఎందుకంటే వాళ్ళు మనకి సంస్కారం లేకుండా పెంచారు. ఉన్నకొద్దిగా సంస్కారాన్ని కూడా పాడుచేస్తున్నారు. కులవృత్తి చేస్తే నీకెందుకురా ఈ శ్రమ, రామాయణ భారత భాగవతాలు చదువుతుంటే ఈవయస్సులో ఎందుకు? అంటూ ప్రతివిషయంలో అడ్డం వస్తున్నారు. మన సంప్రదాయాలు మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడతారు? మనమైనా కాపాడి రేపటి తరాలవారికి అందించాలి. ఆ భాద్యత మనందరిపై ఉంది గుర్తుంచుకోండి. ఇప్పుడు పరిస్థితులు ఇలానే కొనసాగితే రాబోయేకాలం వినాశకాలమే.

No comments:
Post a Comment